మిత్రులారా..! విజయమో.. వీరావేశమో తేల్చుకుందాం!!
Publish Date:Jun 14, 2022
Advertisement
మూర్ఖపు రాజును గద్దె దింపడానికి ఇతర రాజ్యాలవారు కలవడం అనివార్యం. అయితే అదీ గొప్ప యుద్ధ వ్యూహ రచనతోనే జరగాలి. వూరికే కలిసి టిఫిన్ చేసి నాలుగు కబుర్లు చెప్పుకోవడం కాకుండా పకడ్బందీగా ఒక మాట అనుకుని అందరూ కలిసి ముందడుగు వేయాలి. అపుడే లక్ష్యం సిద్ధిస్తుంది. రాజు మొండివాడ యినా నలుగురి ఆలోచన మొండివాడికీ బుద్ధి వచ్చేట్టు చేస్తుంది. కానీ అందుకు ధైర్యంగా ముందడుగు వేయాలి. అదీ ఏ ఒక్కరిద్దరో చేస్తే కుదరదు. కానీ మొండివాడికి వీరి రహస్యాలు తెలిసి వుంటేనే కష్టం. అలాంటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిశీలించాలి. ఎందుకంటే మొండివాడు ఎప్పటికయినా ప్రమా దమే. దేశంలో బిజెపి ప్రభుత్వానికి జాతీయస్థాయిలో గట్టి ప్రతిపక్షం లేకపోవడం బాగా కలిసివచ్చిందనాలి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒక సందర్భంలో ఎండగడుతున్నా యి. ఎప్పటికప్పుడు ఎదిరించాలనుకుంటున్నాయి. కానీ ఏదీ కార్యాచరణ దాకా రావడం లేదు. కనుక కాం గ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ పెట్టి బిజెపీకి గట్టి షాక్ ఇవ్వాలనే నిర్ణయించుకు న్నారు. అయితే అందుకు నలుగురినీ కూడగట్టుకోవాలి. అందుకు ఎవరు కలిసి వస్తారు? పక్కనే వున్న తెలుగు రాష్ట్రం వైసీపీ ప్రభుత్వం అందుకు ముందడుగు వేసే ప్రయత్నం కూడా చేయలేని స్థితిలో వుంది. అందుక్కారణం వారి రహస్యాలన్నీ కేంద్రానికి ఎరుక గనుక! అసలే ఈడీ చుట్టు ప్రదక్షిణాలతో గడుపుతున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కేంద్రంలో బిజపీ ప్రభుత్వాన్ని ఎదిరించే సాహసం ససెమీరా చేయలేరు. అసలు ఈడీ, ఐటీ శాఖలు ప్రధాని మోదీ, బిజెపీ అధినేత షా జేబులో వుండటంతో ఎవరు మాత్రం ధైర్యం చేస్తారు. కాదు కూడదు అనుకుంటే ఒక్క అడుగు ముందుకేసినా, ఒక్క ఆలోచనతో కేంద్రం వేపు చూసినా మర్నాడు ఉదయం తెల్లారుతూనే ఈడీ సమ్మన్లు గేట్లో పడుంటాయి! ఇక ధైర్యం నీరుగాక ఛస్తుందా? తర్వాత ఎన్నికల్లో కేసీఆర్ కు ఇంకో అస్త్రం కావాలి. ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి మోడీని, బీజేపీని ఎంత విమర్శించినా పెద్దగా మైలేజ్ రాదు.దేశం కోసం నేను బీజేపీకి వ్యతిరేకంగాపోరాడుతున్నా, నాకు మద్దతు ఇవ్వండి" అని ప్రజలకు అప్పీల్ చేయడం కేసీఆర్ కు తేలిక. ఇది అటు లోక్ సభ స్థానాలే కాదు.. అసెంబ్లీ స్థానాలుగెలవడానికి కూడా జాతీయపార్టీ అనేది కేసీఆర్ కు ఉపయోపడుతుంది. ఒకవేళ మోదీ షా తెలం గాణ అసెంబ్లీ ఎన్నికలతోపాటే లోక్ సభకు ముందస్తుగా ఎన్నికలకు వెళ్లినా..మోడీ హవాని తెలంగాణలో ఆపడానికి కేసీఆర్ పెట్టబోయే కొత్త జాతీయ పార్టీ ఉపయోగపడుతుంది. ఒక జాతీయ పార్టీని ఏర్పాటు చేయడం ద్వారా కేసీఆర్ కు వస్తే ప్రధానమంత్రి అనే కొండ వస్తుందనే ఆశ. ఆ కొండ రాకపోతే కనీసం రాష్ట్రంలో అధికారం నిలుపుకోవడానికి అయినా ఉపయోగపడుతుందనే ఎత్తు గడ. అందుకే కేసీఆర్ జాతీయపార్టీ ఆలోచన చేస్తున్నట్లు భావించొచ్చు. ఇక పీకే విషయానికొస్తే.. ఆయన కేసీఆర్ దగ్గర డబ్బు కోసం పనిచేస్తున్నాడా..నిజంగానే కేసీఆర్ మీద నమ్మకంతో పనిచేస్తున్నాడా అనేది ఇంకొద్ది రోజుల్లో తేలిపోతుంది. పీకే గనుక కేసీఆర్ పెట్టే పార్టీలో చేరి బాధ్యతలు తీసుకుంటేనమ్మకం ఉన్నట్లు స్పష్టమవు తుంది. ప్రశాంత్ కిషోర్ కు చాలా రాజకీయ ఆశలు న్నాయి. అంతకుముందు నితీష్ కుమార్ కి చెందిన జేడీ(యు) లో అయన కొన్నాళ్లున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నించి ఫెయిలయ్యారు. ఇప్పుడు బీహార్ లోపాదయాత్ర చేస్తున్నారు. మత తత్వ అజెండా స్థానంలో ప్రజా స్వామ్యానికి చోటు ఉండదు. రాజకీయంగా ఎదగాలని ఆశ ఉన్న ప్రశాంత్ కిషోర్ తన సలహాలతో కేసీఆర్ స్థాపిస్తున్న పార్టీలోచేరడంపై అభ్యంతరం ఉండకూడదు. కేసీఆర్కు పీకే కేవలం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గానే ఉండిపోతే ఆయన కేసీఆర్ దగ్గర డబ్బు కోసం పని చేస్తున్నట్లు అనుకోవచ్చు. కేసీఆర్ జాతీయ పార్టీ వల్ల ప్రజలకి మాత్రం కొంత మంచి జరిగే అవకాశం ఉంది. బీజేపీని గట్టిగా నిలదీసే ఒక కొత్త గొంతు దేశానికి దొరుకుతుంది. రాజకీయ చర్చల్లో మతతత్వ అజెండా స్థానంలో కొద్దిగా అయినా ప్రజల సమస్యలు అజెండాగా మారే అవకాశం ఉంది. ఈ మేరకు కేసీఆర్ కొత్త పార్టీ వల్ల ప్రజలకు ఏమేలు జరుగుతుందో చూడాలి.
కేసీఆర్ ధైర్యంచేసి మోడీపై డైరెక్ట్ అటాక్ చేస్తుంటే..ఇదంతా లాలూచీ కుస్తీ అనే చాలామంది అనుకు న్నారు. ఇప్పుడు జాతీయ పార్టీ ఏర్పాటు చేయడం ద్వారా ఇది లాలూచీ కుస్తీ కాదు.. సీరియస్ పోరాటమే అనే సంకేతాలు ఇవ్వడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ పొత్తు రూపంలో కేసీఆర్ కు ఓ అస్త్రం దొరికింది.
http://www.teluguone.com/news/content/kcr-ready-to-fight-modi-with-his-national-party-25-137661.html





