విచారణకు కేసీఆర్ రెఢీ?!

Publish Date:May 21, 2025

Advertisement

కాదేదీ అవినీతికి అనర్హం. ఈ మాట ఏ కవీ అని ఉండకపోవచ్చును కానీ, అది నిజం. చారిత్రక సత్యం. అందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ మినహాయింపు కాదు. అవును. చిన్న చిన్న చిల్లర పనుల్లోనే స్కాములు జరుగతున్న ప్రస్తుత పరిస్థితులలో వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన  కాళేశ్వరం ప్రాజెక్ట్  నిర్మాణంలో అవినీతి జరగక పోతే ఆశ్చర్య పోవాలే కానీ..  అవినీతి జరిగితే అందులో ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు.

అయితే.. ఇప్పడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి, అత్యంత వేగంగా పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందా లేదా అన్నది అసలు ప్రశ్న కాదు. ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతితో పాటుగా, నిర్మాణ లోపాలపై ఏడాదిన్నరగా విచారణ జరుపుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌   (కాళేశ్వరం కమిషన్‌) మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది.  జూన్‌ 5న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నది. అదే విధంగా నీటి పారుదల శాఖ మాజీ  మంత్రి హరీశ్‌రావు,  ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు సైతం నోటీసులు జారీచేసింది. జూన్‌ 6న హరీశ్‌రావు, అదే నెల 9న ఈటల రాజేందర్‌ ను విచారణకు హాజరుకావాలని కోరింది. 

ఇప్పడు.. ఈ పిలుపు సహజంగానే రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌  విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అయితే.. ,అదే బాటలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా విచారణకు హాజరవుతారా? లేక న్యాయపరంగా అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషిస్తారా అనేది కీలకంగా మారుతోంది. ఒక విధంగా  ఇప్పుడు ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరంగా మారింది. 

అయితే..  అధికారికంగా బీఆర్ఎస్  నుంచి ఎలాంటి ప్రకటన లేక పోయినా..  కేసీఆర్ విచారణకు హాజరు అవుతారనే బీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై రాజకీయ పోరాటానికి దీన్నొక అవకాశంగా తీసుకునే దిశగా సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో అన్ని కోణాల్లో చర్చించి, ముఖ్యంగా న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి రావాలని  ‘ఫార్మ్’ హౌస్ నిర్ణయనికి వచ్చినట్లు చెపుతున్నారు. 

ఈ నేపథ్యంలో కమిషన్  విచారణకు హాజరు కావడం వలన చట్టపరంగా ఎదురయ్యే చిక్కులతో పాటుగా రాజకీయంగా ఎదురయ్యే లాభ నష్టాలను బేరీజు వేసుకుని తుది నిర్ణయంతీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. కాగా.. కేసీఆర్  విచారణకు హరరైనా కాకున్నా, కమిషన్ ఇచ్చే నివేదికలో మార్పు ఏమీ ఉండదు. నిజానికి, రాజకీయ కక్ష సాధింపు లక్ష్యంగా నివేదిక ఇప్పటికే  సిద్దమైందని అంటున్నారు.  కేవలం ఫార్మాలిటీ కోసం మాత్రమే కమిషన్ కేసీఆర్ ను విచారణకు పిలిచింది. మరో వంక విచారణకు హాజరు కాకపోతే..  తప్పును ఒప్పుకున్నట్లు అవుతుందనీ,  అలాగే  రాజకీయ బురద చల్లేందుకు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి కేసీఆర్ విచారణకు హాజరు కావడమే ఉత్తమమని బీఆర్ఎస్  ముఖ్య నాయకులు, ముఖ్య సలహాదారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి  ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు..  తప్పు చేయకపోతే విచారణకు హాజరయ్యేందుకు భయమెందుకు? అంటూ  సన్నాయి నొక్కులు మొదలు పెట్టారు. మరో వంక కాంగ్రెస్ నాయకులు గతంలో ఫార్ముల ఈ కేసులో కేటీఆర్  ఏసీబీ విచారణ తప్పించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పడు కేసీఆర్ కూడా అదే బాటలో నడిస్తే మరింత అభాసుపాలు కావాల్సి వస్తుందనీ..   సో  విచారణను ఒక  అవకాశంగా మల్చు కుని రేవంత్ రెడ్డి చరిత్రను,  కాంగ్రెస్ చరిత్రను ఎండకట్టవచ్చని అంటున్నారు. అలాగే కాళేశ్వరం ఎపిసోడ్ మొత్తం రాజకీయ డ్రామాగానే చూడాలనీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలకు ఇదొక మచ్చుతునక, తప్ప మరొకటి కాదని  పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. 

మరోవంక కొంత వరకు స్తబ్దుగా ఉన్న పార్టీ క్యాడర్ లో సెంటిమెంట్ రగిల్చేందుకు ఇదొక అస్త్రంగా పనిచేస్తుందనిరాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్  ఓడిపోయినా..  కేసీఆర్ పట్ల ఇటు ప్రజల్లో అటు పార్టీ క్యాడర్ లో అంతగా వ్యతిరేకత లేదని అంటున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్  లో అవినీతి జరిగినా.. తెలంగాణ ఉద్యమానికి మూలాధారమైన నీళ్ళు, నియామకాలు, నిధుల్లో.. మొదటిదైన నీళ్ళ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరంతో పాటుగా ఇతర ప్రాజెక్టుల నిర్మాణంతో పాస్ మార్కులు కాదు, ఫస్ట్ క్లాసు మార్కులే తెచ్చుకుందని పరిశీలకులు అంటున్నారు. చివరకు ఏమవుతుందో ఏమో కానీ,  కాళేశ్వరం కమిషన్  కేసీఆర్ ను విచారణకు పిలవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

By
en-us Political News

  
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.