విశాఖ ఉక్కు బీఆర్ఎస్ విజయమేనా?

Publish Date:Apr 14, 2023

Advertisement

తెలంగాణ ప్రభుత్వం, ‘విశాఖ ఉక్కు’ ప్రైవేటు పరం కాకుండా చూసేందుకు, నడుం బిగించింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం, విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేసేందుకు సిద్దమై, పావులు కదుపుతుంటే, తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రయత్నాలను అడ్డుకునేందుకు, ముందు కొచ్చింది. ఆంధ్రులకు జరుగుతున్న అన్యాయానికి మనసు చెదిరిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  సాహసోపేతమైన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రుల హక్కుగా కొట్లాడి తెచ్చుకున్న విశాఖ ఉక్కును  ప్రధాని మోదీ ప్రభుత్వం ఏ ఆదానీకో, అంబానీకో ధారాదత్తం చేయకుండా అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం విశాఖ ఉక్కు  ‘బిడ్’  ప్రకియలో పాల్గొనాలని నిర్ణయించింది.  

కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ .ఈ ప్రకటన చేసినప్పటి నుంచి  బీఆర్ఎస్ మంత్రులు, నాయకులు ఇదే పాట పాడుతున్నారు .రాజకీయ, మీడియా వర్గాల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. అంతే కాదు లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా  తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్పొరేషన్ అధికారులను విశాఖకు పంపింది. అక్కడి పరిస్థితులను పరిశీలించడంతో పాటుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ  అధికారులతో చర్చలు జరుపుతోంది. మరో వంక విశాఖ ఉక్కును  తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లే బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేసేస్తున్నాయి. ముఖ్యమంత్రి దొడ్డ మనసును ..ఆహా ఓహో అంటూ కీర్తిస్తున్నారు. మరో వంక విపక్షాలు తాదూర కంత లేదు మెడకో డోలు  అని ఎగతాళి చేస్తున్నారు.  బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏమైందని ప్రశ్నిస్తున్నాయి. రాష్త్రంలో మూత పడిన సిర్పూర్ పేపర్ మిల్లు, ఆజంజాహి మిల్లు, రేయాన్ ఫ్యాక్టరీలను తెరిపిస్తానని ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాని కేసీఆర్ ప్రభుత్వం విశాఖ ఉక్కు  ప్రైవేట్ పరం కాకుండా బిడ్డింగ్ దాఖలు చేస్తాననడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందని విపక్షాలు విరుచుకు పడుతున్నాయి. 

అయితే అసలు విషయం ఏమంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సిద్దం గాలేదు.  విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్తగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదే విషయాన్ని   గురువారం(ఏప్రిల్ 13) విశాఖలో పర్యటించిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్‌ కులస్తే మరో మారు స్పష్టం చేశారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ఇప్పటికిప్పుడు ప్రైవేటుపరం చేయాలని భావించడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్‌ కులస్తే స్పష్తం చేశారు. అయితే, ఈ ప్రకటనకు తెలంగానా ప్రభుత్వం చూపిన చొరవకు సంబంధం ఉండలేదా అనే విషయం పక్కన పెడితే  తెలంగాణ మంత్రులు మాత్రం క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు.

కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై  గట్టిగా మాట్లాడింది ముఖ్యమంత్రి కేసీఆరేనని తెలిపారు. తెగించి కొట్లాడాం కాబట్టే కేంద్రం తాత్కాలికంగా వెనక్కి తగ్గిందన్నారు.  కేసీఆర్‌ దెబ్బ అంటే అలా ఉంటుందని వ్యాఖ్యానించారు.అయితే  నిజానికి కేంద్ర ఇంతవరకు తీసుకున నిర్ణయంలో వెనక్కి పోయిందా అంటే లేదు. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోలేదు. 

నిజానికి, ఇటీవల కేంద్ర ప్రభుత్వం కేవలం ముడి పదార్థాలు లేదా మూలధనం సమకూర్చేందుకు ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) ప్రకటన మాత్రమే చేసింది. వివరాలోకి వెళితే.. విశాఖ ఉక్కులో ‘కావేరి’ పేరుతో ఉన్న బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 ఏడాదిన్నర కాలంగా మూతపడి ఉంది. ముడి పదార్థాలకు అవసరమైన నిధులు లేక దానిని మూసేశారు. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. మిగిలిన రెండు బ్లాస్ట్‌ ఫర్నే్‌సలు నడిపేందుకు అవసరమైన ముడిపదార్థాలూ సమీకరించలేని దుస్థితి ఏర్పడింది. అన్ని దారులూ మూసుకుపోవడంతో విశాఖ ఉక్కు యాజమాన్యం కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది.

ఎవరైనా ముడి పదార్థాలు సరఫరా చేస్తే… దానికి బదులుగా తయారుచేసిన స్టీల్‌ని ఇస్తాం  అంటూ గత నెలలో ఈవోఐ జారీ చేసింది. తనకు అవసరమైన వనరులను సొంతంగా సమకూర్చుకునే క్రమంలో విశాఖ ఉక్కు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పడు కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుందనే కేంద్ర మంత్రి  స్పష్టం చేశారు. అంటే  కేంద్రం వెనకడుగు వేసిందనే వాదనలో వాస్తవం లేదని అంటున్నారు. 

నిజానికి  ఈ బీడ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొన్నా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తెలంగణ ప్రభుత్వానికి దక్కే ఆస్కారం లేదు.  కేవలం కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నంలో భాగంగానే బీఆర్ఎస్ డ్రామా ఆడుతోందని బీజేపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అంతే కాదు, ప్రతి నెలా ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్న  కేసీఆర్ ప్రభుత్వానికి విశాఖ స్టీల్ ప్లాంట్  కొనుగోలు చేసే స్థోమత గాని, ఆర్ధిక వెసులుబాటుగాని లేదని విపక్షాలు, ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
వీటన్నటికీ మించి  కేసీఆర్ ప్రభుత్వమే కాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థా కూడా పెట్టుబడుల ఉపసంహరణలో పాల్గొనే అవకాశం లేదు. 2022 ఏప్రిల్ 19న ఈ మేరకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. వ్యూహాత్మక రంగాలలోని ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణతో కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి రంగాలలోని ప్రభుత్వ రంగ సంస్థలు ఏవి కూడా పాల్గొనరాదని ఈ ఉత్తరువు స్పష్టం చేసింది. సో.. భవిష్యత్ సంగతి ఏమో కానీ  ప్రస్తుతానికి అయితే  తెలంగాణ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం తరపున సింగరేణి కానీ, బిడ్ లో పాల్గొనే అవకాశమే లేదు. 

భవిష్యత్ లో కేంద్రంలో భారాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి  కేసేఆర్ ప్రధాన మంత్రి అయిన తర్వాత చట్టాన్ని  సవరిస్తే ఏమో కానీ  ప్రస్తుత చట్టాల ప్రకారం విశాఖ స్టీల్ ప్లాంట్ క్రయ విక్రయాల్లో తెలంగాణ  ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా వేలు పెట్టే అవకాశం లేదు. అయితే ఇవ్వన్నీ  సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న కేసేఆర్ కు తెలియదా? ఎనిమిదేళ్ళుగా మంత్రిగా ఉన్న కేటీఆర్ కు తెలియదా అంటే తెలుసు.  అందరికీ అన్నీ తెలుసు. అందుకే  కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు, రాష్టంలో తమ ఇమేజ్ పెంచుకునేందుకు, తండ్రీ కొడుకులు సంయుక్తంగా ఆడుతున్న రాజకీయ డ్రామా గా విపక్షాలు ముఖ్యంగా బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 
అంతేకాదు  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవని, బయ్యారం గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. అప్పుడు ఎంపీగా ఉన్న కేసీఆర్‌ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు.  

తెలంగాణ బొగ్గును ఆంధ్రకు దోచి పెడతారా? బయ్యారం గనులు ఇచ్చేందుకు ఒప్పుకోం  అని తేల్చి చెప్పారు. ఇప్పుడు అదే కేసీఆర్‌ ప్రభుత్వం సింగరేణి ద్వారా విశాఖ ఉక్కును కాపాడతామని చెబుతుండటం చూస్తే..ఒకదాని వెంట ఒకటిగా చుట్టుముడుతున్న సమస్యల సుడిగుండం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు చేసే ప్రయత్నంగానే విపక్షాలే కాదు, విజ్ఞత ఉన్న ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.

By
en-us Political News

  
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.