కేసీఆర్ కొత్త ఎత్తు రాజకీయ వ్యవసాయం

Publish Date:Aug 29, 2022

Advertisement

ఎంత మందికి గుర్తుందో ఏమో కానీ, 2014 ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది గంటల్లోనే, తెరాస అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు, ఒక అమూల్యమైన ప్రకటన చేశారు.  ఇకపై తెరాస ఎంత మాత్రం ఉద్యమపార్టీ కాదు, ఫక్తు పదహారు అణాల రాజకీయ పార్టీ అన్నది ఆ ప్రకటన. ఇక ఆతర్వాత ఏమి జరిగింది, ఇప్పుడు ఏమి జరుగుతోంది గమనిస్తే, ఈ ఎనిమిదేళ్లలో ఆయన అదే మాట మీద నిలబడ్డారు.

అందుకే, ఉద్యమ‘శుద్ధి’ కార్యాన్ని ఓ పవిత్ర కర్తవ్యంగా ముందుకు తీసుకుపోతున్నారు. పుష్కర కాలం పైగా సాగిన, ఉద్యమంలో తన వెంట నిలిచి, ఉద్యమంలో కీలక భూమికను పోషించిన ఏ ఒక్కరినీ వదలకుండా అందరికీ ఉద్వాసన పలికారు. మంత్రివర్గంలోనూ ఉద్యమ ‘మచ్చ’ లేని వారిని ఏరి కోరి తీసుకున్నారు. మొత్తం 16 మంది మత్రులలో పది మంది ఉద్యమం వాసనలు లేని వారే ఉన్నారు. అంతవరకు ఎందుకు, ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం ప్రాణత్యాగం చేసిన 1200ని స్మరించుకునే స్థూప నిర్మాణం ఎనిమిదేళ్లు అయినా ఇంకా పూర్తి కాలేదు. అంటే, ప్రపంచమంతా మెచ్చిన ఒక మహోన్నత ఉద్యమ చరిత్రను సమూలంగా తుడిచేసే ప్రయత్నం చేస్తున్నారు.  

అయితే ఇప్పుడు అదే ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్  మరోమారు, జాతీయ రాజకీయాలకు నిచ్చెనలు వేసే ప్రయత్నం చేస్తున్నారని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్, కారాణాలు ఏవైనా జాతీయ రాజకీయాల్లో తమ కంటూ ఒక స్థానం సంపాదించుకునేందుకు, చాల కాలంగా చాలా చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు మొదలు, ఏకంగా సొంత పార్టీ ఏర్పాటు వరకు అన్ని ఆప్షన్స్ ట్రై చేసి చూశారు. కానీ, ఏదీ వర్కౌట్’ కాలేదు.  శరత్ పవార్ నుంచి స్టాలిన్ వరకు, మమతా బెనర్జీ మొదలు సోరెన్ దాకా, దేవె గౌడ నుంచి అరవింద్ కేజ్రివాల్ వరకు అందరినీ కలిశారు, చర్చలు జరిపారు.అయినా ఫలితం కనిపించలేదు. 

అందుకే ఇప్పుడు కేసీఆర్ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. వ్యసాయ రంగ సమస్యలు ఎజెండాగా  జాతీయ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల పాటు ప్రగతి భవన్‌లో దేశ వ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల ప్రతినిధులతో జరిపిన సమావేశాల ప్రధాన లక్ష్యం అదే అని పరిశీలకులు అంటున్నారు. ఇక్కడ మళ్ళీ కేసేఆర్, తెలంగాణ ఉద్యమాన్ని ఆలంబన చేసుకునే ప్రయతనం చేస్తున్నారు. అందుకే తెలంగాణ ఉద్యమ పంధాలో రైతుల సమస్యలను రాజకీయాలతో ముడివేసే ప్రయత్నం చేశారని అంటున్నారు.

నిజానికి, రాష్ట్రంలో రాజకీయంగా, ఇతరత్రా ఎదురవుతున్న సమస్యల నుంచి బయట పడేందుకే, కేసీఆర్  రైతు రాగం ఎత్తుకున్నారని విపక్షాలతో పాటుగా స్వపక్ష నేతలు కూడా విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థతి ఎంత అధ్వాన్నంగా వుందో వేరే చెప్పనక్కరలేదని అంటున్నారు.  అయితే, కేసీఆర్ మాత్రం, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు పథకాలు అమలవుతున్నాయన్న ఓ ప్రచారాన్ని ఇప్పటికే దేశ వ్యాప్తంగా చేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం చేస్తామని  ప్రకటించారు.

రైతు సెంటిమెంట్‌ను పట్టిస్తే.. ఇక ఎదురే ఉండదని కేసీఆర్ గట్టి నమ్మకం . ఉత్తరాది రైతులు కేంద్రంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని కేసీఆర్ నమ్ముతున్నారు. సకల జనుల సమ్మె తరహాలో సకల రైతుల సమాహారంగా నిరసనలు, దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు చేస్తే .. దానికి నాయకత్వం వహిస్తే.. జాతీయ స్థాయికి వెళ్లినట్లేనని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే, కేసీఆర్ అంతిమ లక్ష్యం జాతీయ రాజకీయాలు కాదు, రైతుల సమస్యలకు పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో ఉద్యమ నిర్మాణం అసలే కాదు, ఆయన ముందున్న తక్షణ సమస్య, సవాలు 2023 తెలంగాణ శాసన సభ ఎన్నికలు ... ఆ గండం గట్టెక్కేటందుకే ...  ఈ రైతు గోస.. అంటున్నారు.

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.