గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వఘేలాతో కేసీఆర్ భేటీ

Publish Date:Sep 16, 2022

Advertisement

జాతీయ రాజకీయాల విషయంలో కేసీఆర్ తగ్గేదే లే అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. అడ్డంకులు, అవాంతరాలు, పరాభవాలు, ప్రతి కూలతలూ ఎదురౌతున్నా ఇసుమంతైనా లేక్క చేయకుండా ముందుకే సాగుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఈడీ దాడుల  ప్రకంపనలను ఇసుమంతైనా పట్టించుకోకుండా జాతీయ రాజకీయాలకు సంబంధించి వరుస చర్చలలో మునిగిపోతున్నారు. ఇరత రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలు, రైతు ప్రతినిథులు, రాజకీయ పార్టీల నేతలు, మాజీ ముఖ్యమంత్రులతో వరుస భేటీలు జరుపుతున్నారు.

తాజాగా శుక్రవారం (సెప్టెంబర్16) ఆయన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వఘేలాతో భేటీ అయ్యారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ బేటీలో దేశ రాజకీయాలు, జాతీయ అంశాలపై చర్చించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాలపైనా ఇరువురి మధ్యా చర్చ జురిగిందని చెబుతున్నారు.  జాతీయ స్థాయిలో రాజకీయాలలో మార్పు రావాలంటే.. కేంద్రంలో అధికారం మారాల్సిందేనన్న కృత నిశ్చయంతో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ దిశగా అందరితో జరుపుతున్న సమాలోచనలలో భాగంగానే శంకర్ సింగ్ వఘేలాతో భేటీ అయ్యారని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ నేతతో కేసీఆర్ భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వఘేలా తాను కొత్తపార్టీ పెట్టగబోతున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన తన పార్టీ తరఫున రాష్ట్రంలోని మొత్తం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ(182) అభ్యర్థులను నిలుపుతానని ప్రకటించిన సంగతి విదితమే.

ఈ నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో భేటీ కావడం రాజకీయంగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 2024 ఎన్నికలలో కేంద్రంలోని మోడీ సర్కార్ ను గద్దె దించడమే ధ్యేయంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.   బీజేపీ ముక్త భారత్ నినాదంతో ముందుకు సాగుతున్న కేసీఆర్ ఇప్పటికే  బీహర్, బెంగాల్, కేరళ, తమిళనాడు, రాష్ట్రాల సీఎంలతో   భేటీ అయ్యారు.  బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీల నేతలతో   చర్చలు జరిపారు. అలాగే  కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితోనూ ఇటీవలే భేటీ అయ్యారు.  ఇప్పుడు గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వఘేలాతో చర్చలు జరిపారు. దసరా లోపుగానే  కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ కలసివచ్చే పార్టీలూ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో విజయవాడలో జరగనున్న సీసీఐ జాతీయ సమావేశానికి కేసీఆర్ కు ఆహ్వానం అందింది. సీపీఐ జాతీయ సమావేశాలలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్సేతర నాయకులతో సీపీఐ నేతలు ఒక సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశానికే కేసీఆర్ ను కూడా ఆహ్వానించారు. 

By
en-us Political News

  
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
రాష్ట్రంలో 25 పారిశ్రామిక ఎకోసిస్టమ్ లను అభివృద్ధి చేస్తాం: లోకేష్
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
1999లో ఎయిర్‌పోర్టుల గురించి ఎవరూ పెద్దగా ఆలోచించని సమయంలోనే.. సీఎం చంద్రబాబు నాయుడు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు.
ఇంట్లో ఆడపిల్ల జన్మిస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టేనని పెద్దలు అంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.