కేసీఆర్‌.. చంద్ర‌బాబును చూసినేర్చుకో!

Publish Date:Jul 29, 2024

Advertisement

రాజ‌కీయాల్లో ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడ‌లు కావ‌టం స‌ర్వ‌సాధార‌ణం. అధికారంలో ఉన్నామ‌ని విర్ర‌ వీగితే అధికారం కోల్పోయిన త‌రువాత ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు భ‌య‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్నారు తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్‌. అన్నీ అనుకూలిస్తే దేశానికి ప్ర‌ధాని కాబోయేది నేనే అంటూ పెద్ద‌ పెద్ద స్టేట్ మెంట్ల‌తో ఎన్నిక‌ల ప్ర‌చారంలో కేసీఆర్ ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇచ్చారు. ప‌క్క‌రాష్ట్రాలైన ఏపీ, మ‌హారాష్ట్ర‌లో బీఆర్ఎస్ పార్టీని విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నాలు కూడా చేశారు. బీఆర్ఎస్ హ‌యాంలో రాష్ట్రానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌చ్చినా.. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు నేను పోయేదేంటి అన్న‌ట్లుగా కేసీఆర్ వ్యవహరించారు. ఇక అసెంబ్లీలో అయితే.. ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్, బీజేపీ స‌భ్యుల‌ను ఓ ఆటాడుకున్నారు. ఇంత‌లా రెచ్చిపోయిన నేత‌ల‌ను ప్ర‌జ‌లు అస్సలు ఉపేక్షించ‌రు. తెలంగాణ ప్ర‌జ‌లు కూడా అదే ప‌నిచేశారు. ఎన్నిక‌ల స‌మ‌య‌లో కేసీఆర్ కు గ‌ట్టి షాకిచ్చారు. దీంతో అధికారం కోల్పోయి.. ప్ర‌స్తుతం అసెంబ్లీకి వ‌చ్చేందుకు సైతం కేసీఆర్ భ‌య‌ప‌డుతున్నారు.  

తెలంగాణ‌లో అధికారం కోల్పోయిన నాటినుంచి మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేదు. పార్టీ నేత‌ల‌కు అప్పుడ‌ప్పుడు స‌ల‌హాలు సూచ‌న‌లు ఇస్తున్నారే త‌ప్ప అధికార పార్టీని నేరుగా ఎదుర్కొనే సాహ‌సం చేయ‌డం లేదు. కేసీఆర్ పై అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చినా.. కాంగ్రెస్ నేత‌లు ప‌దేప‌దే విమ‌ర్శ‌లు చేస్తున్నా ఆయ‌న పెద్ద‌గా నోరు మెద‌ప‌డం లేదు. అసెంబ్లీ స‌మావేశాల‌కు కూడా కేసీఆర్ డుమ్మా కొడుతుండ‌టం బీఆర్ఎస్ శ్రేణుల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. గ‌త అసెంబ్లీ స‌మావేశాల‌కు సైతం కేసీఆర్ హాజ‌రు కాలేదు. దీంతో బీఆర్ఎస్ నేత‌లు, పార్టీ శ్రేణులు కేసీఆర్ అసెంబ్లీకి హాజ‌రు కావాల‌ని ఒత్తిడి చేశారు. అయినా. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు కేసీఆర్ హాజ‌రు కాలేదు. కేవ‌లం బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టే రోజు మాత్ర‌మే అసెంబ్లీకి వ‌చ్చారు.

భ‌ట్టి విక్ర‌మార్క బ‌డ్జెట్ ప్ర‌సంగాన్నివిని  అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద కేసీఆర్ విలేక‌రుల‌తో మాట్లాడారు. వేస్ట్ బ‌డ్జెట్ అంటూ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌డం రాదు.. వాళ్ల‌కు ఏఏ రంగానికి ఎంత కేటాయింపులు చేయాలోకూడా తెలియ‌డం లేదంటూ కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ఆర్నెళ్లు స‌మ‌యం ఇవ్వాల‌ని నేనే అసెంబ్లీకి రాలేదు.. ఇక‌ నుంచి అసెంబ్లీలో కాంగ్రెస్ స‌భ్యుల సంగ‌తి చూస్తా అంటూ కేసీఆర్ చిన్న‌పాటి హెచ్చ‌రిక‌లు చేశారు. 

అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద కేసీఆర్ ప్ర‌సంగాన్ని చూసిన బీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్య‌క్తం చేశాయి. సింహం అసెంబ్లీకి వ‌స్తుంది.. కాంగ్రెస్ నేత‌ల‌కు మూడింది అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు సైతం పెట్టాయి.   కానీ, బ‌డ్జెట్ పై అసెంబ్లీలో జ‌రిగే చ‌ర్చ‌కు సైతం కేసీఆర్ డుమ్మా కొట్టారు. దీంతో అసెంబ్లీకి సింహం వ‌స్తుంద‌ని సోష‌ల్ మీడియాలో పెద్ద‌ పెద్ద పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. అసెంబ్లీకి పోకుండా ఇంటివ‌ద్ద‌ ఏం చ‌స్తున్నావ్ కేసీఆర్ అంటూ అదే సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కొందరైతే ఓ అడుగు ముందుకేసి ఇక కేసీఆర్ ప‌నైపోయింది.. బీఆర్ఎస్ ఖేల్ ఖ‌త‌మే అంటున్నారు. ఇంత‌కీ కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావ‌డం లేదు.. అధికార ప‌క్షం పాల‌నా తీరుపై ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొట్టడానికి ప్ర‌ధాన కార‌ణం ఉంది‌. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో అసెంబ్లీలో కాంగ్రెస్ శ్రేణుల‌ను కేసీఆర్ ముప్పుతిప్ప‌లు పెట్టారు. ముఖ్యంగా ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డికి చుక్కలు చూపించారు. ప్ర‌స్తుతం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో అసెంబ్లీలో ఉండ‌టంతో కేసీఆర్ ప్ర‌తిప‌క్ష హోదాలో అసెంబ్లీకి వెళ్లేందుకు భ‌య‌ప‌డుతున్న‌ట్లు బీఆర్ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.

కేసీఆర్ అసెంబ్లీకి వెళితే.. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ స‌భ్యులు ఆయ‌న్ను టార్గెట్ చేయ‌డం ఖాయం. ఈ క్ర‌మంలో ప‌దేళ్ల పాల‌న‌లో కేసీఆర్ పెద్ద ఎత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం ఉంది. కౌంట‌ర్ ఇచ్చేందుకు కేసీఆర్ త‌ప్ప‌నిస‌రిగా మాట్లాడాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో కేసీఆర్ ను అసెంబ్లీ వేదిక‌గా కాంగ్రెస్ స‌భ్యులు అవ‌మానిస్తార‌ని అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావ‌డం లేద‌ని కొంద‌రు బీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు. కేసీఆర్ ముందుగానే ఎందుకు అలా భ‌య‌ప‌డుతున్నార‌నే వాద‌న‌లు కూడా ఉన్నాయి.

ఈ క్ర‌మంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును చూసి నేర్చుకో కేసీఆర్ అంటూ కొంద‌రు సోష‌ల్ మీడియాలో సూచ‌న‌లు చేస్తున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న చంద్ర‌బాబును వైఎస్ జ‌గ‌న్‌, వైసీపీ స‌భ్యులు తీవ్ర స్థాయిలో అవ‌మానించారు. అయినా, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించేందుకు చంద్ర‌బాబు అసెంబ్లీకి హాజ‌ర‌య్యారు. త‌న‌కు సాధ్య‌మైనంత స్థాయిలో జ‌గ‌న్, వైసీపీ స‌భ్యుల‌కు అసెంబ్లీలో గ‌ట్టిగా ఎదురొడ్డి నిల‌బ‌డ్డారు. చివ‌రికి త‌న భార్య విష‌యాన్ని అసెంబ్లీలో ప్ర‌స్తావించ‌డంతో మ‌న‌స్తాపానికి గురైన చంద్ర‌బాబు.. సీఎం హోదాలోనే అసెంబ్లీలోనే అడుగు పెడ‌తాన‌ని శ‌పథం చేశాడు. అన్న‌ట్లుగా ఎన్నిక‌ల్లో గెలిచి సీఎం హోదాలోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే, చంద్ర‌బాబు త‌ర‌హా రాజ‌కీయాలు కేసీఆర్‌కు అబ్బ‌లేదు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌స్తావించ‌డం కంటే త‌న ప‌రువు మ‌ర్యాద‌లే   ముఖ్య‌మ‌ని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆయ‌న అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా చ‌ర్చ జ‌రుగుతున్నది. కేసీఆర్ తీరుపట్ల బీఆర్ఎస్ నేత‌లు,  కార్యకర్తలు సైతం  ఒకింత ఆగ్ర‌హంతో ఉన్నారు.  

By
en-us Political News

  
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.