ఉద్యమ కారులకు కారులో చోటేది?

Publish Date:Aug 22, 2023

Advertisement

తెలంగాణలో ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైంది. అధికారికంగా ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు కానీ.. సీఎం కేసీఆర్ మాత్రం తమ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేసి ఎన్నికల నగారా మోగించేశారు. సీఎం కేసీఆర్ సోమవారం(ఆగస్టు 21) 115 మందితో కూడిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఎక్కువ శాతం సిట్టింగ్ లకే సీట్లు కేటాయించారు. అటు కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనుండగా.. మిగతా కేసీఆర్ కుటుంబ సభ్యులకు కూడా వారి వారి సిట్టింగ్ స్థానాలలోనే సీట్లు ఖరారు చేశారు. బీఆర్ఎస్ జాబితా బయటకు రావడంతో ఇక అభ్యర్థులు ప్రచారంపై దృష్టి పెట్టగా.. టికెట్లు ఆశించి భంగపడిన అసంతృప్తులు మెల్లిగా తన రాజకీయ భవిష్యత్ ప్రణాళికలు రచించుకొనే పనిలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల వైపు చూస్తున్నారు. మరొక్క వారం రోజులు ఆగితే ఈ అసంతృప్తులలో ఎంత మంది పార్టీలో ఉంటారో.. రెబల్స్ గా మారేది ఎవరో.. పార్టీని వీడి మరో పార్టీకి జంప్ చేసేది ఎవరో   స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

 యధావిధిగా ఈసారి ఎన్నికలలో కూడా కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కాలం నుండి కీలకంగా పని చేసిన కొందరిని పక్కన పెట్టేశారు. గత ఎన్నికలలో కూడా తెలంగాణ ఉద్యమ నేతలకు అన్యాయం జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా.. ఈసారి కూడా అదే తరహా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ఉద్యమకారులకు కొందరికి మొండి చేయి మిగిలించి బంగారు తెలంగాణ కోసమే అంటూ పక్క పార్టీల నుండి వచ్చిన వలస వచ్చిన నేతలకు టికెట్లు లభించాయి. నిజానికి 2014లో పెద్ద ఎత్తున ఉద్యమ నేతలకు టికెట్లు ఇచ్చారు. వారిలో కొద్ది మంది మినహా అంతా ఓటమి పాలయ్యారు. ఆ 
తరువాత బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పేర టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి వలసలను ప్రోత్సహించారు. అప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీలో వారిదే హవా.. వారికే సీట్లు దక్కుతున్నాయి. దీంతో ఉద్యమకారులకు ఎలాంటి పదవులూ లేకుండా పోయాయి. దీంతో కొంతమంది ఇప్పటికే తమదారి తాము చూసుకోగా.. ఒకరిద్దరు సొంత పార్టీలతో తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.

 టీఆర్ఎస్ పార్టీ పుట్టుక నుండి కలిసి నడిచిన నల్గొండ జిల్లాకు చెందిన చాడ కిషన్‌ రెడ్డి, వేముల వీరేశం, ఖమ్మం జిల్లాకు చెందిన బొమ్మెర రామ్మూర్తి, మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రామ్మోహన్‌ గౌడ్‌, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కేఎస్‌ రత్నం లాంటి చాలామంది సీనియర్‌ నేతలకు ఈ సారి జాబితాలో కూడా చోటు దక్కలేదు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని స్టేషన్‌ ఘన్‌పూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజయ్య, ఉప్పల్‌ సుభాష్ రెడ్డి, ఖానాపూర్‌ రేఖా నాయక్, వేములవాడ చెన్నమనేని రమేష్, వైరా రాములు నాయక్, బోథ్ రాథోడ్ బాపూరావు, అసిఫాబాద్ ఆత్రం సక్కు,  కామారెడ్డి గంప గోవర్ధన్ తదితరులు సిట్టింగులే అయినా వీరెవరికీ   ఈసారి కేసీఆర్ ఛాన్స్ ఇవ్వలేదు. వీరిలో దాదాపుగా అందరూ ఉద్యమ కాలం నుంచీ పార్టీతో కలిసి నడిచిన వారే. ఒకరిద్దరు మాత్రమే ఇతర కారణాల చేత టికెట్లు దక్కించుకోలేకపోయారు. దీంతో వీరంతా అసంతృప్తితో తమ తదుపరి కార్యాచరణను రచించుకొనే పనిలో పడ్డారు.

 ఈ నేతల్లో చాలామంది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేశారు. విలువైన భవిష్యత్తును వదులుకొని ఆనాటి టీఆర్ఎస్ జెండా మోశారు. సకల జనుల సమ్మె నుండి వంటా వార్పు వరకు వారే ముందు నడిచారు. పోలీసులతో దెబ్బలు తిన్నారు. కోర్టుల్లో కేసులు ఎదుర్కొన్నారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత తమ త్యాగానికి గుర్తింపు లభిస్తుందని సంబరపడ్డారు. కానీ వారి ఆశలు అడియాసలు అయ్యాయి. ఉద్యమ కాలంలో ఎవరి చేతిలో అయితే వారు తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కొన్నారో.. ఇప్పుడు  వారే అధికారాన్ని చెలాయిస్తుంటే కళ్ళప్పగించి చూస్తున్నారు. కొద్దో గొప్పో మొన్నటిదాకా ఎంతో కొంత విలువ ఉంది. ఈసారి అయినా టికెట్లు దక్కకపోతుందా అని ఆశతో ఉన్నా.. ఇప్పుడిక ఆ ఆశలు కూడా ఆవిరవడంతో తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

By
en-us Political News

  
ఆయన మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడి ఉంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. నెల రోజుల్లో ఆయన మంత్రి ఉద్యోగం పోతుందా? అని ప‌రిశీలిస్తే ఆయ‌న‌కా గండం ఉందనే చెప్పాలి.
వెస్ట్ బెంగాల్ లో మొత్తం 91 లక్షల ఓటు తొలగించారు. అంటే సగటున చూస్తే నియోజకవర్గానికి 31 వేల ఓట్లు తొలగించారు. ఈ తొలగింపు రెండు కారణాల వల్ల చాలా సెన్సిటివ్. మార్జిన్‌లతో పోలిస్తే ..2021లో టీఎంసీ గెలిచిన చాలా సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. 13 సీట్లలో ఇది మూడు వేల కంటే కూడా తక్కువ. ఇటువంటి పరిస్తితుల్లో నియోజకవర్గానికి 31 వేల ఓట్లు డిలిషన్ లో పోతే.. ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది?
మహిళా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేసిందన్నారు. విపక్షాలు సమష్టిగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోడీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారన్నారు. అందుకే ఆయన తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారన్నారు.
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.