జాతీయ రాజకీయాలపై కెసీఆర్ ఫోకస్

Publish Date:May 15, 2023

Advertisement

భారత రాష్ట్ర సమితి నాయకత్వం ఇక జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టనుంది.కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో బిఆర్ఎస్ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలలో  పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి? అక్కడ ఉన్న స్థానిక రాజకీయాలు ,  ప్రధాన ప్రత్యర్థి బిజెపిని ఓడించడం, స్థానిక రాజకీయాల్లో పావులు కదపాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ భావిస్తున్నారు. కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం తర్వాత బిజెపి పాలిత రాష్ట్రాలలో ఏ విధంగా వ్యూహం ఉండబోతుంది అనే అంశం ప్రస్తుతం కెసీఆర్ ముందు ఉన్న సవాల్. కర్ణాటక ఫార్ములాను ప్రయోగించాలని ఆయన మదిలో బలంగా ఉంది. 
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ప్రభావం చూపబోదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావ్ ట్విట్టర్ వేదికగా చెప్పారు. కర్ణాటక ఫలితాలు వచ్చినప్పుడు రామారావ్ యుకెలో ఉన్నారు. తెలంగాణలో బిఆర్ఎస్ శ్రేణులు నిరుత్సాహపడకూడదన్నది ఆయన ఉద్దేశం కావొచ్చు. మంత్రి  కెటి రామారావు ట్విట్టర్ వేదికగా స్పందించే ముందే గాంధీభవన్ లో కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి చేరికలను అడ్డుకోవడానికే కెటిఆర్ ఆ విధంగా  స్టేట్ మెంట్ ఇచ్చి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన పొంగులేటి, జూపల్లి చూపులు కాంగ్రెస్ వైపే ఉన్నట్లు  వార్తలు వినిపిస్తున్నాయి. బిఆర్ఎస్  మూడోసారి అధికారంలో రావాలని చూస్తోంది.  మహరాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి వలసలు పెరిగే అవకాశముందని బిఆర్ఎస్ కు ఉప్పందింది. వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మహారాష్ట్ర మీద ఫోకస్ పెట్టింది. 

 తెలంగాణలోని దక్షిణ జిల్లాల్లో  బిఆర్ఎస్ కార్యకలాపాలు చురుకుగా కొనసాగుతున్నాయ. మెదక్, రంగా రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు కర్ణాటక బార్డర్ లో ఉన్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత ఈ జిల్లాల్లో బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి కప్ప గంతులు వేసే ప్రమాదముందని అధి నాయకత్వం గుర్తించింది.  ఈ జిల్లా వాసులకు కర్ణాటకతో కనెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా వాళ్లు  ప్రతీరోజు కర్ణాటక రాష్ట్రానికి వెళుతుంటారు. కన్నడ వచ్చిన వారు ఈ జిల్లాల్లో ఎక్కువగానే ఉన్నారు. ఈ జిల్లాల్లో ఉన్న వోటర్ల మీద ఎటువంటి ప్రభావం ఉండకూడదన్న తలంపుతో బిఆర్ఎస్ చర్యలు తీసుకుంటోంది. 
జూన్ రెండో తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవం. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో వచ్చిన బిఆర్ఎస్  దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటోంది. ఈ ఉత్సవాలల్లో స్థానికులను భాగస్వామ్యం చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశం మేరకు ఆయా రాష్ట్రాలలో దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నారు. తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలను జరుపుకోవడానికి కారణమైన డెవలప్ మెంట్, వెల్ఫేర్ స్కీంలను అన్ని చోట్ల ప్రచారం చేయాలని ఇప్పటికే కేసీఆర్ పార్టీ క్యాడర్ ను ఆదేశించారు.  
సర్పంచ్ నుంచి మొదలు ఎంఎల్ ఏ,  ఎంపీల వరకు తమ నియోజకవర్గాల్లో అమలవుతున్న ప్రభుత్వ స్కీములను ప్రచారం  చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. ఎందుకంటే వచ్చే డిసెంబర్ లోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. సమయం ఎక్కువ లేదు. ప్రచారమే మన ముందున్న లక్ష్యమని కేసీఆర్ క్యాడర్ కు ఇప్పటికే పిలుపునిచ్చారు. అన్ని సినిమా హాల్స్ లో స్లైడ్స్ వేయాలని, టీవీలు, పత్రికల్లో ప్రచారం చేసుకోవాలని కేసీఆర్ కార్యకర్తలకు ఆదేశించారు.  
 

By
en-us Political News

  
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.