బీఆర్ఎస్ పోరు బాట.. లక్షమందితో కేసీఆర్ పాదయాత్ర.!

Publish Date:Sep 7, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాలలో ఇంత వరకూ ఒకింత స్తబ్దుగా ఉన్న ప్రతిపక్షం బీఆర్ఎస్ ఒక్కసారిగా దూకుడు పెంచింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదివారం (సెప్టెంబర్ 6) ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయాలు ప్రకటించారు.  రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ  విధానాలపై  పోరుబాటకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ నేతలు ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు.  ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు,  రైతాంగ సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. 

ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి  పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నాయకుడు హరీశ్‌రావు సహా పార్టీ ఎమ్మెల్యేలూ, ఎమ్మెల్సీలూ  హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు, సాగునీటి రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, అధికార పార్టీ వైఫల్యాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రత్యేకించి నీటి పారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలతో ప్రభుత్వాన్ని ఎండగట్టాలని నిర్ణయించారు.

లక్ష మంది రైతన్నలను కలుపుకుని సాగే బృహత్తర ప్రజా ఉద్యమంలా పాదయాత్ర చేపట్టాలని ఈ సందర్భంగా కేసీఆర్ పిలుపునిచ్చారు.   రాష్ట్రంలోని   సాగునీటి ప్రాజెక్టులైన కాళేశ్వరం,  పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల సందర్శనలో భాగంగా ఈ పాదయాత్ర కొనసాగాలని చెప్పారు.  రైతుల సంక్షేమం, సాగునీటి హక్కుల పరిరక్షణే లక్ష్యంగా సాగే ఈ పాదయాత్ర ద్వారా  ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కేసీఆర్ చెప్పారు.  

ఇక అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న తరుణంలో శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈభేటీలో చర్చించారు. సభలో ఏయే అంశాలను లేవనెత్తాలి, అధికార పక్షాన్ని ఎలా నిలదీయాలనే దానిపై ప్రజాప్రతినిధులకు కేసీఆర్   దిశానిర్దేశం చేశారు. తనను అసెంబ్లీకి రావాలంటూ సవాల్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బూతులు మాట్లాడుతున్నారని విమర్శించిన కేసీఆర్.. బూతులు మాట్లాడే వారితో చర్చించేందుకు తాను అసెంబ్లీకి రావడం అవసరమా అని ప్రశ్నించారు.  క్షేత్రస్థాయిలోనే తేల్చుకుందామని సవాల్ విసిరారు. కాగా ఈ సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీలో  సాగునీరు, విద్యుత్ సరఫరా, రైతుల సంక్షేమ పథకాల అమలులో లోపాలను అసెంబ్లీ వేదికగా గట్టిగా నిలదీయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఒకవైపు సభలో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే, మరోవైపు ప్రజల మధ్య పాదయాత్ర చేపట్టడం ద్వారా రాజకీయ ఒత్తిడిని మరింత పెంచాలన్నారు.  


[KCR Fires On CM Revanth Reddy, KCR Padayatra, BRS Party, Kaleshwaram Project, Palamuru Project, Telangana Politics, Telugu One]

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అవసరానికి ఆదుకుంటుందనే నమ్మకంతో ఓ వ్యక్తి ర్యాపిడో పార్సిల్ సేవలను ఆశ్రయించాడు.
బిగ్ బ్రదర్ ఆఫీసులో రియల్టర్‌కు ప్రత్యేక ఛాంబర్.. ఒక్క బిల్డర్ కోసం వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తారా?
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న మరో అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు.  
.గరల్స్ హాస్టల్ ముసుగులో నిర్వహిస్తున్న అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. పక్కాగా అందిన సమాచారంతో హైదరాబాద్ ప్రకాశ్ నగర్ లో అమినీత గరల్స్ హాస్టల్ పై దాడి చేయడంలో అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ గుట్టు రట్లైంది.
పలు ప్రాంతాలలో ఇప్పటికే  రోజూవారీ సరఫరా  నిలిపివేశారు. రోజు విడిచి రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ముందు ముందు ఇది రెండు రోజులు, మూడు రోజులు. వారం రోజులకు కూడా పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులే ఆఫ్ ది రికార్డ్ చెడుతున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.