బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనారోగ్యం కారణంగా ఈ నెల 2న ఆయన అనారోగ్యం కారణంగా సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. వైద్య పరీక్షలలో కేసీఆర్ కు షుగర్ లెవెల్స్ అధికంగా, సోడియం లెవెల్స్ తక్కువగా ఉన్నట్లు తెలియడంతో అవి సాధారణ స్థాయికి వచ్చే వరకూ ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు సూచించారు. జ్వరం అదుపులోనికి రావడం, సుగర్, సోడియం లెవెల్స్ సాధారణ స్థితికి రావడంతో ఆయన ఈ ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అంతకు ముందు శుక్రవారం ఆయన ఆస్పత్రిలోనే పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆస్పత్రిలో చేరిన తనను పరామర్శించడానికి వచ్చిన పలువురు బీఆర్ఎస్ నేతలతో ఆక్కడే ఆయన ఇష్ఠాగోష్టి నిర్వహించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, రైతుల కష్టాలు, యూరియా లభ్యత, సాగునీరు, వ్యవసాయం, ఇతర ప్రజా సమస్యలపై ఆయన వారితో ముచ్చటించారు.
అదే సమయంలో వారి నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకున్నారు. బనకచర్ల విషయంలో రేవంత్ సర్కార్ వైఖరిపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇలా ఉంటే కేసీఆర్ త్వరలో మీడియా ముందుకు రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. స్థానిక ఎన్నికలు, జూబ్లీ ఉప ఎన్నిక నేపధ్యంలో ఆయన రాజకీయంగా యాక్టివ్ అవుతారనీ, పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తారనీ బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-discharge-from-hospital-25-201328.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.