కేంద్రంతో తాడో పేడో.. టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం

Publish Date:Jul 16, 2022

Advertisement

కేంద్రంపై పోరు బాటను వీడేదేలే అంటున్నారు కేసీఆర్. కేంద్రంపై ఆయన పూరించిన శంఖారావానికి కదిలి వచ్చిన పార్టీలేవీ లేకపోయినా.. నిరాశ దరికి రానీయకుండా ముందుకే సాగుతున్నారు. ఇప్పటి వరకూ మీడియా సమావేశాలు, సభలకే పరిమితమైన టీఆర్ఎస్ పోరు ఇప్పుడు పార్లమెంటు వేదికగా మోడీతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైంది.సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో కేంద్రం విధానాలపై పోరును తారస్థాయికి తీసుకువెళ్లాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

ఈ మేరకు ఆయన శనివారం జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణకు నిధులు కేటాయింపు విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్  చూపుతున్నవివక్షపై గట్టిగా గళమెత్తాలని ఆదేశించారు. ప్రతీ విషయంలో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందంటున్న కేసీఆర్ కేవలం తెలంగాణ విషయమే కాకుండా..  ప్రజలను మతం పేరుతో రెచ్చగొడుతూ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పార్లమెంటులో బీజేపీయేతర పార్టీల సభ్యులను కూడా కలగలుపుకుని నిరసనను తీవ్రంగా వ్యక్తం చేయాలని తెరాస ఎంపీలకు సూచించారు.

కేంద్రంపై టీఆర్ఎస్ పోరు కేంద్రంలో మోడీ సర్కార్ గద్దె దిగే వరకూ కొనసాగుతూనే ఉంటుందని, ఈ విషయంలో వెనకడుగు ప్రశక్తే లేదనీ స్పష్టం చేసిన కేసీఆర్,  అందులో భాగంగానే  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో టీఆర్ఎస్ విమర్శల వాడి వేడిని  కేంద్రానికి తెలియజేయాలని సూచించారు.  పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీయాల్సిన పలు అంశాలపై వారికి సూచనలు చేశారు.  రాష్ట్ర పతి ఎన్నికలో  యశ్వంత్ సిన్హాకే బీజేపీయేతర పార్టీల ఎంపీల ఓట్లు పడేలా చూడాలని కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలను ఆదేశించాు.  

సమస్యలపై, మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని నిలదీసే విషయంలో విపక్ష పార్టీల సభ్యుల మద్దతు కూడగట్టాలని సూచించిన కేసీఆర్ అందు కోసం ఇప్పటికే టీఎంసీ అధినేత మమతా బెనర్జీతో కేసీఆర్ పోన్లో సంప్రదించారు. గత సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలో ధాన్యం కొనుగోలుపై ఆందోళన చేశారు. అయితే ఆ తరువాత కేంద్రం ముడి బియ్యం తీసుకుంటామని స్పష్టం చేసింది. దీంతో కేంద్రం వైఖరిని నిరసిస్తూ సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. గతంలోలా ఇప్పుడు సమావేశాల బహిష్కరణ కాకుండా సభలో ఉంటూనే అవసరమైతే సభా కార్యక్రమాలను స్తంభింప చేసైనా సరే తెలంగాణ వాణిని దేశ వ్యాప్తంగా వినిపించాలని కేసీఆర్ పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.  

By
en-us Political News

  
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.