Publish Date:Jun 15, 2022
రాష్ట్రపతి ఎన్నిక విషయంలో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేయబోతున్నారన్న సంగతి తెలుగువన్ ముందే అంచనా వేసింది. రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిపై చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశానికి కేసీఆర్ డుమ్మా కొడతారన్న విషయాన్ని తెలుగువన్ ముందుగానే చెప్పింది. తొలుత కేసీఆర్ ప్రతినిథిగా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే.కేను పంపుతారన్న చర్చ జరిగినా చివరికి అది కూడా జరగలేదు. మొత్తంగా టీఆర్ఎస్ ఈ సమావేశానికి డుమ్మా కొట్టింది.
బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతకు కేసీఆర్ చేసిన ప్రయత్నాలకు జాతీయ స్థాయిలో ఏ పార్టీ నుంచీ సానుకూలత వ్యక్తం కాకపోవడంతో ఆయన ఏం నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ముందుగానే వెల్లడించిన తెలుగువన్ మమతా బెనర్జీ ఆహ్వానాన్ని కేసీఆర్ మన్నించే అవకాశాలేలేవని కుండబద్దలు కొట్టేసింది. తెలుగువన్ ముందుగా చెప్పినట్లుగానే కేసీఆర్ మమతా బెనర్జీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశానికి గైర్హాజరయ్యారు. కాగా మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన భేటీ అనుకున్నంతగా సక్సెస్ కాలేదనే చెప్పాలి.
భేటీకి మమతా బెనర్జీ 22 మంది జాతీయ స్థాయి నేతలకు ఆహ్వానం పంపితే వచ్చిన వారు మాత్రం తక్కువ మందే. ఈ భేటీ కోసం మమతా బెనర్జీ ఆహ్వానం పంపిన నేతలలో ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. అయితే వారిలో ఒక్కరు కూడా ఈ భేటీకి హాజరు కాలేదు. కాంగ్రెస్ తరఫున మల్లిఖార్జున్ ఖర్గే, జైరాం రమేశ్, రణదీప్ సింగ్ సూర్జేవాలా హాజరు కాగా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్, ఎస్పీ అధినేత యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఈ భేటీకి హాజరయ్యారు.
విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా శరద్ యాదవ్ పేరును మమతా బెనర్జీ ఈ సమావేశంలో ప్రకటించినప్పటికీ తాను పోటీకి సిద్ధంగా లేనంటూ శరద్ పవార్ స్పష్టం చేయడంతో మరో అభ్యర్థిని ఖరారు చేసేందుకు మరోమారు భేటీ కావాలని సమావేశం నిర్ణయించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-did-not-attend-mamatas-meeting-telugu-one-said-it-earlier-39-137732.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.