ఈడీ దాడుల భయం.. అందుకేనా కేసీఆర్ ఢిల్లీ పర్యటన?

Publish Date:Jul 27, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ ఈడీ దూకుడు చూసి భయపడుతున్నారా? గతంలోనే వాసన పసిగట్టిన ముఖ్యమత్రి, ఇక ఇప్పుడు  ఏ క్షణమైనా ఏదైనా జరవచ్చని ఆందోళన చెందుతున్నారా? ఈడీ దాడుల నుంచి ఫ్యామిలీని కాపాడుకునే ప్రయత్నాలు ప్రారంభించారా?  ఫ్యామిలీ టార్గెట్ గా ఇప్పటికే ఈడీ ఒకడుగు వేసిందా? ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో వ్యాపార సంబంధాలున్న  కాసినో నిర్వాహకులు చిక్కోటి ప్రవీణ్, మాధవ రెడ్డి  హైదరాబాద్ నివాసాలు కార్యాలయాలపై ‘ఈడీ’ సోదాలు చేసిందా? గత కొంత కాలంగా, ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఎక్కడా కనిపించక పోవడానికి, ఇదే కారణమా?

కవిత విదేశాలకు వెళ్ళారని వినిపిస్తున్న వార్తలలో నిజమెంత? ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు,ఈడీ దాడుల భయమే కారణమా? అంటే.. విభిన్న వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ అన్ని ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోందని అంటున్నారు.  ఇక వివరాలోకి వెళితే .. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. నూతన రాష్టపతి ద్రౌపతి ముర్మును మర్యాదపూర్వకంగా  కలిసి అభినందనలు తెలిపేందుకే ముఖ్యమంత్రి  ఢిల్లీ వెళ్ళారని, పనిలో పనిగా జాతీయ రాజకీయాలు, ఇంకొన్ని కీలక కార్యాలు చక్కబెట్టుకుని, రాష్ట్రానికి వస్తారని  ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది . ముఖ్యమంత్రి ఢిల్లీ బయలు దేరక ముందే ఈ మేరకు సీఎంఓ ప్రకటన విడుదల చేసింది.  

అయితే, నిజంగానే, ముఖ్యమంత్రి అందుకే ఢిల్లీ వెళ్ళారా లేక ఇంకా ఏదైనా వుందా అంటే, అసలు ఉన్నదే అదని, అందుకోసమే ఆయన ఢిల్లీ వెళ్ళారని విశ్వసనీయ వర్గాల సమాచారంగా తెలుస్తోంది. కొంచెం ఆలస్యంగానే అయినా, ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచిన విషయాన్ని గుర్తించారు. రేపో మాపో తమ తలుపు తడుతుందని పసిగట్టారు. ఒకప్పుడు ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తులుగా, రాజకీయ అవసరాలకు ఆర్థిక అండదండలు అందించిన కీలక వ్యక్తుల ద్వారా కేంద్ర ప్రభుత్వం, ఈడీ పూర్తి సమాచారాన్ని సేకరించి గుప్పిట్లో పెట్టుకుని దాడులకు సిద్దమవుతున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి, భయ పడుతున్నది నిజమే అని అంటున్నారు. అంతే కాకుండా, దేశంలో జరుగతున్న పరిణామాలు కూడా  ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవరానికి గురిచేస్తున్నాయని  అంటున్నారు. 

ఇప్పటికే, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఉప ముఖ్యమంత్రి, విధ్యాశాఖ మంత్రి, మనిష్  సిసోడియా అరెస్థుకు రంగం సిద్దమైంది. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రివాల్ స్వయంగా, సిసోడియా అరెస్థుకు సంబందించి తమకు ‘విశ్వసనీయ’ సమాచారం ఉందని ప్రకటించారు.  మరోవంక టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో పశ్చిమ బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత పార్థ ఛటర్జీని ఈడీ అరెస్ట్‌ చేసింది. చివరకు అయిన దానికి కాని దానికి కేంద్రం పై కస్సున లేచే బెంగాల్ ముఖ్యమంత్రి మమత  బెనర్జీ కూడా నోరు మెదపలేని విధంగా, ఈడీ పక్కా ఆధారాలు ( నోట్ల కట్టల కుప్పలు) నేరుగా ప్రజల ముందు ఉంచింది.  అందుకే మమత బెనర్జీ,‘పార్థ’  పాపంతో తనకు సంబంధం లేదని, తనని తాను రక్షించుకునే పనిలో  పడి పోయారు.

 ఈ నేపధ్యంలోనే, తెలంగాణలోనూ అలాంటి పరిస్థితి రావచ్చనే ముందు చూపుతోనే ముఖ్యమంత్రి కేసీఆర్  ఢిల్లీలో ‘రహస్య’  మంతనాలు సాగిస్తున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఓ వంక, జరగరానిది జరిగితే, జాతీయ పార్టీ అండ అవసరం అని  భావించే,  ‘ఆత్మ’ ద్వారా కాంగ్రెస్ పార్టీతో మంతనాలు సాగిస్తున్నారు. మరో వంక బీజేపీ పంచన చేరే ప్రయత్నాలు కూడా  కేసీఆర్ చేస్తున్నారని అంటున్నారు.  నిజానికి ,బీజేపీ, ఆ మాట కొస్తే జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఏవీ కూడా కేసీఆర్ ‘విశ్వసనీయత’ను విశ్వసించడం లేదు. అయినా చివరి ప్రయత్నంగా, కేసీఆర్ ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి  తరుణ్ చుగ్’తో  రహస్యంగా సమావేశమైనట్లు  తెలుస్తోంది. ఈ భేటీలో కేసీఆర్, ఖుల్లం ఖుల్లా, తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినా, తెరాసకు  ఎక్కువ  సీట్లు వచ్చినా. సీట్ల సంఖ్యతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో బీజేపే ప్రభుత్వం ఏర్పాటుకు తెరాస సంపూర్ణ మద్దతు ఇస్తుందని, అందుకు ప్రతిగా, తమ కుటుంబాన్ని, ఈడీ దాడుల నుంచి రక్షించాలని కోరినట్లు తెలుస్తోంది.

అయితే, అక్కడిక్కడే తరుణ్ చుగ్  నో చెప్పి నట్లు తెలుస్తోంది.  గతంలో తమకున్న చేదు అనుభవాలతో పాటుగా, తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మాటిచ్చి చేయిచ్చిన అనుభవాన్ని తరుణ్ చుగ్  గుర్తు చేసి, కేసీఆర్ కు  దండం పెట్టారని బీజీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.  అదలా ఉంటే, కాసినో నిర్వాహకులు చిక్కోటి ప్రవీణ్, మాధవ రెడ్డి  హైదరాబాద్ నివాసాలపై జరిపిన దాడుల్లో కీలక సమాచరం లభించిందని, ఇందుకు సంబందించి ఫస్ట్ అరెస్ట్ త్వరలోనే ఉండే అవకాశం ఉందని అంటున్నారు.అదీగాక, తాజాగా సుప్రీం కోర్టు మనీ లాండరింగ్ కేసుల్లో , విచారణ, అరెస్టులు, ఆస్తుల స్వాధీనం వంటి  అధికారాలు ఈడీకి ఉంటాయని, స్పష్టమైన తీర్పు ఇచ్చిన  నేపధ్యంలో, ఈడీ ముందు ముందు మరింత దూకుడు పెంచినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి, అయన కుటుంబ సభ్యులు ఆందోళన చేడుతున్నారని అంటున్నారు.

By
en-us Political News

  
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.