కేసీఆర్ కు ఓటమి భయం- కాంగ్రెస్ కు దాసోహం.. విలీనానికి సిద్ధమంటూ ప్రాధేయం?!

Publish Date:Apr 25, 2022

Advertisement

రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి నామమాత్రమే అంటూ తరచూ కాంగ్రెస్ ను చులకన చేస్తూ మాట్లాడే తెరాస అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు ఆదే కాంగ్రెస్ పార్టీని తెరాసను విలీనం చేయమంటూ ప్రాధేయపడుతున్నారు.
కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందా? గట్టెక్కాలంటే కాంగ్రెస్ కు దాసోహం అనడం తప్ప మరో మార్గం లేదన్న నిర్ణయానికి వచ్చారా? వరుసగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అదే జరుగుతోందని అనిపించక మానదు.  రాష్ట్రంలో టీఆర్ఎస్ ను మూడో సారి అధికారంలోకి తీసుకురావాలన్న తన ప్రయత్నాలు ఫలించేలా లేవన్న నిర్ణయానికి వచ్చిన కేసీఆర్... కనీసం ఫేస్ సేవింగ్ గేమ్ తో అయినా కింద పడ్డా పైచేయి అనిపించుకోవాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు.   అందులో భాగంగానే రెండు వారాల కిందట హస్తిన పర్యటనలో ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీలో భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సమక్షంలో దాదాపు రెండున్నర గంటల పాటు ఈ భేటీ జరిగింది. విశ్వసనీయ వర్గాల ద్వారా వెల్లడైన ఆ భేటీ వివరాలలో కేసీఆర్ కాంగ్రెస్ కు దాసోహం అన్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. బేషరతుగా కాంగ్రెస్ లో తెలంగాణ రాష్ట్ర సమితిని విలీనం చేయడానికి కేసీఆర్ ప్రతిపాదించారని అంటున్నారు. అయితే కేసీఆర్ ప్రతిపాదనపై సోనియాగాంధీ వెంటనే నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. గతంలో అంటే తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా పార్లమెంటులో తెలంగాణ బిల్లును ఆమోదిస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కేసీఆర్ చెప్పి ఆ తరువాత మాట తప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి కేసీఆర్ మాటలను విశ్వసించడం లేదని పరిశీలకులు అంటున్నారు. అందుకే కేసీఆర్ ప్రతిపాదన చేసి దాదాపు పక్షం రోజులు గడుస్తున్నా..ఆ విషయంపై సోనియా స్పందించలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రగతి భవన్ లో కేసీఆర్, పీకేల మధ్య భేటీ జరిగిందనీ, సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో కేసీఆర్ సోనియా గాంధీ వద్ద చేసిన ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తున్నది. తన ప్రతిపాదనకు సోనియా గాంధీ అంగీకరిస్తే.. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణకు అదనంగా మరో 
ఆరు రాష్ట్రాలలో ఫండింగ్ చేయడానికి కూడా కేసీఆర్ ప్రతిపాదించినట్లు సమాచారం. అలాగే తెలంగాణలో సీఎంగా తన కుమారుడు కేటీర్ కు అవకాశం ఇవ్వాలనీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తనకు ఉప ప్రధాని పదవినీ కేసీఆర్ కోరారని చెబుతున్నారు.  అయితే కేసీఆర్ ప్రతిపాదనలపై కాంగ్రెస్ స్పందన ఏమిటన్నతి తెలియాల్సి ఉంది. గతంలో విలీనం పేరు చెప్పి కేసీఆర్ ధోకా ఇచ్చిన నేపథ్యంలో కేసీఆర్ ప్రతిపాదనపై సోనియా వెంటనే స్పందిచకపోవడంతో ఆమె నిర్ణయం ఏమిటన్నది సస్పెన్స్ గా ఉంది. 

రాష్ట్రంలో తెరాస ప్రతిష్ట దెబ్బతిందనీ, ఈ సారి ఎన్నికలలో గట్టెక్కడం సులువు కాదనీ కేసీఆర్ స్వయంగా చేయించిన సర్వేలు తేల్చాయనీ, అలాగే పీకే తన టీమ్ తో చేయించిన సర్వే కూడా అదే విధంగా ఉండటంతో  కేసీఆర్ వ్యూహాత్మకంగా కేంద్రంపై యుద్ధం ప్రకటించినా, ధాన్యం కొనుగోళ్లపై ఉద్యమాలకు తెరలేపినా ఆశించిన ఫలితం రాకపోవడం, అంతకు ముందు  
 కేంద్రంలో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు కోసం   ప్రయత్నాలు ఆశించిన విధంగా ముందుకు సాగకపోవడంతో  కేసీఆర్ కాంగ్రెస్ ను శరణుజొచ్చారని చెబుతున్నారు.
   జాతీయ స్థాయిలో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ ఐక్యం కావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో అందుకు తొలి అడుగుగా తాను టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తాననీ కేసీఆర్ ప్రతిపాదించినట్లు చెబుతున్నారు.  రెండు వారాల నాడు హస్తినలో సోనియాతో చర్చల కొనసాగింపులో భాగంగానే ప్రశాంత్ కిశోర్ కేసీఆర్ తో ప్రగతి భవన్ లో భేటీ అయ్యారని అంటున్నారు. సోనియా గ్రీన్ సిగ్నల్ ఇస్తే 
  ఈ ఒప్పందాన్ని ఆచరణలోనికి తీసుకువచ్చేందుకు అవసరమైన కార్యా చరణ ప్రణాళికపై  ప్రశాంత్ కిశోర్ కసరత్తు చేయనున్నారు. తెలంగాణ కాంగ్రెస్, తెరాస నాయకులకు సీట్లు, పదవుల సద్దుబాట్లు తదితర అంశాలపై ఈ కసరత్తు జరగాల్సి ఉంది. అయితే ఈ విలీనం ప్రతిపాదనకు టి.కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందన్న దానిపై పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి.  
 ప్రాంతీయ పార్టీగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఓటమి ఎదురైతే మళ్లీ పుంజుకోవడం కష్టమన్న ఉద్దేశంతోనే...కాంగ్రెస్ లో విలీనం చేసి పరువు దక్కించుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు.

By
en-us Political News

  
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.