దళిత బంధు.. టీఆర్ఎస్ కు వరమా.. శాపమా?

Publish Date:Jul 29, 2021

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు జారారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలవడం కోసమే దళిత బంధు పథకం తీసుకొస్తున్నామని, తమదైన శైలిలో కుండ బద్దలు కొట్టారు. ఇప్పుడు ఆ జారిన మాటే, అయన మెడకు చుట్టుకుంటోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గొనె ప్రకాశ రావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.  దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ అమలుకు ఉప ఎన్నికలు జరగనున్న హుజురాబాద్ నియోజక వర్గాన్ని ఎంచుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఆయన తమ లేఖలో అధికార పార్టీ ఇప్పటికే అనేక అక్రమాలకు పాల్పడుతోందని, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ హుజురాబాద్ ఓటర్లను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. కాబట్టి, హుజురాబాద్ ఉప ఎన్నికను వెంటనే నిర్వహించడంతో పాటుగా, అధికార తెరాస విచ్చలవిడిగా చేస్తున్న ఖర్చుపై నిఘా పెట్టాలని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అలాగే, కేంద్ర బలగాలను దించి ఎన్నికలు నిర్వహించాలని కూడా గొనె ప్రకాశ రావు టం లేఖలో పేర్కొన్నారు. దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్  హుజురాబాద్’లో  కాకుండా మరో నియోజక వర్గంలో అమలు చేయాలని, ఆ విధంగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. 

తాజాగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్జీజీ) మరో అడుగు ముందు కేసి ఉప ఎన్నికలు ముగిసే వరకు హుజురాబాద్ నియోజక వర్గంలో దళిత బంధు సహా కొత్తగా ఏ సంక్షేమ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించకుండా చర్యలు తీసుకోవాలని, కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఎన్జీజీ  కార్యదర్శి ఎం.పద్మనాభ రెడ్డి ఈ మేరకు ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో, ఉప ఎన్నికలలో గెలుపు కోసమే, దళిత బంధు పథకం ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అని పేర్కొన్నారు. అలాగే, ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆగష్టు నెలల్లో దాదాపు వెయ్యి కోట్లు నగదు బదిలీ చేయబోతోందని పద్మనాభ రెడ్డి తమ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది.

అసలు ఈ లేఖలను పట్టించుకుంటుందా అనే విషయాన్ని పక్కన పెడితే, ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకుంటున్నది కూడా ఇదే అని, ఎదో విధంగా ఎవరో ఒకరు అడ్డుపుల్ల వేసి, పథకం అమలును అడ్డుకోవాలనే అయన కోరుకుంటున్నారని, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే, ప్రతిపక్ష పార్టీలు, ఆరోపణలు చేస్తున్నాయే కానీ, ఫిర్యాదులు చేయడం లేదు. నిజానికి, చివరి వరకు ఎవరూ అడ్డుకోకపొతే,  ఎవరో ఒకరితో కోర్టులో ఒక పిల్ వేయించి, తప్పించుకునే వ్యూహంతోనే ముఖ్యమంత్రి అమలు  చేయడం అసాధ్యమని తెలిసి కూడా దళిత బంధు ప్రకటించారని సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది.  అందుకే, ఇప్పుడు ముఖ్యమంత్రి  కొత్త ఎత్తులకు పదును పెడుతున్నారని అంటున్నారు. అలాగే, ప్రతిపక్షాలు కూడా, దళిత బంధు  పథకాన్ని ఒకే సారి రాష్ట్ర మంతా అమలు చేయలాని, అదే చేత్తో  బీసీలు, ఎస్టీలకు కూడా పథకం వర్తింప చేయాలని డిమాండ్  చేస్తున్నాయి. 

దళితులు కూడా దళిత బంధు విషయంలో అంతగా ఆశలు పెట్టుకోలేదు. ఎన్నికలకు ముందు ... కొద్ది మందికి అది కూడా తెరాస క్రియాశీల సభ్యులకు ఇస్తే ఇస్తారేమో కానీ, ఎన్నికల తర్వాత పథకాన్ని అటకెక్కిస్తారని దళిత యువకులే ప్రచారం చేస్తున్నారు. గతంలో చేసిన దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి హమీలలాగానే, దళిత బంధు కూడా ఎప్పటికీ అమలు కానీ హామీల జాబితాలో చేరుతుందని అంటున్నారు. అంతే, కాకుండా దళిత బంధు,  ముఖ్యమంత్రి, ప్రభుత్వ విశ్వసనీయతను మరింత పలచన చేస్తుందని, ఫలితంగా మరో రెండేళ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కూడా ఈ ప్రభావం ఉంటుందని తెరాస ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్టకు పోయి హుజురాబాద్’ లో గెలిఛితీరాలనే ఉద్దేశంటిఓ వేస్తున్నా అడుగులు, చేస్తున్న తప్పులు హుజురాబాద్’లో  ఏమి చేస్తాయో ఏమో కానీ, తమ నియోజక వర్గాల్లో ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన చెందుతున్నారు. ఒక విధాయంగా చూస్తే, దళిత బంధు, ప్రతిపక్షాల కంటే తెరాస ఎమ్మెల్యేలు, నాయుకునే ఎక్కువగా భయపెడుతోంది. తెరాస నేతల్లో దాదా పుట్టిస్తోందని అంటున్నారు. 

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.