Publish Date:Jul 27, 2024
తాను జీవించి వున్నంతకాలం తెలంగాణ రాష్ట్రానికి తానే ముఖ్యమంత్రి అనే భ్రమల్లో బతికిన కేసీఆర్ అహంకారపూరిత పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారు. అందుకే, తెలంగాణ ప్రజలు కేసీఆర్ భ్రమల్ని వదిలించారు. కేసీఆర్ అధికారాన్ని ఊడబెరికి, కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. దాంతో అధికార వైరాగ్యంలో పడిపోయిన కేసీఆర్ ఇంతకాలం అసెంబ్లీ ముఖాన్ని చూడకుండా ఫామ్‌హౌస్ రాజకీయాలు చేస్తూ ఏడునెలలపాటు టైమ్‌పాస్ చేశారు. దాదాపు పదేళ్ళపాటు అధికారాన్ని వెలగబెట్టిన కేసీఆర్‌కి ఇంతకాలం ఒక్కరోజు కూడా ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించలేదన్న విమర్శలు భారీ స్థాయిలో వినిపిస్తున్నాయి. అందుకేనేమో, ‘కేసీఆర్ ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు’ అనే మాట వినిపించకుండా చేయడం కోసమేమో, ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి వచ్చి వెళ్ళారు.
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమర్పిస్తున్న సమయంలో కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ సమయంలో ఆయన ముఖంలో ఏదో చిరాకు. తన సొంత ఆస్తిని ఎవరో అనుభవించేస్తున్నారన్న బాధ. తాను కష్టపడి, చెమటోడ్చి సంపాదించిన ఆస్తిని తనకు కాకుండా చేశారన్న ఆవేదన ఆయన ముఖంలో కనిపించాయి. కొద్దిసేపు అసెంబ్లీలో కూర్చున్న ఆయన బయటకి వచ్చి, మీడియా ముందు తనదైన శైలిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, బడ్జెట్ మీద ఏడ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ని చులకన చేస్తూ మాట్లాడారు. ఈ సందర్భంలో కేసీఆర్ పక్కనే వున్న వెకిలి బ్యాచ్ వెకిలి నవ్వుల సంప్రదాయాన్ని కొనసాగించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్ మీద ఏడ్చిన కేసీఆర్, ఆ తర్వాత బడ్జెట్ మీద చర్చ జరుగుతున్న సమయంలో అసెంబ్లీకి రాకుండా ఫామ్‌హౌస్‌లోనే సెటిలైపో్యారు.
కేసీఆర్ ఒక్కరోజు... అది కూడా కొద్దిసేపు అసెంబ్లీకి వచ్చింది ఎవర్ని ఉద్ధరించడానికి? అలా మొక్కబడిగా అసెంబ్లీకి వచ్చి పోవడానికేనా ప్రజలు ఆయనకి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చింది? బడ్జెట్ జరుగుతున్న సమయంలో అసెంబ్లీకి వచ్చింది, బడ్జెట్ మీద మీడియా ముందు ఏడ్చిన కేసీఆర్, ఇప్పుడు బడ్జెట్ మీద చర్చ జరుగుతున్న సమయంలో కూడా అసెంబ్లీకి వచ్చి, మీడియా ముందు ఏడ్చిన ఏడుపేదో అసెంబ్లీలో కూడా ఏడ్వచ్చు కదా? ఆ ఏడుపు విని, బడ్జెట్ ప్రతిపాదనల్లో ఏవైనా పొరపాట్లు వుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరిదిద్దుకుంటుంది కదా? ఏడ్వాల్సిన చోట ఏడ్వకుండా, ఏడ్వాల్సినప్పుడు ఏడ్వకుండా వుండటం ఎంతవరకు కరెక్ట్?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-comments-on-budget-39-181611.html
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.