తానే మారెనా..వ్యూహమే మార్చెనా..? కేసీఆర్ వ్యూహం మార్పు కారణమేంటి?

Publish Date:Apr 30, 2022

Advertisement

టూ బర్డ్స్ ఎట్ వన్ షాట్ అన్నట్లుగా  బిజెపి ఇటు టిఆర్ఎస్ ని, అటు కాంగ్రెస్ ని ఒకే సారి టార్గెట్ చేసిందని గ్రహించారేమో.. సిఎం కెసిఆర్ తన వ్యూహాన్ని సమూలంగా మార్చేశారు. ప్రశాంత్ కిషోర్ భుజాలపై తుపాకి పెట్టి టిఆర్ఎస్ ను, కాంగ్రెస్ ను రెండింటిని ఏకకాలంలో లక్ష్యం చేసింది బిజెపి. ఈ నేపథ్యంలోనే జాతీయ రాజకీయాలపై దృష్టి పెడితే.. రాష్ట్ర రాజకీయాలలో తమ ఆధిపత్యానికి గండి పడే అవకాశాలు ఉన్నాయన్న బావనతోనే తెురాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తన వ్యూహాన్ని మార్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ వ్యూహం గ్రహింపునకు రానంత కాలం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వెలుగు వెలగాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచించి, ఆ దిశగా అడుగులు వేసిన కేసీఆర్.. బీజేపీ ఎత్తుగడ గ్రహించిన మరుక్షణమే తన వ్యూహాలను మార్చుకున్నారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని ముందుకు సాగితే..  తెలంగాణలో టిఆర్ఎస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న అంచనాకు కేసీఆర్ రావడంతోనే...దిశ మార్చుకుని, వ్యూహాలను మార్చుకుని   రాష్ట్ర రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించాలన్న నిర్ణయానికి వచ్చారన్నది పరిశీలకులు అభిప్రాయం.

2018 ఎన్నికల్లో తెరాసకు అప్పటి రాజకీయ సమీకరణాలు బాగా కలిసి వచ్చాయి. అదును చూసి ముందస్తుకు వెళ్లిన కేసీఆర్ ఆశించిన దాని కన్నా ఎక్కువగా ప్రయోజనం పొందారు. అందుకుకారణం అప్పటి ఎన్నికలలో  కాంగ్రెస్, టిడిపిలు పొత్తు పెట్టుకుని పోటీ చేయడమే. కాంగ్రెస్, తెలుగుదేశంల పొత్తు కేసీఆర్ కు బాగా కలిసి వచ్చింది. ఆయాచితంగా మరోసారి సెంటిమెంట్ అనే బలమైన ఆయుధాన్ని ఆయన చేతికి ఇచ్చింది.

మళ్లీ తెలంగాణను దోచుకునేందుకు కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి వస్తున్నాయంటూ ప్రచారంతో ఊరూవాడా ఏకం చేసేశారు. మరోసారి తెలంగాణ ఉద్యమం నాటి స్థాయిలో సెంటిమెంటును రగిల్చారు. ఫలితంగా  తెలంగాణలో  కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు భారీ మూల్యం చెల్లించుకున్నాయి. 

ఇప్పుడు అలాంటి అవకాశాన్ని బీజేపీ అందిపుచ్చుకునేందుకు ప్రశాంత్ కిశోర్ రూపంలో అవకాశం వచ్చింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏక కాలంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తోనూ, తెలంగాణలో కేసీఆర్ తోనూ చర్చలు జరపడంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ లు కలిసిపోతున్నాయన్న ప్రచారానికి బీజేపీ తెరతీసింది. 2018 ఎన్నికలలో తెరాస ఎలాగైతే కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తును ఉపయోగించుకుని ఎలా రాజకీయ లబ్ధి పొందిందో...సరిగ్గా అలాగే కాంగ్రెస్, తెరాస ములాఖత్ పేరుతో బీజేపీ లబ్ధి పొందేందుకు ఉపయోగించుకోవాలనుకుంది. ఈ ఎత్తుగడను సకాలంలో పసిగట్టిన కేసీఆర్ ఒక్క సారిగా తన వ్యూహాలను మార్చేసి రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి పెట్టాలన్న నిర్ణయానికి వచ్చేశారు. సరే కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు పీకే కాంగ్రెస్ చేరికకు ఆదిలోనే హంస పాదు పడింది. దీంతో పీకే వ్యూహాలను రాష్ట్రంలో అనుసరించడానికి కేసీఆర్ కు ఎలాంటి అభ్యంతరాలు ఎదురు అవ్వని  పరిస్థితి వచ్చింది. అయితే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న కోరికను మాత్రం కేసీఆర్ మరోసారి పక్కన పెట్టక తప్పని రాజకీయ అనివార్యతను బీజేపీ వ్యూహాత్మకంగా కల్పించింది. అందుకే జాతీయ అజెండాకే పరిమితమై.. మారిన తన వ్యూహాన్ని ఇటీవల ప్లీనరీ వేదికగా కేసీఆర్ ఆవిష్కరించారు. 
 

By
en-us Political News

  
నియోజకవర్గాల పెంపు కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ బలం మరింత దిగజారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
భారీగా ఆర్వోల తొలగింపు వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఒకే సారి 72 మంది ఆర్వోలను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించిదే తప్ప అదుకు కారణాలను వెల్లడించలేదు.
వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి.
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.