కేసీఆర్ బీహార్ పర్యటన.. జాతీయ రాజకీయాల దిశగా మరో అడుగా?

Publish Date:Aug 29, 2022

Advertisement

మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో తన నాయకత్వంలో పోరాటం చేయాలన్న తన ఆకాంక్షను నెరవేర్చుకునే దిశగా కేసీఆర్ మరో అడుగు వేస్తున్నారు. ఈ నెల 31(బుధవారం)న ఆయన బీహార్ పర్యటనకు వెళుతున్నారు. బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వాన్ని కూలదోసి మహాఘట్ బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో భేటీ అవ్వడానికి కేసీఆర్ బీహార్ వెళుతున్నారు. వీరి భేటీలో బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ కూడా పాల్గొంటారు.

ఈ పర్యటనకు కారణంగా కేసీఆర్ గతంలో ప్రకటించిన విధంగా గాల్వాన్ ఘర్షణలో మరణించిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయడానికే అని చెబుతున్నప్పటికీ సాకు అదే అయినా అసలు కారణం మాత్రం రాజకీయ వ్యూహాలను ఖరారు చేసుకునేందుకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పర్యటన సందర్బంగా కేసీఆర్ గాల్వాన్ ఘర్షణలో అమరులైన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయడంతో పాటు హైదరాబాద్ లో టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో మరణించిన 12 మంది బీహార్ కు చెందిన కార్మికుల కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం అందజేస్తారు.  అదలా ఉంటే.. రాజకీయంగా మాత్రం కేసీఆర్ బీహార్ పర్యటన అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

బీహార్ సీఎం నితీష్ కుమార్ తో లంచ్ భేటీలో ఇరువురూ జాతీయ రాజకీయాలపై చర్చించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇటీవల నితీష్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా 2024 ఎన్నికలలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన లక్ష్యం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని కేసీఆర్ గత కొంత కాలంగా ప్రతి సందర్భంలోనూ చెబుతున్నారు. అలాగే బీహార్ ఉప ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ కూడా బీహార్ లో బీజేపీ పనైపోయింది.. ఇక ఢిల్లీ నుంచి బీజేపీని పంపేయడమే మిగిలిందని ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో ఒకే లక్ష్యంతో ఉన్న ముగ్గురు నేతల భేటీపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. నిన్న మొన్నటి వరకూ ఎన్డీయే కూటమిలో ఉన్న జేడీయూ ఇటీవలే కూటమితో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ బీజేపీయేతర రాష్ట్రప్రభుత్వాలను కూలదోయడానికి ఎత్తులు వేస్తుంటే.. నితీష్ కుమార్ వ్యూహాత్మకంగా బీహార్ లో ఎన్డీయే సర్కార్ ను కూల్చి బీజేపీ వ్యతిరేక పార్టీలలో ఒక ఉత్సాహాన్ని నింపారని పరిశీలకులు అంటున్నారు. దీంతో జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలను మళ్లీ కొత్తగా ప్రారంభించేందుకు కేసీఆర్ తన తొలి అడుగు బీహార్ లో వేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఈ  నేపథ్యంలోనే సీఎం కేసీఆర్.. బీహార్ పర్యటన ప్రధాన్యత సంతరించుకుంది.

జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని ప్రకటించిన కేసీఆర్.. కలిసి వచ్చే పార్టీలతో సమావేశమవుతున్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ (పశ్చిమ బెంగాల్), సమాజ్ వాదీ పార్టీ (ఉత్తర ప్రదేశ్), డీఎంకే (తమిళనాడు), ఆమ్ ఆద్మీ పార్టీ (ఢిల్లీ) అధినేతలతో భేటీ అయ్యారు. పలువురు నేతలు హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్‌తోనూ భేటీ అయ్యారు. రెండు రోజుల కిందట 26 రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించారు. గత కొంత కాలంగా ఎక్కడ సభ జరిగినా.. ఎవరితో భేటీ అయినా సందర్భం ఏదైనా కేసీఆర్ బీజేపీ ముక్త్ భారత్ జపమే చేస్తున్న సంగతి విదితమే.   

By
en-us Political News

  
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.