Publish Date:Dec 28, 2024
రాజకీయ నాయకులలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ది ఓ ప్రత్యేక శైలి. అవసరార్ధం ఆయన ఎంతకైనా తెగిస్తారు.. ఎంతకైనా దిగజారుతారని రాజకీయవర్గాలలో ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఒక సారి కాంగ్రెస్ తో జట్టు కట్టారు. ఆ తరువాత తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారు. ఇదేమిటని అడిగిన వారికి తన లక్ష్యం తెలంగాణ సాధన.. ఆ లక్ష్య సాధన కోసం అవసరమైతే బొంత పురుగును కూడా ముద్దెట్టుకుంటా అని సమాధానం ఇచ్చారు. సరే సుదీర్ఘంగా ఆయన నాయకత్వంలో కొనసాగిన తెలంగాణ ఉద్యమ ఫలితమైతేనేం, కాంగ్రెస్ తన రాజకీయ లబ్ధి కోసమైతేనేం తెలంగాణ సాకారమైంది. ఇది జరిగి పదేళ్లు దాటింది.
తెలంగాణ సాకారమైన సమయంలో కేసీఆర్ సకుటుంబ సపరివార సమేతంగా అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసి కృతజ్ణతలు తెలిపి మరీ వచ్చారు. అంతకు ముందు తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కూడా అన్నారు. అయితే తెలంగాణ ఆవిర్బావం తరువాత వరుసగా పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న కేటీఆర్.. ఆ సమయంలో కాంగ్రెస్ ను రాష్ట్రంలో నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పావులు కదిపారు. సరే ఇక ప్రస్తుతానికి వస్తే.. ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్న సహయంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఏర్పాటుకు అప్పటి ప్రధాని మన్మోహన్: నేతృత్వంలోనే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంటే తెలంగాణ ఆవిర్భావానికి ప్రధాని మన్మోహన్ సింగ్ కారణం. ఈ విషయాన్ని కేసీఆర్ స్వయంగా చెప్పారు. మన్మోహన్ మృతికి సంతాపం తెలుపుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ అందించిన సహకారాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరచిపోదని పేర్కొన్న కేసీఆర్ మన్మోహన్ అంత్యక్రియలకు మాత్రం హాజరు కాలేదు. తనకు బదులుగా తన కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి అయిన కేటీఆర్ నేతృత్వంలోని ఒక బృందాన్ని పంపారు. దీనిపై బీఆర్ఎస్ వర్గాలు సహా రాజకీయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మన్మోహన్ అంత్యక్రియలకు కేసీఆర్ స్వయంగా హాజరై ఉండాల్సిందన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతోంది.
అయితే కేసీఆర్ సీతయ్య లాంటి వారు. ఎవరి మాటా వినరు. తనకు ఏది తోస్తే అదే చేస్తారు. గత ఏడాది ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయిన నాటి నుంచీ కేసీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనే చెప్పాలి. అలాగని పూర్తిగా రాజకీయ సన్యాసం చేయలేదు. తాను కలవాలనుకున్నప్పుడల్లా పార్టీ నేతలను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని గంటల తరబడి మంతనాలు జరుపుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ సమయానికి ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు కేసీఆర్ గైర్హాజర్ కావడం ఏ మాత్రం హుందాగా లేదని రాజకీయవర్గాలు అంటున్నాయి. పరాజయంతో ముఖం చెల్లకుండా ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్.. మన్మోహన్ అంత్యక్రియలకు సైతం దూరంగా ఉండటానికి కారణం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ ను ఫేస్ చేయడానికి ఇష్టపడకపోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అలాగే తాను సీఎంగా ఉండగా ప్రొటోకాల్ ను సైతం ధిక్కరించి ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనలకు వచ్చిన సమయంలో ఆయనకు స్వాగతం పలకలేదు. ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తూ పరిశీలకులు ఇప్పుడు మోడీకి ఎదురుపడి అవమానపడటం కంటే దూరంగా ఉండటమే మేలని కేసీఆర్ భావించి ఉంటారని అంటున్నారు. మొత్తం మీద మన్మోహన్ అంత్యక్రియలకు కేసీఆర్ గైర్హాజర్ కావడం ఆయన ప్రతిష్టను మరింత మసకబార్చిందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kcr-avoid-manmohan-funeral-25-190453.html
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్‌కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్‌లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్‌లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.