తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. కేసీఆర్ హాజరు.. ట్విస్టేంటి?

Publish Date:Jul 23, 2024

Advertisement

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. అంతుకు ముందు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరుపై ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించడంతో.. ఈ సమావేశాలు వాడి వేడిగా సాగడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది జరిగిన ఎన్నికలలో  బీఆర్ఎస్ పరాజయం తరువాత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు.  రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా దూరంగానే ఉన్నారు.   ప్రతిపక్ష నేతగా సభకు హాజరు కావడం ఇష్టం లేకే ఆయన అసెంబ్లీకి రావడం లేదన్న ప్రచారం జరిగింది.  గత కొంతకాలంగా ఫామ్ హౌజ్ కు మాత్రమే పరిమితం కావడంతో   కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు అయ్యే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషించారు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరైతే బీఆర్ఎస్ ప్రతిష్ఠ మరింత మసకబారుతుందన్న ఆందోళన బీఆర్ఎస్ నేతలు,  శ్రేణుల్లో వ్యక్తం కావడంతో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  

కేసీఆర్  అసెంబ్లీలో రేవంత్ సర్కార్ ను ఇరుకున పెట్టడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది.  తెలంగాణ ఆవిర్భావం తరువాత   కేసీఆర్  ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి హాజరు కావడం ఇదే తొలి సారి.  

ఇలా ఉండగా  బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమకు విడిగా సీటింగ్ ఏర్పాటు చేయాలని స్పీకర్ ను కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు పది మంది ఉన్నారు. వీరి ప్రజెన్స్ సహజంగానే కేసీఆర్ ను ఇబ్బంది పెడుతుంది. గతంలో తాను అధికారంలో ఉండగా కేసీఆర్ విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి చేర్చుకున్న సంగతి తెలిసిందే. సో ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఆయన విమర్శలు చేసే అవకాశం లేదు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లుగా వారి సమాధానం ఉంటుందన్నది తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే అసెంబ్లీలో తాము విడిగా కూర్చేనేందుకు తగిన సీటింగ ఏర్పాట్లు చేయాలని బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన పది మంది ఎమ్మెల్యేలూ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కోరారు.   

By
en-us Political News

  
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.