సీఎం కేసీఆర్ పరమ దుర్మార్గుడు.. బండి

Publish Date:Aug 31, 2022

Advertisement

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరమ దుర్మార్గుడిగా అభివర్ణించారు. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణిస్తే వారిని కనీసం పరామర్శించకుండా రాజకీయ పర్యటన కోసం బీహార్ వెళతారా అని విమర్శించారు.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి మహిళలకు మరణించడానికి కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం, మూర్ఖత్వమే కారణమని నిందించారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను బండి సంజయ్ బుధవారం పరామర్శించారు. ఆ సందర్బంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ బాధితులను పరామర్శించకుండా బీహార్ వెళ్ళటం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలోని పేదలను వదిలేసి పంజాబ్, బీహార్‌లో డబ్బులు పంచటం దారుణమన్నారు.

ఆపరేషన్లు వికటించి మరణించిన   మహిళల పిల్లల చదువు, భవిష్యత్తు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని   డిమాండ్ చేశారు.   రికార్డు కోసం గంటలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయటాన్ని బండి సంజయ్ తప్పుపట్టారు. సీఎం సర్కార్‌కు పేదల ప్రాణాల కంటే పేరు ప్రఖ్యాతలే ముఖ్యమా అని నిలదీశారు.

 రాష్ట్ర సీఎంకు పేదల ఉసురు కచ్చితంగా తగులుతుందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుంటామంటే అంగీకరించేది లేదన్నారు.  బెదిరించి ఆపరేషన్లు చేశారని చికిత్స పొందుతోన్న మహిళలే స్వయంగా చెప్తున్నారని బండి సంజయ్ అన్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం పోలింగ్ రోజే వెల్లడైపోయింది. ఓటరు ఉత్సాహంలో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను విస్పష్టంగా కనిపించింది. దేశ, విదేశాల నుంచి అనేక వ్యయ ప్రయాసలకోర్చి మరీ వచ్చి తమ ఓటు హక్కను వినియోగించుకున్న ప్రజలు. ప్రలోభాలు కాదు, తమకు రాష్ట్ర ప్రగతి, పురోభివృద్ధి ముఖ్యమని విస్పష్టంగా చాటారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (మే 14) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఎనిమిది కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
వైసీపీ భ్రమలు తొలగిపోయాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులూ ఆ పార్టీకీ ఛీ కొట్టేశారు. సంక్షేమం అంటూ తమ ఇంత కాలం భ్రమల్లో ఉంచి చేసిన నిర్వాకం చాలన్నట్లుగా వైసీపీకి వ్యతిరేకంగా పోలింగ్ బూత్ లకు పోటెత్తారు. సంక్షేమ లబ్ధాదారులు కదా, మనకే ఓటేస్తారు అన్న భ్రమల్లో ఉన్న వైసీపీకి తామెటు వైపో తమ ధిక్కారం ద్వారా విస్పష్టంగా తెలియజేశారు. నమస్కారానికి ప్రతినమస్కారం, తిరస్కారానికి తిరస్కారం అన్నట్లుగా ఏకంగా పోలింగ్ బూత్ లలోనే వైసీపీ నేతలపై తిరగబడ్డారు.
వైసీపీ ప్ర‌భుత్వం దిగిపోవ‌టం ఖాయ‌మైంది. ఐదేళ్ల‌ పాటు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌క్ష‌పూరిత‌, అరాచ‌క పాల‌న‌కు విసిగిపోయిన ఏపీ ప్ర‌జలు ఓటు ద్వారా వీడ్కోలు ప‌లికేశారు. వైసీపీ శ్రేణుల హింసకు పాల్పడుతూ రెచ్చిపోయి భ‌యాందోళ‌న‌కు గురిచేసినా, ప‌లు పోలింగ్ కేంద్రాల్లో దాడుల చేసినా బెద‌రకుండా, అద‌ర‌కుండా ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ ల వ‌ద్ద‌కు ఓట‌ర్లు పోటెత్తారు.
ముంబైలో పలు ప్రాంతాల్లో భారీ గాలులు, వర్షం బీభత్సం సృష్టించాయి. బలమైన గాలుల కారణంగా ఘట్కోపర్ ప్రాంతంలో ఒక భారీ హోర్డింగ్ కుప్పకూలింది. ఆ హోర్డింగ్ పక్కనే వున్న పెట్రోల్ బంక్‌పై పడటంతో ఎనిమిది మంది మరణించారు.
పోలింగ్ ముగిశాక టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. వైసీపీ వర్గాలు మాత్రం నిరాశ, నిస్పృహల్లో మునిగిపోయి కనిపిస్తున్నారు.
నగరి నియోజకవర్గానికి పట్టిన దరిద్రం వదలబోతోంది. ఆ నియోజకవర్గ వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే రోజా ఓడిపోబోతోంది.
నాలుగో విడత పోలింగ్ సమాప్తం
పోలింగ్ బూత్‌లో బుర్ఖా వేసుకున్న మహిళల ఐడీ ప్రూఫ్ చెక్ చేసిన నేపథ్యంలో తనపై నమోదైన కేసు అంశం మీద హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత స్పందించారు. తాను హైదరాబాద్ నుంచి లోక్ సభ అభ్యర్థిని అని... పైగా మహిళా అభ్యర్థిని అన్నారు. వారి ఫొటో ఐడెంటింటీని చెక్ చేసుకునే హక్కు తనకు ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వేళ అధికార వైసీపీ అన్ని విలువలకూ వలువలు విప్పేసి యథేచ్ఛగా దాడులు, దౌర్జన్యాలకు తెగబడింది. అదే సమయంలో ఎన్నికల సంఘం కూడా హింసాత్మక ఘటనలపై సీరియస్ గా స్పందించి ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్టు చేసింది.
పోలింగ్ సందర్భంగా కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ నాయకత్వంలో  బీభత్సం సృష్టించారు
5 గంటల వరకు ఏపీలో 67.99 శాతం పోలింగ్
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.