పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ భారీ ఆర్థిక సాయం..!

Publish Date:Aug 8, 2026

Advertisement

 

నర్సంపేట మాజీ శాసనసభ్యులు, దివంగత నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొండంత అండగా నిలిచారు. ఇటీవల అకాల మరణం చెందిన సుదర్శన్ రెడ్డి కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏకంగా రూ. 2.25 కోట్ల భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఆర్థిక ప్రాకేజీలో భాగంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తు, చదువుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున మొత్తం రూ. 2 కోట్లు కేటాయించనున్నారు. తండ్రి లేని లోటు పిల్లల ఎదుగుదలకు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది.మరోవైపు సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ వయోభారంతో బాధపడుతుండటంతో, ఆమె వైద్యారోగ్య సంరక్షణ మరియు రోజువారీ అవసరాల కోసం రూ. 25 లక్షలను నేరుగా బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయనున్నారు. వచ్చే వడ్డీతో ఆమె జీవనం సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు మరియు ముఖ్య ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. కేవలం ఆర్థిక సాయంతోనే సరిపెట్టకుండా, ఆ కుటుంబ శ్రేయస్సును ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను పార్టీ తీసుకుంటుందని ఆయన ఉద్ఘాటించారు.సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమ కాలం నుండి పార్టీకి నమ్మకమైన సైనికుడిగా, ప్రజాప్రతినిధిగా అందించిన సేవలను కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కష్టకాలంలో నాయకుల కుటుంబాలకు బాసటగా నిలవడం పార్టీ ప్రాథమిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

సుదర్శన్ రెడ్డి దశదిన కర్మల కార్యక్రమాలు పూర్తయిన తర్వాత, జిల్లా స్థాయి సీనియర్ నాయకులు మరోసారి సమావేశమై కుటుంబ సంక్షేమానికి సంబంధించి మరిన్ని సమగ్ర నిర్ణయాలు తీసుకోనున్నారు.కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దివంగత నాయకుడి కుటుంబానికి లభించిన ఈ ఆర్థిక ధీమా వల్ల వారి భవిష్యత్తుకు భరోసా లభించిందని పొలిటికల్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

KCR, Peddi Sudarshan Reddy, BRS Party, Telangana News, Peddi Sudarshan Reddy Family Financial Aid, KTR
 

By
en-us Political News

  
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు శనివారం నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు.
సామాజిక మాధ్యమాలు, డేటింగ్ యాప్‌ల వేదికగా అమాయకులకు వలవేసి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న సంచలన హనీట్రాప్ ముఠా గుట్టు
మియాపూర్ జీఎస్ఎమ్ మాల్ వద్ద ఘోర ప్రమాదం..!
ప్రపంచ ఫుట్‌బాల్ రంగాన్ని శాసించిన మహా దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ జీవితంలో తీరని శోకం అలముకుంది.
క్యాబ్ డ్రైవర్ నుంచి కార్పొరేట్ లీడర్‌గా స్ఫూర్తిదాయక ప్రయాణం..!
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం దిశగా ఆలోచన చేస్తోంది.
తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య జరిగి ఏడున్నర సంవత్సరాలు అయిందని, ఇప్పటికీ తాను న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టను న్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
2015లోనే అప్పటి పాక్ జలవనరులు, విద్యుత్ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ జాతీయ స్థాయిలో నీరు, గ్యాస్, విద్యుత్ విచ్చలవిడిగా దుబారా చేసే అలవాటు వల్లే దేశంలో తీవ్ర కొరత ఏర్పడిందని బాహాటంగా చెప్పారు. నీటి సమస్యలు పూర్తిగా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారమని, దానికి బయటి దేశాలను బాధ్యులను చేయలేమని అన్నారు. నాటి మంత్రి వ్యాఖ్యలకు, నేటి పాక్ పాలకులు భారత్‌పై చేస్తున్న ఆరోపణలకు పొంతనే లేకపోవడం గమనార్హం.
ఒంటరిగా ఫీలవుతున్నారా? మీతో కాఫీ తాగేందుకు, సినిమాకు వెళ్లేందుకు అందమైన అబ్బాయి కావాలా? అదీ 50 శాతం డిస్కౌంట్‌తో!
మరొకవైపు, రెండు ప్రధాన టన్నెళ్ల పరిధిలో చేపడుతున్న కాంక్రీట్ సీసీ లైనింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు వీలుగా ఐదు గ్యాంట్రీ యంత్రాల....
సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ చెల్లింపులపై ఇటీవల నెట్టింట ఊపందుకున్న ఛార్జీల ప్రచారానికి ప్రముఖ డిజిటల్ వ్యాపార దిగ్గజం ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ తెరదించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.