కెసిఆర్‌పై ద్వజమెత్తిన మోత్కుపల్లి
Publish Date:Oct 25, 2011
Advertisement
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు టెండర్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నేత మోత్కుపల్లి నర్సింహులు ద్వజమెత్తారు పోలవరం టెండర్ రద్దు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాయడం ద్వారా చేతులు దులుపుకోవాలని తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం తెలంగాణ ఫోరం సమావేశానంతరం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కెసిఆర్ ఆలోచన మేరకే లక్ష్మీరాజ్యానికి చెందిన షూ కంపెనీకి టెండర్ ఇచ్చారని ఆయన అన్నారు. లక్ష్మీరాజ్యం కెసిఆర్ పత్రిక నమస్తే తెలంగాణలో భాగస్వామి అవునా, కాదా అని ఆయన ప్రశ్నించారు. పోలవరం టెండర్‌కు సంబంధించిన ఫైళ్లను శాసనసభ స్పీకర్ వద్ద పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, కెసిఆర్ కుమ్మక్కయి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ కొట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు.కెసిఆర్ ఉద్యమం పేరుతో కోట్లు దండుకుంటున్నారని, ప్రజలకు మాత్రం కన్నీళ్లు మిగిలిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమాన్ని కెసిఆర్ తాకట్టు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. నమస్తే తెలంగాణ పత్రికలో అవినీతి సొమ్మును పెట్టారని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.
నమస్తే తెలంగాణ పత్రికలో తెలంగాణ, సీమాంధ్ర నేతల అవినీతి సొమ్ము పెట్టుబడిగా ఉందని ఆయన అన్నారు. పోలవరం టెండర్‌ను రద్దు చేస్తే సరిపోదని, ఆ వ్యవహారంపై విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడినవారిని శిక్షించాలని ఆయన అన్నారు.తెలంగాణ కోసం వచ్చే నెల 1వ తేదీన ఢిల్లీలో స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ తలపెట్టిన దీక్షకు ఆయన మద్దతు ప్రకటించారు. ఇందుకు గాను తాము వచ్చే నెల 1వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి తెలంగాణపై జిల్లాలవారీగా సదస్సులు నిర్వహిస్తామని, రంగారెడ్డి జిల్లా సదస్సుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఈ సదస్సుల ద్వారా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు. తెలంగాణకు మద్దతుగా తాము ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇచ్చామని, దానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. ఈ విషయంలో తమపై తప్పుడు ప్రచారం సాగుతోందని, దీన్ని తిప్పికొట్టాలని నిర్ణయించామని ఆయన చెప్పారు.కాగా, పోలవరం ప్రాజెక్టు టెండర్ వ్యవహారంపై విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డితో పాటు మరికొంత మంది తెలుగుదేశం తెలంగాణ నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి కోరారు.అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకునే వరకు తాము ఆందోళన సాగిస్తామని ఆయన చెప్పారు.
http://www.teluguone.com/news/content/kcr-24-7889.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





