కవిత అమాయకురాలు కాదు! మధ్యంతర బెయిలు తోసిపుచ్చుతూ న్యాయమూర్తి వ్యాఖ్య

Publish Date:Apr 10, 2024

Advertisement

కల్వకుంట్ల కవితకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన కవిత.. రెగ్యులర్ బెయిలు ఇప్పట్లో లభించే అవకాశం లేదన్న నిర్ధారణకు వచ్చిన తరువాత మధ్యంతర బెయిలు కోసం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టు స్పెషల్ జడ్జికి లేఖ కూడా రాశారు. ఆ లేఖలో తన అమాయకత్వాన్ని చెప్పుకునేందుకు ప్రయత్నించారు. తల్లిగా కుమారుడికి పరీక్షల సమయంలో తన అవసరం ఉందని సెంటిమెంట్ అస్త్రాన్నీ ప్రయోగించారు. అయితే అవేమీ ఆమెకు ఊరటనివ్వలేదు. 

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ కల్వకుంట్ల కవిత ఇప్పుడు తీహార్ జైలులో ఉన్నారు. ఆమె మధ్యంతర బెయిలు పిటిషన్ ను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది. అలాగే ఆమె రిమాండ్ గడువును కూడా పొడిగించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో  తనకు ఆర్థికంగా పూచిక పుల్ల ఎత్తు ఆర్థిక లబ్ధి జరగలేదని పేర్కొంటూ కోర్టు స్పెషల్ జడ్జి జస్టిస్ కావేరీ భవేజాకు లేఖ రాశారు. చేతి రాతలో ఉన్న ఆ నాలుగు పేజీల లేఖను మీడియాకు విడుదల చేశారు. ఆ లేఖలో కవిత తాను నిర్దోషిననీ, మద్యం కుంభకోణంలో తనకు ఎలాంటి సంబంధం లేదనీ పేర్కొన్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా సైతం కేసు విచారణ సందర్భంగా మనీ ట్రయల్ లేదు, అవినీతి జరిగినట్లు ఆధారాల్లేవు అని పేర్కొంటూ ఇది నిలిచే కేసు కాదని వ్యాఖ్యానించారంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. 
కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ గత రెండున్నరేళ్లుగా ఈ కేసు విషయంలో వేధించి చివరకు అరెస్టు చేశారని ఆ లేఖలో కవిత ఆరోపించారు. కేవలం స్టేట్ మెంట్ల ఆధారంగా తనను అరెస్టు చేయడం దారుణమని పేర్కొన్నారు. ఈ కేసులో ఈడీ, సీబీఐ దర్యాప్తు అంతం లేని కథలా సాగుతోందని ఆరోపించారు. ఈ కేసులో తాను బాధితురాలినని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. చివరాఖరికి తన మెబైల్ ఫోన్ నంబర్ కూడా మీడియా ప్రసారాలలో వెల్లడించేశారనీ, ఇది తన వ్యక్తిగత హక్కులకు, గోప్యతకు భంగం కాదా అని ఆ లేఖలో కవిత ప్రశ్నించారు. తాను ఈడీ, సీబీఐ అధికారులకు దర్యాప్తులో పూర్తిగా సహకరించానని పేర్కొన్నారు. తన బ్యాంకు లావాదేవీలు, వ్యాపార వివరాలు అన్నీ వారికి అందించినట్లు పేర్కొన్న కవిత.. తాను తన ఫోన్లను ధ్వంసం చేశాననీ, ఆధారాలను నాశనం చేశాననీ ఆ దర్యాప్తు సంస్థలు నిరాధారంగా తనపై నిందలు మోపాయని ఆరోపించారు.   
నిజంగానే ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన పాత్ర ఉన్నట్లైతే తెలంగాణలో తమ పార్టీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం ఎందుకు అరెస్టు చేయాలేంటూ ప్రశ్నించారు. ఈడీ, సీబీఐలు కేంద్ర దర్యాప్తు సంస్థల్లా కాకుండా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల్లా పని చేస్తున్నాయనీ, అవి దర్యాప్తు చేస్తున్న కేసులలో 95శాతం పైన కేసులన్నీ దేశంలోని ప్రతిపక్షాల నేతలపై ఉన్నవేననీ కవిత ఆ లేఖలో పేర్కొన్నారు.   
ఆమె లేఖ సంగతి పక్కన పెడితే.. ఆమె లేఖలో ప్రస్తావించిన ప్రతి అంశానికీ  ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ జవేజా కవిత బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ వెలువరించిన 21 పేజీల ఉత్తర్వుల్లో సమాధానాలు ఇచ్చేశారు. ఉన్నత విద్యావంతురాలైన కవిత.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమె ప్రమేయం లేకుండానే అమాయకంగా ఇరుక్కున్నారని విశ్వసించలేమని పేర్కొన్నారు.  దేశ, విదేశాలలో ఉన్నత చదువులు చదువుకున్న విద్యావంతురాలు. భారత్‌ జాగృతి సంస్థకి అధ్యక్షురాలుగా మహిళలను చైతన్యపరిచిన కవిత ఒక ఎంపీగా పార్లమెంటులో పలు స్టాండింగ్ కమిటీలలో పని చేశారనీ, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారనీ, కనుక ఆమెను అబల, అమాయకురాలు అని ఎలా అనుకుంటామని న్యాయమూర్తి ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. అందుకే మద్యం కుంభకోణం కేసులో ఆమెను ఎవరో ఇరికించారని భావించజాలమన్నారు.  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత ప్రమేయం ఉన్నట్లు  ఈడీ బలమైన సాక్ష్యాధారాలు సమర్పించిందనీ, విచారణకు ఆమె సహకరించలేదని ఈడీ ఆధారాలు సమర్పించిందనీ పేర్కొన్నారు.  ఈ కేసులో కీలకమైన ఆధారాలుగా భావిస్తున్న ఆమె మొబైల్ ఫోన్లను ఈడీకి స్వాధీనం చేసేటప్పుడు దానిలో డేటాని ఆమె తొలగించిన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక  ద్వారా తెలుస్తోందని పేర్కొన్న న్యాయమూర్తి కవితకు మధ్యంతర బెయిలు మంజూరు చేయలేమని స్పష్టం చేశారు.  అంతకు ముందు న్యాయమూర్తితో తాను స్వయంగా మాట్లాడతానని కవిత చేసుకున్న అభ్యర్థనను కూడా తిరస్కరించారు.   

By
en-us Political News

  
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.