కాంగ్రెస్ తో కవిత బేరం? నిజమేనా?

Publish Date:May 28, 2025

Advertisement

స‌ర్క‌మ్ స్టెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్.. అంటూ ఒక‌టుంటుంది. దీని అర్ధ‌మేంటంటే వారి వారి మాన‌సిక- శారీర‌క- సామాజిక- రాజ‌కీయ- ఆర్ధిక‌- స్థితిగ‌తుల‌ను అనుస‌రించి వారెలా బిహేవ్ చేస్తారో.. ఒక అంచ‌నాకు రావ‌డం. దీన్నే ఇప్పుడు రెడ్ టీమిజం అని కొత్త‌గా కూడా పిలుస్తున్నారు. ఇది వేరే విష‌యం. 

ఇక్క‌డ క‌విత‌కు అలాంటి ప‌రిస్థితి ఉందా? లేక బీఆర్ఎస్ పార్టీకే ఇలాంటి సిట్యువేష‌న్ త‌లెత్తిందా? అని చూస్తే ఇది జ‌స్ట్ క‌విత ప‌రిస్థితిలా క‌నిపించ‌డం లేదు. బీఆర్ఎస్  ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతోంది. ఒక వేళ క‌వితే కాంగ్రెస్ లోకి వెళ్తే.. కాళేశ్వ‌రం విష‌యంలో కావ‌చ్చు, ఈ- కార్ రేస్ విష‌యంలో కావ‌చ్చూ.. బీఆర్ఎస్ కి   ఒక రిలీఫ్ రావ‌చ్చు. కార‌ణ‌మేంటంటే.. క‌వితే కాంగ్రెస్ లో ఉంటే.. ఇలాంటి అంశాల్లో చేతి పార్టీ ప్ర‌భుత్వం అంత అగ్రెసివ్ గా దూకుడు ప్ర‌ద‌ర్శించ‌క పోవ‌చ్చు. దీంతో క‌విత ద్వారా కేసీఆర్ ఇటు నుంచి న‌రుక్కొస్తున్న‌దిగా ఒక అంచ‌నా.

ఇక రెండోది.. దీన్ని రేవంత్ , ఆయ‌న స‌న్నిహితులు ఇటు పీసీసీ అటు కేంద్ర నాయ‌క‌త్వాన్ని వ‌ద్ద‌ని వారించిన‌ట్టు భావించ‌డం. అదేమంటే అన‌వ‌స‌రంగా కేసీఆర్ కుటుంబాన్ని చీల్చిన నింద మ‌న మీద వేసుకోవ‌డం ఎందుక‌ని.. వారు అనుకున్న‌ట్టు! అందుకే వ‌ద్ద‌న్న‌ట్టు చెప్ప‌డం కూడా ఒక‌ర‌కంగా.. తాను చంపబోయే జింక‌ను చూసి పులే జాలి ప‌డ్డ‌ట్టుగా ఉంది.

ఇప్పుడు న‌డుస్తోన్న‌దంతా ఏంటి? త‌న‌ను కేసీఆర్ జైలుకు పంపిన‌ట్టే నేను కూడా ఆయ‌న్ను పంపాల‌న్న‌దే క‌దా? కేటీఆర్ ని కూడా వ‌ద‌ల‌కుండా వెంటాడి వేటాడి రివేంజ్ తీర్చుకోవ‌డ‌మే అస‌లు ఉద్దేశం అదే క‌దా? అంటారు కొంద‌రు ఎన‌లిస్టులు. 

బేసిగ్గా ఇవ‌న్నీ జ‌ర‌క్కుండా క‌డియం శ్రీహ‌రి చెప్పిన‌ట్టు కేసీఆర్ తొలి నాళ్ల‌లోనే కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చి ఉండొచ్చు. ఆ పార్టీ ఎమ్మెల్యేల‌ను కొంద‌ర్ని కొని.. సొంతంగా అధికారంలోకి రావ‌చ్చు. ఇందుకు ఆస్కారాలు లేక పోలేదు. కానీ కేసీఆర్ అస‌లైన ఆలోచ‌న అది కాదు. డీఎంకే, అన్నాడీఎంకే ఫార్ములా... అంటే  ఇక్క‌డ కూడా బీఆర్ఎస్, టీబీఆర్ఎస్ ఉండాల‌న్న‌ది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. ఒక వేళ అలా లేకుంటే అధికార పార్టీ కాంగ్రెస్ లో మ‌న వాళ్లు ఎవ‌రో ఒక‌రుండ‌టం. మ‌రీ లేకుంటే బీజేపీలో ఉండ‌టం. ఒక సారి మ‌నం (అంటే బీఆర్ఎస్) అధికారంలోకి వ‌చ్చినా.. రెండో సారి అటు వైపు వాళ్లు(కాంగ్రెస్ లేదా బీజేపీ) అధికారంలోకి వ‌చ్చినా.. మ‌న వాళ్లు అటు వైపు ఉంటారు కాబ‌ట్టి.. మ‌నం ఎన్ని చేసినా చెల్లుబాటు అయ్యేలా ఒక ఎత్తుగ‌డ‌. ఇదీ కేసీఆర్ 2018 నాటి నుంచి క‌ల‌లు కంటోన్న పొలిటిక‌ల్- స్కెచ్.

ఇప్పుడున్న రోజుల్లో అధికారంలో లేకుంటే ఏం జ‌రుగుతుందో అంద‌రికీ తెలుసు. ప‌రిపాల‌న‌లో ఏవో ఒక లోటు పాట్లు ఉండ‌నే ఉంటాయి. అధికారం పోయాక‌ వాటిని అడ్డు పెట్టుకుని ఏవో కేసులు పెట్టి ఇబ్బంది పెట్ట‌డం ఇప్పుడు కామ‌న్  అయిపోయింది. ఈ కండీష‌న్లో.. మ‌న‌మ‌లా ఇరుకున ప‌డ‌కుండా ఉండాలంటే ఇదే సేఫ్ ప్లాన్. ఇందులో భాగ‌మే ఒక క‌విత- ఆరుగురు ఎమ్మెల్యేలు ఒక మంత్రి ప‌ద‌వి కాన్సెప్ట్ గా అంచ‌నా వేస్తున్నారు కొంద‌రు. అర్ధమ‌వుతోందా!?

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయ్యింది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సర్కార్ పని తీరు పట్ల జనం సంతృప్తిగానే ఉన్నారు. అయితే ఆల్ ఈజ్ వెల్ అన్న పరిస్థితి మాత్రం కనిపించడం లేదని కూటమి వర్గాలలోనే గట్టిగా చర్చ జరుగుతోంది. కూటమి పార్టీల నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేల పని తీరు పట్ల ఇటీవల సీఎం చంద్రబాబు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు.
కడప జిల్లా పాలకొండలు రిజర్వు ఫారెస్ట్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన దాడులలో ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.50 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతున్నారు.
బాపట్లా జిల్లా చీరాల కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డు లభించనుంది. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి (ఒడిఒపి)కింద కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డును ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
తల్లికి వందనంపై తప్పుడు ప్రచారం చేస్తే వైసీపీ నేతలకు తీవ్ర పరిణామాలు తప్పవు అని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు.
తెలంగాణల్లో స్ధానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సిద్దమవుతుంది. ఈ క్రమంలోనే మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్, కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులులో పేర్కొంది. ఫార్ములా- ఈరేసు కేసులో విచారణకు హాజరుకావాలని తెలిపింది.
గత ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నాయన్న ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టే ఇప్పుడు రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ మంత్రిగా ఉన్న తుమ్ముల నాగేశ్వరరావుకు కాళేశ్వరం బురద అంటించాలని చూస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి .
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాజ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ శుక్రవారం పరామర్శించారు. విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
అరెస్ట్ భయంతో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం కూలిన ఎయిర్‌ ఇండియా విమానం శిథిలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్‌ డీవీఆర్‌ లభించింది. ప్రమాద స్థలానికి చేరుకున్న గుజరాత్‌ యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌ ఏటీఎస్‌ అధికారులు దీనిని స్వాధీనం చేసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.