కవిత సస్పెన్షన్.. పొలిటికల్ గా, వ్యక్తిగతంగా కూడా కేసీఆర్ కు బిగ్ ఇష్యూనే!

Publish Date:Sep 3, 2025

Advertisement

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కుమార్తె,  ఎమ్మెల్సీ కవితపై సస్పెన్షన్ ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా కవిత సస్పెన్షన్ ఒక పొలిటికల్ హీట్ గా మారడానికి   ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని తక్కువ చేస్తే ఆమె గతంలో మాట్లాడిన మాటలు, చేసిన వ్యాఖ్యలు కారణం.

సరే ఆ విషయం పక్కన పెడితే బీఆర్ఎస్ కు సంబంధించినంత వరకూ కవిత సస్పెన్షన్ కేవలం  సస్పెన్షన్ కాదు.. పార్టీ చీలికకు దారి తీసే ఒక పరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి పార్టీ అధినేత.. కేసీఆర్ కవిత సస్పెన్షన్ నిర్ణయం తీసుకోవడం మామూలు విషయం కాదనీ అంటున్నారు. కవిత తీరు పట్ల కేసీఆర్ ఎంతగా విసిగిపోయి ఉంటారు, పార్టీ ఉనికికే ముప్పుగా ఆమె వ్యాఖ్యలు చేయడం ఆయనను వ్యక్తిగతంగా ఎంతగా మానసికక్షోభకు గురై ఉటారో.. ఆమెను సస్పెండ్ చేయడం ద్వారా తెలుస్తోందని అంటారు.

కవితపై బీఆర్ఎస్ వేసిన సస్పెన్షన్ వేటు కేవలం ఒక క్రమశిక్షణ చర్య మాత్రమే కాదనీ,  భావోద్వేగం, మానసిక వేదనల ఫలితమేనని పార్టీ వర్గాలే అంటున్నాయి.   కవిత సస్పెన్షన్ తో కేవలం పార్టీలోనే కాదు.. కేసీఆర్ కుటుంబంలో కూడా చీలికకు దర్పణమని చెబుతున్నారు.  కేసీఆర్ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కష్టకాలం ఇదేనని చెప్పవచ్చు.

కుమార్తె తీరుతో పార్టీ ప్రతిష్ట  మసకబారడమే కాకుండా.. ఇలాంటి పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారంటున్నారు. అందుకే గతంలో అంటే పార్టీ పరాజయం తరువాత ఆమె పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా, నేరుగా సొంత సోదరుడిపైనే విమర్శనాస్త్రాలు సంధించినా, పార్టీ లైన్ కు భిన్నంగా బీసీ రిజర్వేషన్లను సమర్ధించినా కేసీఆర్ ఆమెపై చర్యలకు ఉపక్రమించలేదు సరికదా.. కనీసం మందలించను కూడా మందలించకుండా వెనకేసుకు వచ్చిన చందంగా వ్యవహరించారు. ఎవరు అంగీకరించినా, అంగీకరించకున్నా.. కవిత సస్పెన్షన్ పార్టీని ఓ కుదుపు కుదిపిందనడంలో సందేహం లేదు. 

సొంత కూతురిపై సస్పెన్షన్ వేటు వేయడం ద్వారా కేసీఆర్   కుటుంబ సంబంధాలు, రక్త సంబంధం కంటే పార్టీని రక్షించడమే ముఖ్యమని పార్టీ శ్రేణులకు చాటారని ఎంతగా చెప్పుకుందామని ప్రయత్నించినా జరగాల్సిన డ్యామేజి అయితే జరిగిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పుడు కవిత సొంత దారి చూసుకుంటున్నారని వినిపిస్తోంది. అంటే సొంతంగా కొత్త పార్టీ పెట్టి రాజకీయంగా ముందుకు సాగడానికి నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. అదే జరిగితే.. తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎప్ ప్రభ మసకబారినట్లేనని అంటున్నారు.  కవితపై విమర్శలు గుప్పించడం, ఆమె విధానాలను తప్పుపట్టడం ఎంత కాదనుకున్నా.. కేసీఆర్, కేటీఆర్ లకు ఒకింత ఇబ్బందికరమేనని చెప్పాల్సి ఉంటుంది.  అన్నిటికీ మించి తెలంగాణ రాజకీయాలలో కవిత సొంత పార్టీ సమీకరణాలను మార్చడం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే రాజకీయంగా పెద్దగా క్రియాశీలంగా వ్యవహరించకుండా ఉంటున్న కేసీఆర్.. ఈ పరిణామాలతో మరింత సైలెన్స్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అదే జరిగితే.. బీఆర్ఎస్ పుంజుకోవడం అంత సులువు కాదని కూడా అంటున్నారు. 

By
en-us Political News

  
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.