Publish Date:Dec 29, 2024
ఫార్ములా ఈ రేస్ కుంభకోణంలో మాజీ మంత్రి కెటీఆర్ అరెస్ట్ వార్తల నేపథ్యంలో ఎంఎల్ సి కవిత యాక్టివ్ అయ్యారు. లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కవిత ఆరునెలలపాటు తీహార్ జైలులో ఊచలు లెక్కబెట్టి బయటకు వచ్చారు. బతుకమ్మ పండగకు బ్రాండ్ అంబాసిడర్ గా ముద్ర పడ్డ కవిత జైలు నుంచి విడుదలయ్యాక ప్రజలకు దూరంగా ఉంటున్నారు. దసరాకు ముందు గైనిక్ సమస్యలతో గచ్చిబౌలిలోని ఓ కార్పోరేట్ ఆస్పత్రికి వచ్చే విజువల్స్ తో ఓ సారి కనపించి మాయమయ్యారు. బతుకమ్మ పండగకు కవిత రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని వచ్చిన వార్తలు సత్యదూరమయ్యాయి. జైలు నుంచి విడుదయ్యాక మొదటి సారి జగిత్యాల పర్యటన చేశారు. బిఆర్ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంతో కేడర్ అంతా షిప్ట్ అయ్యింది. కవిత జగిత్యాల పర్యటనలో ఈ మార్పు స్పష్టంగా కొట్టొచ్చొంది. ఆ పర్యటన తర్వాత నిజామాబాద్ పర్యటనకు వచ్చారు. జిల్లాకు రావడం ఇదే ప్రథమం. డిచ్ పల్లి వద్ద కవితకు బిఆర్ఎస్ కార్యకర్తలు స్వాగతం పలికారు. సచివాలయ ప్రాంగణంలో ఉన్న తెలంగాణ తల్లి రూపు రేఖలపై విమర్శించిన కవిత బిఆర్ఎస్ రూపొందించిన తెలంగాణ తల్లిని ఎస్‌ఎఫ్‌ఎస్ సర్కిల్ వద్ద పుష్పాంజలి ఘటించారు.
పార్టీలో హరీష్ రావ్ పై కళ్లెం వేయడానికి కవిత రీ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు ఒకవేళ ఎసిబి లేదా ఈడీ కెటీఆర్ ను అరెస్ట్ చేస్తే హరీష్ రావ్ లైమ్ లైట్ లోకి వచ్చే అవకాశం ఉంది. మేన బావ అయిన హరీష్ కు చెక్ పెట్టాలంటే కవిత రీ ఎంట్రీ ఇచ్చే అగత్యం ఏర్పడింది. నవ్యాంధ్రలో వైఎస్ జగన్ జైలుపాలయినప్పుడు చెల్లెలు షర్మిల రాష్ట్ర మంతా పర్యటించి బొక్కబోర్లా పడ్డారు షర్మిల గతే కవితకు పట్టడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి. తన జిల్లా పర్యటనలో ప్రజా సమస్యలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు ఈ మాజీ నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kavitha-reentry-for-that-39-190490.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.