కేసీఆర్ తోనూ ఢీ అంటే ఢీ.. కవిత మాటల అర్ధం అదేనా?

Publish Date:Jan 2, 2026

Advertisement

తెలంగాణ రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పని ఖతమేనా? ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు కవిత ఇదే విషయాన్ని ఒకింత నర్మగర్బంగా చెప్పారా?  అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఆరంభం సందర్భంగా సభకు వచ్చి ఓ ఐదారు నిముషాలు సభలో కూర్చున్న బీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్ ఎల్పీ నాయకుడు కల్వకుంట్ల కేసీఆర్..  ఆ తరువాత  సభ నుంచి బయటకు వెళ్లి పోయారు.

అయితే.. ఆ రోజు సభలో ఏ విషయంపైనా చర్చ జరిగే అవకాశం లేనందున ఆయన సభనుంచి వెళ్లిపోయారనీ, కొత్త సంవత్సరం రెండో తేదీ నుంచి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రేవంత్ సర్కార్ ను అడుగడుగునా ఇరుకున పెట్టి తన విశ్వ రూపాన్ని చూపిస్తారనీ బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు గట్టిగా చెప్పారు. అదే నమ్మారు. అయితే కేసీఆర్ మాత్రం సభలో పార్టీ గొంతు గళంగా వినిపించేందుకు ఉప నాయకులను నియమించడంతో.. ఆయన ఈ శీతాకాల సమావేశాలలో ఇక సభలో కనిపించరని పరిశీలకులు ఆ రోజే చెప్పారు. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం సభకు కేసీఆర్ గైర్హాజరయ్యారు. 

ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ భవిష్యత్ పై తెలంగాణ జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ వ్యాఖ్యలు చేశారు. సభకు కేసీఆర్ డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఇక ఖతమే అని అన్నారు.  శుక్రవారం (ఫిబ్రవరి 2) శాసనమండలి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో  చిట్ చాట్ చేసిన ఆమె.. తన తండ్రి కేసీఆర్ కే  సవాల్ విసిరారు. ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు.

తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు. తప్పు చేయకుంటే కేసీఆర్ సభకు రావాలని సవాల్ విసిరారు.   అధినాయకుడు అసెంబ్లీకి రాకుండా..  పిల్ల కాకులకు సభాసమయాన్ని వదలడం సరికాదన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కు ప్యాకేజీలు, అమ్ముకోవడం తప్ప ఏం తెలియదని ఎద్దేవా చేశారు.   హరీష్ రావు, రేవంత్ రెడ్డిల మధ్య రహస్య బాండ్ ఉందని ఆరోపించిన ఆమె హరీష్ సీఎం చాంబర్ లో అరగంట సేపు ముచ్చటించడం నిజం కాదా అని ప్రశ్నించారు.   అసెంబ్లీలో  మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించిన ఆమె..  రేవంత్ వర్సెస్ హరీష్ అన్నట్లుగా అసెంబ్లీ చాలా ప్రమాదకరమన్నారు. 

కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ పై నేరుగా అటాక్ చేయడం ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఆమె కేసీఆర్ తో తాను మాట్లాడి నాలుగు నెలలు పైనే అయ్యిందన్నారు.  కేటీఆర్, హరీష్ లకు పార్టీని వదిలేయడంపై ఆమె ఈ సందర్భంగా కేసీఆర్ ను తప్పుపట్టారు.  ఇలా మాట్లాడడం ద్వారా ఆమె తాను కేసీఆర్ తో డీ అంటే ఢీ అనడానికి రెడీ అన్న సంకేతాలు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తరువాత తన శాసనమండలి సభ్యత్వానికి కవిత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఇప్పటికీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. శుక్రవారం (జనవరి 2) కూడా ఆమె శాసనమండలి స్పీకర్ ను తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు. 

By
en-us Political News

  
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫ‌కేష‌న్ జారీ చేయ‌గానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయ‌కుడు, మాజీ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ త‌ర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవ‌రిని ఎమ్మెల్సీ చేయాల‌ని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం న‌రేంద‌ర్ రెడ్డి.. నేడు ఆయ‌న రాజ‌కీయ స‌ల‌హాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్ద‌ల స‌భ‌లోకి స‌గ‌ర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.