కల్వకుంట్ల కుటుంబానికి కవిత దూరం?

Publish Date:Aug 5, 2025

Advertisement

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంలో  విభేదాలు ఇక ఇసుమంతైనా దాపరికం లేకుండా రచ్చకెక్కాయి. కేసీఆర్ కుమార్తె కవిత శషబిషలు లేకుండా పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ కూడా బీఆర్ఎస్ ను, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆధర్ ను టార్టెట్ చేసి విమర్శలతో చెలరేగిపోతున్నారు.  అంతే కాదు.. ఇక తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ కు కూడా మద్దతుగా గళమెత్తడానికి కూడా అమె పెద్ద సుముఖంగా లేరన్న సంకేతాలిస్తున్నారు.  

తాజాగా కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్ ను ఎలా టార్గెట్ చేయాలన్న దానిపై తీవ్ర కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు యత్నాలను అడ్డుకునేందుకు వ్యూహరచన చేసేందుకు బీఆర్ఎస్ కీలక సమావేశం సోమవారం జరిగింది. ఆ సమావేశానికి కవిత దూరంగా ఉన్నారు. పార్టీ రానీయలేదా? ఆమె దూరం జరిగారా అన్నది పక్కన పెడితే.. నిన్న మొన్నటి వరకూ బీఆర్ఎస్ లోఅత్యంత కీలకంగా ఉన్న కవిత.. కీలకమైన కాళేశ్వరం విషయంలో పార్టీ వ్యూహరచనకు దూరం అయ్యారు.   కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేననీ, అక్రమాలకు కారకులు వీరే అంటే కేసీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ మాజీ నేత ఈటల పేర్లను కూడా కమిషన్ నివేదిక వెల్లడించినట్లు సమాచారం. ఈ నివేదక తెలంగాణలో కలకలం రేపుతుండగా,  బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేసింది.  ఈ నేపథ్యంలోనే ఎర్రవల్లి ఫాం హౌస్ లో సోమవారం ( ఆగస్టు 4)  పార్టీ కీలక నేతలు కేసీఆర్ తో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీకి కవిత దూరంగా ఉన్నారు. లేదా కేసీఆర్ దూరంగా ఉంచారు.

ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కీలక భేటీ జరుగుతుంటే.. కవిత మాత్రం బీసీలకు 42శాతం రిజర్వేషన్ల డిమాండ్ తో నిరశన దీక్షలో కూర్చున్నారు. వాస్తవానికి కవిత మూడు రోజుల నిరశన దీక్ష ప్రకటించినప్పటికీ..  కోర్టు సూచనతో కవిత ఒక్కరోజుకే పరిమితం చేశారు. ఈ సందర్భంగా ఆమె కాళేశ్వరం నివేదికపై ఏమీ మాట్లాడలేదు.  అసలు కాళేశ్వరం కమిషన్ నివేదిక, ఈ నివేదిక తో  కేసీఆర్ అరెస్టు ఎదుర్కొంటున్నారన్న విషయాలను ఆమె ఇసుమంతైనా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.  

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తన సోదరుడు కల్వకుంట్ల తారకరామారావుపై తిరుగుబావుటా ఎగురవేసిన కవిత.. తండ్రి కేటీఆర్ కు కూడా దూరంగా ఉంటూనే తన సొంత బాటలో నడుస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మొత్తంగా కవిత.. కల్వకుంట్ల కుటుంబానికి దూరమయ్యారనడానికి కాళేశ్వరం కమిషన్ నివేదిక పై ఆమె మాట్లాడకపోవడమే తార్కానమని చెబుతున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.