Publish Date:May 31, 2025
తెలంగాణ సాధన కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడిన యోధుడికి నోటీసులా అంటూ ఈ నెల 4న ఇందిరా పార్క్ వద్ద భారీ దర్నాకు రంగం సిద్ధమైంది. అయితే ఈ ధర్నా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగబోవడం లేదు. కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జెండాలు లేకుండా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతోంది. కేసీఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం, కుట్ర ఉన్నాయని ఆరోపిస్తూ కవిత ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు.
కేసీఆర్ ఈ నెల 5న కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతకంటే ఒక రోజు ముందు అంటే జూన్ 4న కవిత ఈ ధర్నా నిర్వహించనున్నారు. ఇప్పటికే కవిత పార్టీ లైన్ కు భిన్నంగా వెడుతున్నారు. తండ్రికి రాసిన లేఖ లీక్ కావడం బీఆర్ఎస్ లో చీలికకు సంకేతంగా నిలిస్తే.. ఈ తరువాత మీడియాతో చిట్ చాట్ అంటూ ఆమె తన అన్న, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ గా పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు విమర్శలు.. ఆమెకు బీఆర్ఎస్ తలుపులు మూసేశాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆమె తెలంగాణ జాగృతి బ్యానర్ తో సొంతంగా రాజకీయ అడుగులు వేస్తున్నారు.
ఇందిరా పార్క్ వద్ద ధర్నా ఆ అడుగుల్లో మొదటిదని చెప్పవచ్చు. చావు నోట్లో తల పెట్టి.. తెలంగాణ సాధించిన ప్రజానాయకుడు కేసీఆర్పై రాజకీయ కుట్రలు సాగడం సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ధర్నా కు పిలుపు నిచ్చారు. అలాగే.. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని కవిత శనివారం ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పడం, మహిళల హక్కుల కోసం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న తెలంగాణ జాగృతి సంస్థ, ఇక కొత్త కార్యాలయం ద్వారా మరింత విస్తృతంగా ఉధృతంగా నిర్వహించనుందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kavitha-dharna-at-indirapark-on-june-4th-39-199049.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
Publish Date:Oct 31, 2026
రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ప్రశాంతంగా సాగేనా.?