Publish Date:Mar 20, 2023
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు సోమవారం (మార్చి 20)సుదీర్ఘంగా విచారించి అరెస్టు చేయకుండానే పంపించారు. అయితే విచారణ ఇంకా ముగియలేదనీ మరోసారి విచారణకు రావాలనీ చెప్పారు. సోమవారం (మార్చి 20) ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ ఆమెను సుదీర్ఘంగా విచారించారు. సాయంత్రం సమయంలో వైద్యులను పిలిపించి పరీక్షలు కూడా నిర్వహింపచేశారు. దీంతో ఆమెను అరెస్ట్ చేస్తారని అంతా భావించారు.
చివరికి ఆలస్యంగా కవితను వదిలి పెట్టారు. కవిత దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో 24వ తేదీన విచారణకు రానున్న నేపథ్యంలో అప్పటి వరకూ ఆమెను అరెస్టు చేసే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆమె తన పిటిషన్ లో మహిళల్ని విచారణకు దర్యాప్తు సంస్థల కార్యాలయాలకు పిలవకూడదనీ, సాయంత్రం ఐదు గంటల తర్వాత విచారించకూడదనే వాదన వినిపించారు. అయితే ఈడీ మాత్రం కవితను కార్యాలయానికి పిలిపించుకుని రాత్రి పొద్దు పోయే వరకూ విచారించింది. మరోవైపు ఈ ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పటికే ప్రధాన నిందితులందరూ అరెస్టయ్యారు. కవితకు మాత్రమే ఎందుకు మినహాయింపు అంటూ కాంగరెస్ సహా పలు పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.
ఇలా ఉండగా సోమవారం కవిత విచారణ సుదీర్ఘంగా అంటే దాదాపు పది గంటలకు పైగా సాగింది. కవితను ఈ కేసులో ఇప్పటికే అరెస్టై ఉన్న రామచంద్ర పిళ్లైతో, తర్వాత అప్రూవర్‌గా మారిన అమిత్ అరోరాతో కలిసి విచారించినట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఆమెను బయటకు పంపిన ఈడీ అధికారులు మంగళవారం (మార్చి 21)న మరోసారి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. దీంతో నిన్నటికి అరెస్టు లేదని ఊపిరి పీల్చుకున్న బీఆర్ఎస్ వర్గాలలో ఈ రోజు ఏం జరగనుందన్న టెన్షన్ మొదలైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kavita-to-attend-ed-inquiry-once-again-25-152765.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి