చంద్రబాబు అపర చాణుక్యుడో లేక చేతకాని ***.. కత్తి మహేష్ ఘాటు వ్యాఖ్యలు!!
Publish Date:Jun 22, 2019
Advertisement
కత్తి మహేశ్ అంటే గతంలో ఎవరికీ తెలియదు. ఆయన తెలుగు రియాలిటీ షో "బిగ్ బాస్" సీజన్ 1లో పాల్గొన్న తర్వాత సెలెబ్రిటీ అయిపోయాడు. ఆ తర్వాత తరచూ మీడియా డిబెట్లలో పాల్గొనడంతో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తో జరిగిన వివాదంతో ఒక్కసారిగా ఫేమ్ అయిపోయాడు. ఆ మధ్య శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో హైదరాబాద్ పోలీసులు ఆయనను నగర బహిష్కరణ చేశారు. అప్పటి నుంచి ఏపీలోనే వున్నాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ సానుభూతి పరుడిగా మారిపోయాడు. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. తన పేస్ బుక్ అకౌంట్ లో ‘‘చంద్రబాబు అపర చాణుక్యుడో లేక చేతకాని చవటో తెలుగుదేశం పార్టీలోని కమ్మోళ్ళు డిసైడ్ చేసి చెప్పేస్తే, మా అనాలిసిస్ మేము చేసుకుంటాం’’ అంటూ వివాదాస్పద పోస్టు పెట్టాడు. దీనిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభిమానులు, నాయకులు తెగ షేర్లు చేస్తున్నారు. ఇదే కాదు టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడం పైనా ‘‘తెలుగుదేశం రాజ్యసభ ఎంపీలు గంపగుత్తగా బీజేపీలోకి ఎందుకు వెళ్లారు? 1. చంద్రబాబే వాళ్ళని బీజేపీకి అమ్ముకున్నాడు 2. వాళ్ళవాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడానికి, జైలుకి వెళ్లకుండా తప్పించుకోవడానికి ఎంపీలే వెళ్లారు 3. రాజ్యసభలో తమ బలాన్ని పెంచుకోవడానికి బీజేపీ వీళ్ళని ఆకర్షించింది 4. పైనున్నవి అన్నీ (మల్టిపుల్ ఛాయ్స్ ప్రశ్న - 5 మార్కులు). *సమాధానం తెలిసీ చెప్పకపోతే, చంద్రబాబుతో పాటు మీరు విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వస్తుంది’’ అని పోస్ట్ చేసాడు.
http://www.teluguone.com/news/content/kathi-mahesh-sensational-comments-on-chandrababu-naidu-39-87551.html





