ఏమిటీ గో గోవిందం.. క‌రుణాక‌రా...

Publish Date:Apr 17, 2025

Advertisement

మీ హ‌యాంలో చేసిన పాత త‌ప్పులన్నీ
బ‌య‌ట ప‌డ‌తాయ‌నా?
భూమ‌న బాగోతాల వెన‌క దాగిన‌
అస‌లు ర‌హ‌స్యాలేంటి?
పాత త‌ప్పుల‌ను క‌ప్పి పుచ్చుకోడానికి
భూమ‌న చేస్తున్న కొత్త గో గాయాలేంటి?

మ‌డ‌క‌శిర  ఎమ్మెల్యే చెప్పిన‌ట్టు.. వెంక‌టేశ్వ‌ర‌స్వామి అంటే ఎంత మాత్రం భ‌క్తిభావం లేని క‌రుణాక‌ర‌రెడ్డి ఏమిటి? ఇంత భారీ ఎత్తున గోనాట‌కం మొద‌లు పెట్ట‌డ‌మేంటి? నిజంగానే గోవుల‌పై ఆయ‌న‌కింత‌టి ప్రేముందా? ఇందులో దాగిన అస‌లు మ‌త‌ల‌బేంటి? అన్న‌దిప్పుడు ప్ర‌శ్నార్ధ‌కం అయి కూర్చుంది. ఇక్క‌డ క‌రుణాక‌ర‌రెడ్డి గోడ్రామా వెన‌క కొన్ని కొన్ని ప్ర‌త్యేక కార‌ణాలున్న‌ట్టుగా చెబుతున్నారు. ఇది వ‌ర‌కు గోశాల డైరెక్ట‌ర్ గా ఉన్న వ్య‌క్తి ఉప్పందించ‌డం వ‌ల్లే.. ఈ మొత్తం తంతు భూమ‌న న‌డిపిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ఆ మాజీ గోశాల డైరెక్ట‌ర్ పై  తొక్కిస‌లాట వ్య‌వ‌హారంలో టీటీడీ క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంతో.. అత‌డు టీటీడీపై క‌క్ష క‌ట్టిన‌ట్టుగా అంచ‌నా వేస్తున్నారు. దానికి తోడు ఇత‌డు భూమ‌నకు అత్యంత‌ ప్రియ శిష్యుడు కావ‌డంతో ఇదంతా వెన‌కుండి జరిపిస్తున్న‌ట్టు భోగ‌ట్టా.

ఆ మాజీ డైరెక్ట‌ర్ మాజీ టీటీడీ చైర్మ‌న్ మ‌ధ్య మ‌రో సీక్రెట్ కూడా దాగి ఉన్న‌ట్టు చెబుతున్నారు. గ‌తంలో వీరు విదేశీ గోవుల వ్య‌వ‌హారంలో స్కామ్ కి తెర‌లేపార‌నీ.. ఇది ఎక్క‌డ బ‌య‌ట ప‌డుతుందో అన్న ఆందోళ‌న కొద్దీ ఈ ఇద్ద‌రూ క‌ల‌సి ఈ గోమ‌ర‌ణాల‌ు అనే తేనెతుట్టె క‌దిపార‌నీ అంటున్నారు.

ఇదంతా ఒక నాట‌క‌మ‌ని తెలిసినా కానీ కూట‌మి ప్ర‌భుత్వం   పెద్దగా తిప్పి కొట్ట‌లేక పోతోంది. దానికి తోడు గోవుల‌కు సంబంధించిన విజిలెన్స్ రిపోర్టులు, ఆపై త‌ర‌చూ చ‌నిపోయే గోవుల‌కు సంబంధించిన లెక్కల విష‌యంలో వారికి వారే సెల్ఫ్ గోల్ వేసుకోవ‌డం భూమ‌న‌కు బాగా క‌లిసి వ‌చ్చిన‌ట్ట‌య్యింది.

ఒక ప‌క్క చూస్తే భూమన త‌న రాజ‌కీయ వారసుడిగా రాణిస్తాడ‌నుకున్న కొడుకు కాస్తా ఆదిలోనే హంస‌పాదులా.. గ‌త ఎన్నిక‌ల్లో ఓడ‌టం. ఆపై కార్పొరేష‌న్ వ్య‌వ‌హారంలో అడ్డంగా బుక్ అవ‌డం వంటి అంశాల‌తో అత‌డు ఎంత మాత్రం పెర్ఫామెన్స్ చూపించ‌లేక పోతున్నాడు. ఇది గ‌మ‌నించిన భూమ‌న తానే స్వ‌యంగా రంగంలోకి దిగి పార్టీని తిరిగి గాడిలో పెట్ట‌డం, తన ఉనికి కాపాడుకోవడం కోసం ఈ గో డ్రామాకు తెర‌లేపిన‌ట్టు తెలుస్తోంది. 

ఇది రెండు విధాలుగా భూమ‌నకు అవ‌స‌రంగా క‌నిపిస్తోంది. గ‌తంలో తన పాల‌న‌లో టీటీడీలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌లు బ‌య‌ట ప‌డ‌కుండా ఉండాలంటే ముంద‌ర‌ కాళ్ల బంధం అత్య‌వ‌స‌రం. ఇటు చూస్తే క‌ల్తీ నెయ్యి వ్య‌వ‌హారంతో పాటు ఇంకా ఎన్నో విష‌యాల్లో భూమ‌న గ‌ట్టిగా ఇరుక్కునే విధంగా క‌నిపిస్తోంది. ఆ మాట‌కొస్తే గ‌త ఐదేళ్ల‌లో 2 వేల మంది భార‌త‌మ్మ సైన్యం అన్య‌మ‌త‌స్తుల రూపంలో తిరుమ‌ల‌లో పెద్ద ఎత్తున కీల‌క శాఖ‌ల‌లో కీల‌కంగా ప‌ని చేస్తున్నార‌ని లెక్క‌లు చెబుతున్నాయి. వీరంద‌రి ద్వారా ఇన్నాళ్ల పాటు సాగిన విధ్వంసం ఇప్పుడు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట ప‌డే ప్ర‌మాద‌ముంది.

టీటీడీకే అత్యంత కీల‌క‌మైన ఆన్ లైన్ బుకింగుల్లో పెద్ద ఎత్తున అక్ర‌మాలు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఆన్ లైన్ టికెట్ల‌తో పాటు పాసుల జారీ వ‌ర‌కూ భారీ ఎత్తున గోల్ మాల్ జ‌రిగిన‌ట్టు క‌నిపిస్తోంది. ఒక్క రోజానే వేల కొద్దీ పాసులు జారీ చేసి.. ల‌క్ష‌ల్లో వ‌సూలు చేశార‌ని అంటున్నారు. ఇవ‌న్నీ బ‌య‌ట ప‌డ‌కుండా ఉండాలంటే ఇదే స‌రైన ప‌నిగా భూమ‌న ఈ గోనాట‌కాన్ని తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తోంది.

ఒక ప‌క్క టీటీడీ చైర్మ‌న్ గా బీఆర్ నాయుడు బాద్య‌త‌లు చేప‌ట్టినప్ప‌టి నుంచి త‌ర‌చూ ఏవో  వివాదాలు. తొక్కిస‌లాట గొడ‌వ‌లు, ఏకంగా ఒక బోర్డు మెంబ‌రే బూతులు, ఇక మ‌హా ద్వారం ముందు వ‌ర‌కూ చెప్పులేసుకుని రావ‌డాలు, ఫోటో షూట్లు, డ్రోన్లు ఆనంద నిల‌యం మీద ఎగ‌ర‌డాలు.. వంటి వివాదాస్ప‌ద అంశాల‌తో వ‌రుసగా దెబ్బ‌లు తింటూ వ‌స్తున్న పాల‌క మండ‌లిని మ‌రింత ఇర‌కాటంలో ప‌డేయ‌టానికి.. గో మ‌ర‌ణాల వ్య‌వ‌హారాన్ని ముందుకు తేవ‌డంతో ఇటు టీటీడీ పాల‌క మండ‌లి, అటు ఈవో సైతం ఇబ్బందుల్లో పడ్డారని తెలుస్తోంది.

అయితే ఇదంతా ప్ర‌తిప‌క్ష పార్టీ పారిస్తోన్న‌ పాచిక‌గా.. కేబినెట్ భేటీల్లో గుర్తించిన మంత్రి మండ‌లి..  దీన్ని తిప్పి కొట్టే కార్యాచ‌ర‌ణ త‌యారు చేయాల‌నుకున్నా.. అదెలాగో వారికంటూ ఒక అంచ‌నా లేక పోవ‌డంతో భూమ‌న గోనాట‌కం  ర‌క్తి క‌డుతోందని అంటున్నారు.  దీంతో గోవుల సంఖ్య నుంచి స్వామి వారికి త‌ర‌చూ తీసుకెళ్లే పాల వ‌ర‌కూ ఆయ‌న లెక్క‌లు బ‌య‌ట‌కు తీస్తుంటే, ఇక్క‌డ పాల‌క‌మండ‌లి బుర్ర తిరుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ గ్యాప్ లో భూమ‌న మ‌రో అడుగు ముందుకేస్తూ  ఏనుగుల‌కు, గుర్రాల‌కూ స‌రైన ఆహారం అందించ‌లేక పోతున్నార‌నే విష‌యాల వ‌ర‌కూ ఏక‌ర‌వు పెడుతున్నారు. అక్క‌డితో చాల‌క నిషేధ‌మున్న కొండ మీద మ‌ద్య మాంసాల వ్య‌వ‌హారాల‌ను సైతం జ‌నం ముందుకు తెస్తూ.. గ‌తంలో త‌మ పాల‌న‌లో జ‌రిగిన లోటు పాట్లు బ‌య‌ట‌కు పొక్క‌కుండా గ‌ట్టి కోట‌గోడే క‌డుతోంది క‌రుణాక‌ర్ రెడ్డిలోని రాజ‌కీయ చ‌తుర‌త‌.

అందుకే ఆయ‌న ఫేక్ ఫోటోలు వీడియోల‌తో చేసే ప్ర‌చారం సైతం చెల్లుబాటు అవుతోంద‌ని అంటున్నారు. ఇదే తెలంగాణ‌లో కంచె గ‌చ్చిబౌలీ భూముల వ్య‌వ‌హారంలో ఫేక్ వీడియోలు, ఫోటోల‌ను షేర్ చేసిన స్మిత స‌బ‌ర్వాల్ వంటి వారిని కూడా వ‌దిలి పెట్టుకుండా కేసులు బుక్ చేస్తున్నారు. నోటీసులు పంపుతున్నారు. అలాంటిదిక్క‌డ క‌నుచూపు మేర కూడా క‌నిపించ‌డం లేదు. భ‌య‌పెట్ట‌డానికైనా కేసులు, నోటీసులు పంప‌లేక పోవ‌డంతో.. భూమ‌న రోడ్డు మీద‌ కొచ్చి మ‌రీ మ‌హాభార‌తంలో గోగ్ర‌హ‌ణం అంత పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్న‌ట్టుగా భావిస్తున్నారు.
 
గురువారం  శ్రీవారి నిజ‌నేత్ర ద‌ర్శ‌నం జ‌రుగుతుంద‌ని అంటారు. ఆ రోజు స్వామివారి ప‌ట్ల తప్పు ఎవ‌రు చేస్తున్నారో వారి బండార‌మంతా బ‌య‌ట ప‌డుతుంద‌ని చెబుతారు. అలాంటి గురువారం ఎప్పుడొస్తుంది? ఈ గోనాట‌కాల వెన‌క దాగిన ర‌హ‌స్యాలు ఎప్పుడు బ‌య‌ట ప‌డుతాయో ఎదురు చూస్తున్నారు స్వామివారి భ‌క్తులు.

By
en-us Political News

  
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.