ప్రభుత్వం ఏర్పాటు చేసి మంత్రివర్గ కూర్పు పూర్తి చేసి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న బీహార్ సీఎం నితీష్ కుమార్ కు అంతలోనే బిగ్ షాక్ తగిలింది. ఆయన కేబినెట్ నుంచి ఆర్జేడీకి చెందిన కార్తీక్ కుమార్ రిజైన్ చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ ఆర్జేడీకి చెందిన కార్తిక్ కుమార్ కు న్యాయశాఖ మంత్రి పదవి ఇచ్చారు.
అయితే ఆయనపై కిడ్నాప్ కేసు నమోదై ఉండటంతో నితీష్ పై విమర్శలు వెల్లువెత్తాయి. న్యాయశాఖ మంత్రిగా కార్తిక్ కుమార్ తనపై కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే నితీష్ కుమార్ కార్తిక్ కుమార్ మంత్రిత్వ శాఖ మార్చారు. పెద్దగా ప్రాధాన్యత లేని చెరకు మంత్రిత్వ శాఖ ఇచ్చారు. దీంతో ఆయన అలకపాన్పు ఎక్కారు. శాఖ మార్చిన వెంటనే ఆయన రాజీనామాకు సిద్ధమయ్యారు.
చెరకు మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన గంటల వ్యవధిలోనే మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను నేరుగా గవర్నర్ కే పంపారు. ఆయన దానిని వెంటనే ఆమోదించారు. 2014లో జరిగిన ఒక కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న కార్తీక్ కుమార్ పై ప్రస్తుతం కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే న్యాయశాఖ మంత్రిగా ఆయనను కొనసాగించడం భావ్యం కాదని తలచిన నితీష్ కుమార్ ఆయన శాఖను మార్చారు.
మామూలుగా చూస్తే ఇది సాధారణమే అనిపిస్తుంది కానీ బీహార్ లో సామాజిక సమీకరణాలను పరిగణనలోనికి తీసుకుంటే కార్తీక్ కుమార్ రాజీనామా సీఎం నితీష్ కుమార్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే బీహార్ లో రాజకీయంగా శక్తిమంతమైన భూమిహార్లకు చెందిన కార్తీక్ కుమార్ నితీష్ పై అలకపూనడం ఆర్జేడీ, జేడీయూ బంధంపై అంటే పొత్తుపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని బీజేపీ కార్తి కుమార్ పై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించే అవకాశం లేకపోలేదంటున్నారు. ఆయనతో పాటుగా మహాఘట్ బంధన్ కూటమిలో మంత్రి పదవులు దక్కక అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారిపైనా బీజేపీ దృష్టి సారిస్తే నితీష్ కుమార్ కు చిక్కువు తప్పకపోవచ్చని విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kartik-kumar-resigns-fron-nitesh-kumat-cabinet-25-143029.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.