ఇద్దరు సీనియర్ IASల ఫైట్! రూ. 12 కోట్లు ఏమయ్యాయో.. ? 

Publish Date:Jun 5, 2021

Advertisement

కరోనా మహమ్మారితో దేశమంతా పోరాడుతోంది. ఫ్రంట్ లైన్ వర్కర్స్ ప్రాణాలకు తెగించి కరోనా కట్టడికి శ్రమిస్తున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ కొందరు అధికారులు నీచంగా వ్యవహరిస్తున్నారు. కాసుల కక్కుర్తితో స్కాములకు తెగబడుతున్నారు. కింది స్థాయి ఉద్యోగులే కాదు కొందరు ఐఏఎస్ అధికారులు కూడా అత్యంత దిగజారి వ్యవహరిస్తున్నారు. తాజాగా కోవిడ్ కంట్రోల్ కోసం కేటాయించిన డబ్బుల విషయంలో ఇద్దరు ఐఏఎస్ లు మధ్య జరిగిన గొడవ తీవ్ర కలకలం రేపుతోంది. 

కర్నాటకలో ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారుల మధ్య వివాదం రచ్చకెక్కింది. మైసూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శిల్పా నాగ్, డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తనను రోహిణి సింధూరి వేధించారంటూ శిల్పా నాగ్ పదవికి..రాజీనామా చేయగా.. తానేమీ వేధించలేదని, ఆమె ఆరోపణలు నిరాధారమని రోహిణి కౌంటర్ ఇచ్చారు. వీరిద్దరి మధ్య రగడకు 12 కోట్ల రూపాయలే కారణమని తెలుస్తోంది. 

కొవిడ్ కంట్రోల్, చికిత్స కోసం గ్రామాలకు డాక్టర్ల మార్చ్  పేరిట కర్ణాటక సర్కార్ నిధులిస్తోంది. కొవిడ్ మేనేజ్ మెంట్ లో భాగంగా రూ. 12 కోట్ల కార్పొరేట్ ఫండ్ ను మైసూర్ కార్పొరేషన్ కు  కేటాయించింది. ఈ నిధుల గురించి తాను కమిషనర్ శిల్పా నాగ్ ను ప్రశ్నిస్తే ఆమె పొంతనలేని సమాధానాలు చెబుతోందని రోహిణి ఆరోపించింది. ఈ సీఎస్ఆర్ నిధులను ఎలా ఖర్చు పెట్టారని అడిగితే ..ఒక రోజున ప్రజలకు 400 ఇన్ఫెక్షన్లు, మరో రోజున-40 ఇన్ఫెక్షన్లు సోకాయని చెబుతున్నారన్నారు. 

జులై 1 నాటికి మైసూరును కొవిడ్ రహిత జిల్లాగా మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, అందువల్ల తాము గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల వారీగా వివరాలను తెలుసుకోదలిచామని రోహిణి చెబుతున్నారు. చీఫ్ సెక్రటరీ రవికుమార్ దృష్టికి అన్ని అంశాలనూ తీసుకు వచ్చామని ఆమె చెప్పారు. తన అనుమతి లేకుండా శిల్పా నాగ్ ప్రెస్ మీట్ ఎలా పెట్టారని రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైసూరు డిప్యూటీ కమిషనర్ (రోహిణి సింధూరి) తన అధికారిక నివాసంలో రూ. 50 లక్షల వ్యయంతో స్విమ్మింగ్ పూల్, జిమ్నాసియం ఎలా నిర్మించారో దర్యాప్తు చేయాలని ప్రభుత్వం రీజనల్ కమిషనర్ ని ఆదేశించింది. 

మరోవైపు ఇద్దరు మహిళా సీనియర్ ఐఏఎస్ అధికారుల వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. అధికారుల మధ్య వివాదంపై  మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ అసమర్థతని చూపుతోందని, ఇంతకీ రూ. 12 కోట్లు ఏమయ్యాయని అన్నారు.

By
en-us Political News

  
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.