కరీంనగర్‌లో ఏటీఎం దొంగల కలకలం.. లేడీ గెటప్‌తో షాక్..!

Publish Date:Sep 20, 2026

Advertisement

లేడీ గెటప్‌లో వచ్చి.. సీసీటీవీలపై స్ప్రేలతో దాడి..!

అర్ధరాత్రి దాటింది.. అంతా గాఢ నిద్రలో ఉన్న వేళ దొంగల ముఠా రంగంలోకి దిగింది. టార్గెట్ ఒక్కటే.. ఎస్బీఐ ఏటీఎంలు! పక్కా ప్లాన్‌తో వచ్చిన దుండగులు.. ఒకచోట గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను ధ్వంసం చేయగా.. మరోచోట ఏకంగా లేడీ గెటప్‌లో వచ్చి సీసీటీవీ కెమెరాలపై స్ప్రే కొట్టి తమ ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా దుర్షేడ్, తిమ్మాపూర్ ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి.

కరీంనగర్ జిల్లా దుర్షేడ్‌లో తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో స్కార్పియో వాహనంలో వచ్చిన ముగ్గురు దుండగులు ఎస్బీఐ ఏటీఎంను టార్గెట్ చేశారు. ముందుగా సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసిన దుండగులు.. ఆ తర్వాత గ్యాస్ కట్టర్‌తో క్యాష్ మిషన్‌ను కట్ చేసి నగదును ఎత్తుకెళ్లారు. అనంతరం అదే స్కార్పియో వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు.

ఇక తిమ్మాపూర్‌లోని మరో ఎస్బీఐ ఏటీఎం వద్ద దొంగలు అనుసరించిన పద్ధతి మరింత ఆసక్తికరంగా ఉంది. లేడీ గెటప్‌లో వచ్చిన దుండగులు ముందుగా సీసీటీవీ కెమెరాలపై స్ప్రే కొట్టారు. తమ కదలికలు కెమెరాల్లో స్పష్టంగా రికార్డు కాకుండా జాగ్రత్తలు తీసుకున్న అనంతరం ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు.

ఒకే రాత్రి రెండు ఎస్బీఐ ఏటీఎంలను టార్గెట్ చేయడం.. అందులోనూ ఒకచోట కెమెరాలను ధ్వంసం చేయడం, మరోచోట కెమెరాలపై స్ప్రే కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాలకు చేరుకుని ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దుండగుల కదలికలపై ఆరా తీస్తున్నారు. చోరీకి ఉపయోగించిన స్కార్పియో వాహనం ఏ దిశగా వెళ్లిందనే దానిపైనా దర్యాప్తు చేస్తున్నారు. ఈ రెండు ఘటనల వెనుక ఒకే ముఠా ఉందా? లేక వేర్వేరు ముఠాలా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

కెమెరాలకు చిక్కకుండా లేడీ గెటప్.. ఏటీఎంను ధ్వంసం చేసేందుకు గ్యాస్ కట్టర్.. తప్పించుకునేందుకు స్కార్పియో.. ఇలా పక్కా ప్లాన్‌తో జరిగిన వరుస ఏటీఎం చోరీలు కరీంనగర్‌లో కలకలం రేపుతున్నాయి.

 

 

[ Karimnagar ATM Robbery, SBI ATM Theft, ATM Robbery, Lady Getup Robbery, CCTV Spray, Gas Cutter, ATM Burglary, Durgshed ATM Theft, Thimmapur ATM Robbery, Scorpio Vehicle, Telangana Crime, Karimnagar Crime, ATM Thieves, Police Investigation ]

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రంలో యాదవ సోదరుల ఆత్మగౌరవ వేడుకగా భావించే చారిత్రక సదర్ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది.
కదులుతున్న బస్సులోంచి తోసేయడంతో విషాదం.. ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం.!
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన తాజా సంచలన చిత్రం ఇరుముడి చట్టపరమైన చిక్కుల్లో పడింది.
60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అవసరానికి ఆదుకుంటుందనే నమ్మకంతో ఓ వ్యక్తి ర్యాపిడో పార్సిల్ సేవలను ఆశ్రయించాడు.
బిగ్ బ్రదర్ ఆఫీసులో రియల్టర్‌కు ప్రత్యేక ఛాంబర్.. ఒక్క బిల్డర్ కోసం వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తారా?
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న మరో అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు.  
.గరల్స్ హాస్టల్ ముసుగులో నిర్వహిస్తున్న అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. పక్కాగా అందిన సమాచారంతో హైదరాబాద్ ప్రకాశ్ నగర్ లో అమినీత గరల్స్ హాస్టల్ పై దాడి చేయడంలో అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ గుట్టు రట్లైంది.
పలు ప్రాంతాలలో ఇప్పటికే  రోజూవారీ సరఫరా  నిలిపివేశారు. రోజు విడిచి రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ముందు ముందు ఇది రెండు రోజులు, మూడు రోజులు. వారం రోజులకు కూడా పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులే ఆఫ్ ది రికార్డ్ చెడుతున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.