తెలుగుదేశం గూటికి కరణం బలరాం?

Publish Date:Oct 24, 2024

Advertisement

ప్రకాశం జిల్లాకు చెందిన బలమైన రాజకీయ నాయకులలో  కరణం బలరాం కూడా ఒకరు. చీరాల మాజీ ఎమ్మెల్యే అయిన కరణం బలరాం  గతంలో తెలుగుదేశంలో కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడికి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. తెలుగుదేశం తరఫున ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా  గెలిచిన కరణం బలరాం, 2019 ఎన్నికలలో చీరాల నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచిన కరణం బలరాం ఆ తరువాత వైసీపీ గూటికి చేరారు. అంతకు ముందు వరకూ ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న కరణం బలరాం తెలుగుదేశం వీడి వైసీపీలో చేరడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే తన కుమారుడి రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని 2024 ఎన్నికలలో తన స్థానంలో కుమారుడిని పోటీలో దింపాలన్న ఆలోచనతోనే కరణం బలరాం వైసీపీ గూటికి చేరారని అప్పట్లో పరిశీలకులు విశ్లేషణలు కూడా చేశారు.

ఏది ఏమైనా కరణం బలరాం తెలుగుదేశం పార్టీని వీడి జగన్ పంచన చేరడంతో తెలుగుదేశం శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చీరాల నియోజకవర్గంలోనే కాకుండా మొత్తం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కరణం బలరాంకు నిరసన సెగలు తగిలాయి. అయితే వాటిని వేటినీ కరణం బలరాం పట్టించుకోలేదు. ఆయన కోరుకున్నట్లుగానే 2024 ఎన్నికలలో చీరాల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆయన కుమారుడు కరణం వెంటేష్ పోటీ చేశారు. అయితే ఘోర పరాజయం పాలయ్యారు. వైసీపీ పార్టీ పరాజయం మూటగట్టుకుని రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. 

ఆ తరువాత కరణం వెంకటేష్ కు జగన్ జిల్లా పార్టీ  అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని కరణం బలరాం ఆశించారు. అయితే జగన్ మాత్రం పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని మేరుగ నాగార్జునకు కట్టబెట్టారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కరణం బలరాం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన కుమారుడితో సహా తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఇప్పుడు ఆ ప్రచారానికి బలం చేకూర్చే సంఘటన ఒకటి జరిగింది. 

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవడి వివాహ నిశ్చితార్థ వేడుకలో చంద్రబాబునాయుడిని కరణం బలరాం పలకరించారు. ఇరువురూ కొద్ది సేపు ముచ్చటించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంకయ్యనాయుడు మనవడి నిశ్చితార్ధ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు. అలాగే పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం కూడా హాజరయ్యారు. ఆ సందర్భంగానే ఆయన చంద్రబాబును కలిసి పలకరించారు. ఇరువురూ కలిసి నవ్వుతూ కొద్ది సేపు మాట్లాడుకున్నారు. పక్కనే ఉన్న కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా కరణం బలరాంతో మాటలకు కలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. అంతే కాకుండా కరణం బలరాం తెలుగుదేశం గూటికి చేరుతున్నారన్న వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. 

By
en-us Political News

  
కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.