కమలానికి కన్నా గుడ్‌బై?

Publish Date:Dec 15, 2022

Advertisement

ఉభయ తెలుగు రాష్ట్రాలలో, ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయ ముంది. ముందస్తు ఎన్నికలు తధ్యమని ప్రచారం జరుగుతున్నా, ఆ ముచ్చట ముడిపడే సూచనలు పెద్దగా కనిపించడం లేదు. అయినా అటు ఏపీలో, ఇటు తెలగాణ ఎన్నికల సందడి ఉపందుకుంటోంది, పొత్తులు,ఎత్తులు తెరపై కొస్తున్నాయి. రాజకీయ లెక్కలు మారి పోతున్నాయి. ఉభయ రాష్ట్రాల రాజకీయ ‘కుల’ సమీకరణాలు కలగాపులగంగా కలిసి పోతున్నాయి. 

ముఖ్యంగా ఉభయ రాష్ట్రాలలో ఎంతో కొంత సినిమా, రాజకీయ గ్లామర్’ ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందనే వార్త సహజంగానే  ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. ఏపీలో బీజేపీ మిత్ర పక్షంగా ఉన్న జనసేన తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయడం అంటే ... ఎవరికోసం అనే ప్రశ్న సహజంగానే, పై కొచ్చింది. అంతే కాదు  అక్కడ ఎపీలోనూ పవర్ స్టార్, బీజేపీతో తెగతెంపులు చేసుకునే ఆలోచనలో ఉన్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి. నిజానికి, బీజేపీ, జనసేన పొత్తు ఉన్నా లేనట్లే, ఎవరి దారిలో వారు పోతున్నారు. రోడ్ మ్యాప్ అవీ ఇవీ అని మాట్లాడుతున్నా ఎప్పుడైనా బీజేపీ, జనసేన బంధం పుటుక్కుమనవచ్చనే ఉహాగానాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.

అదలా ఉంటే, ఇప్పడు బీజేపీ - జనసేన పొత్తు కథ కొత్త మలుపు తిరిగింది. కాంగ్రెస్ ను వదిలి కమలం గూటికి చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారయణ బీజేపీకి గుడ్ బై చెప్పనున్నారనే వార్త గుంటూరు జిల్లా రాజకీయాల్లో చాలా కాలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కమలం గూటికి వచ్చిన కొద్ది కాలానికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిని చేరుకున్న కన్నా, గత కొంత కాలంగా పార్టీలో తనకు అంతగా ప్రాధాన్యత లేకుండా పోతోందనే అసంతృప్తిని అక్కడా, ఇక్కడా వ్యక్త పరుస్తున్నారు. ముఖ్యంగా తన  నుంచి పార్టీ అధ్యక్ష పగ్గాలు పుచ్చుకున్న సోము వీర్రాజుకు కన్నాకు మధ్య దూరం పెరిగింది. సోము వీర్రాజు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కన్నా సన్నిహితుల  వద్దనే కాదు మీడియా ముందు కూడా మొరపెట్టుకున్నారు. అయినా బీజేపీ అగ్ర నాయకత్వం కన్నా వేదనను  ఏమంత పట్టించుకోలేదు. అందుకే ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పే  ఆలోచనలో ఉన్నట్లు, పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. 

అందుకు తగ్గట్టుగానే   బుధవారం(డిసెంబర్14)  కన్నా ఇంటికి అనుకోని జనసేన అతిథి వచ్చారు. జనసేన పీఏసీ చైర్మన్, ఆ పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌ మరి కొందరు స్థానిక నాయకులను వెంట పెట్టుకుని  కన్నా  ఇంటికి వచ్చారు. దీంతో ఇప్పటికే ఆయన పార్టీ మారబోతున్నారని గాల్లో వినిపిస్తున్నవదంతులకు  మరింత బలం చేకూరింది. నిజానికి, నాదెండ్ల మనోహర్‌ ఒకరిద్దరు అనుచరులతో వచ్చి వెళ్లుంటే ఎలా ఉండేదో ఏమో కానీ, అది అలా జరలేదు. మరో వంక అదే సమయంలో కన్నా అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో  ఆయన నివాసానికి చేరుకోవడంతో ఏదో జరుగుతోందనే గుసగుసలు గుప్పుమన్నాయి.

ఈ నేపధ్యంలోనే గతంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.  రెండు  మూడు నెలల క్రితం కన్నా పార్టీని నడిపే విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తమతో పొత్తులో ఉన్న జనసేనతో సమన్వయం చేసుకోవడంలోనూ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని ఆయన పరోక్షంగానే అయినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై కారాలు మిరియాలు నూరారు. అలాగే, రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై పార్టీ అధినాయకత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా కన్నా వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన జనసేన ముఖ్యనేతతో భేటీ కావడంతో పార్టీ మార్పు విషయంలో నిర్ణయం తీసుకున్నారా  అనే వార్తలు జోరందుకున్నాయి.

అయితే, చివరకు అటు కన్నా, ఇటు నాదెండ్ల కూడా అబ్బే అదేం లేదు. ఒకప్పుడు ఒకే గూటి పక్షులం కదా, పైగా కలిసి చాలా కాలమైంది..ఒకసారి కలసి కూర్చుని కబుర్లాడుకున్నాం.. అంతే  అంతకు మించి ఇంకేమీ లేదు. కోడి గుడ్డు మీద ఈకలు పీక్కండి అనే అర్ధం వచ్చేలా చిన్నపాటి వివరణ ఇచ్చారు. కానీ, ఆడవారి మాటలకే కాదు, రాజకీయ నాయకుల మాటలకూ అర్థాలు వేరనే విషయం తెలియంది కాదు.  అవునంటే కాదని,  కాదంటే అవునని అనే కదా అని అనుకునే వారు అనుకుంటున్నారు. అలాగే, ‘దాల్ మే కుచ్ కాలా హై ..అని కొందరు హిందీలో,  నిప్పులేనిదే పొగ రాదుగా అని తెలుగులో ఇంకొందరు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే  కన్నా  పార్టీ మారడం విషయం ఎలా ఉన్నా  కేసేఅర్,  జగన్ రెడ్డి సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో, పవన్ కళ్యాణ్  హీరోనా ..? విలనా? అనేది ..అసలు ఆయన నటిస్తున్నారా .. నటిస్తుంటే ... ఇలా చాలా చాలా కొత్త సందేహాలు తెరపైకి వస్తున్నాయి.

By
en-us Political News

  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.