కర్నాటకలో కాంగ్రెస్ కు తోడుగా కమల్ హసన్!

Publish Date:May 1, 2023

Advertisement

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటనతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరింత ఉపందుకుంది. కాంగ్రెస్  అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాని నరేంద్ర మోదీ ‘విషసర్పం’ అంటూ దూషించిన నేపధ్యంలో శనివారం(ఏప్రిల్29)  కర్ణాటకలో సుడిగాలి పర్యటన చేసిన మోదీ, కాంగ్రెస్ నేతల  తనను దూషించిన ప్రతిసారీ ప్రజలు వారికి తగిన గుణపాఠం చెపుతూనే ఉన్నారని గతాన్ని గుర్తుచేశారు. ఇంతవరకు కాంగ్రెస్‌ పార్టీ కీలక నేతలు తనను 91 సార్లు దూషించారని ప్రధాని మోదీ అన్నారు. 

 కాంగ్రెస్‌ నేతలు నన్ను విష సర్పం.. చౌకీదార్‌ చోర్‌ అని ప్రచారం చేస్తున్నారు. లింగాయత్‌ సోదరులను అవినీతి పరులన్నారు. అయితే, నన్ను దూషించిన ప్రతిసారీ ప్రజలు వారికి తగిన గుణపాఠం నేర్పారు  అని మోదీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను, దేశం కోసం పోరాడిన సావర్కర్‌ను విమర్శించిన వారు తనను వదిలిపెడతారా? అంటూ కాంగ్రెస్‌ నేతలపై విరుచుకుపడ్డారు. 

అలాగే గతంలో కాంగ్రెస్, జేడీఎస్ సంకేర్ణ ప్రభుత్వంపైన మోదీ బాణాలు ఎక్కుపెట్టారు. ‘ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌’  పథకంలో లబ్ధిదారుల జాబితాను కేంద్రానికి పంపలేదని విమర్శించారు. ఆ పథకంలో లూటీ చేసేందుకు వారికి అవకాశం లేకపోవడంతో వెనకడుగు వేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ నేతలకు పేదల కష్టాలు అర్థం కావని అన్నారు. 

 డబుల్‌ ఇంజన్‌ పాలనలో పేదల సంక్షేమం వేగవంతంగా సాగుతోంది. డబుల్‌ ఇంజిన్‌ అంటే డబుల్‌ బెనిఫిట్‌, డబుల్‌ స్పీడ్‌. ఇటు రాష్ట్రం, అటు కేంద్రంలోను బీజేపీ ప్రభుత్వాలు ఉంటే డబుల్‌ శక్తి వస్తుంది. తద్వారా దేశంలోనే కర్ణాటక నంబర్‌ వన్‌గా మారుతుంది. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చి, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు ఆశీస్సులు అందించాలి  అని ప్రధాని కోరారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అన్న కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్య ప్రకటనపై మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  అలసిపోయి, ఓడిపోయిన కాంంగ్రెస్ సను ప్రజలు ఎన్నుకోరు. ఉత్సాహంతో నిండిన బీజేపీని గెలిపిస్తారు అని అన్నారు.

ఈసారి సంపూర్ణ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనే మాట కర్ణాటకలోని మారుమూల ప్రాంతాల్లోనూ ప్రతిధ్వనిస్తోందని చెప్పారు. అయితే మోదీ విమర్శలను కాంగ్రెస్ పార్టీ దీటుగా తిప్పికొట్టింది.  ప్రధాని మోదీకి ప్రజల బాధలు తెలియవని, వారి కష్టాలు వినే ఓపిక ఆయనకు లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా ఎదురుదాడి చేశారు. అంతే కాదు  ప్రజల ముందు సొంత బాధలు చెప్పుకొంటున్న తొలి ప్రధాని మోదీ అని ప్రియాంక అన్నారు.  కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా నవలగందలో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె పాల్గొన్నారు. దేశంలో ఎంతోమంది ప్రధానులను చూశా. వారెవరూ మోదీలా సొంత బాధలు చెప్పుకోలేదు అన్నారు. కర్ణాటకలో అవినీతిపరులకు బీజేపీ టికెట్లు ఇచ్చిందని విమర్శించారు. 40 శాతం కమీషన్‌ వ్యవహారాన్ని భరించలేక పోతున్నామని కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు ప్రధానికి స్వయంగా లేఖ పంపినా స్పందన లేదన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దిక్సూచి కానున్నాయని, కాంగ్రెస్‌ విజయాలకు ఈ ఎన్నికలు నాంది పలకడం ఖాయమని కేపీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌ అన్నారు.

ఇదలా ఉంటే, ప్రముఖ సినిమా హీరో, “మక్కల్‌ నీదిమయ్యం’అధ్యక్షుడు, కమల్‌హాసన్‌  కాంగ్రెస్‏కు మద్దతుగా శాసనసభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కోరిక మేరకు ఆయన మే మొదటివారంలో కాంగ్రెస్‌ కూటమికి మద్దతుగా ప్రచారం చేయనున్నారని ఎంఎన్‌ఎం నేతలు తెలిపారు. కమల్‌ ప్రచార పర్యాటన వివరాలు త్వరలో వెల్లడవుతాయని చెప్పారు. రాహుల్‌ జోడోయాత్ర నిర్వహించినప్పుడు కమల్‌ ఢిల్లీలో ఆయనతో కలిసి పాదయాత్ర చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం చేయనున్నారు. ఈ అంశాలను పరిశీలిస్తే వచ్చే యేడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మక్కల్‌ నీదిమయ్యం కాంగ్రె్‌సతో పొత్తు కుదుర్చుకోవటం ఖాయమని తెలుస్తోంది.

ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహరచనలపై గత రెండు రోజులుగా కమల్‌ కోయంబత్తూరు, సేలం జిల్లాలకు చెందిన పార్టీ నిర్వాహకులతో సమావేశమై చర్చించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‏తో పొత్తు ఖరారైతే పార్టీ నాయకుడు కమల్‌హాసన్‌ కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేయాలని పార్టీ నిర్వాహకులు కోరారు.2021 శాసనసభ ఎన్నికల్లో కమల్‌హాసన్‌ కోయంబత్తూరు సౌత్‌ నియోజకవర్గంలో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‏తో పొత్తు పెట్టుకుని కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేస్తే విజయం తథ్యమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

అయితే, స్వరాష్ట్రంలో ఒక సీటు గెలుచుకోలేని, కమల్ సహన్ ప్రచారంతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుంది అనే విషయంలో కాంగ్రెస్ నేట్ల్లోనే అనుమాన్నలున్నాయి. అయినా, కర్ణాటక ఎన్నికలలో చావూ రేవో తెలుచుకునేందుకు సిదమైన కాంగ్రెస్ పార్టీ, ఏ చిన్న అవకాశాన్ని జారవిదుచుకునేందుకు సిద్డంగా లేదని అందుకే  రాహుల్ గాంధీ కమల్ హెల్ప్ కోరారని అంటున్నారు.

By
en-us Political News

  
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.