కమల్ హాసన్  రాజకీయ కథ  ముగిసినట్లేనా ? 

Publish Date:May 25, 2021

Advertisement

కమల్ హసన్ చాలా గొప్ప నటుడు ... ఒక్క తమిళనాడు ప్రజలు మాత్రమే కాదు, యావత్ భారతదేశ ప్రజలు అభిమానించే నటుడు. సందేహం లేదు. ఆయన నటించిన సినిమాలను ప్రజలు ఆదరించారు. తెర మీద ఆయన బొమ్మ చూసి ఈలలు వేసారు... హరతులిచ్చారు. కానీ, అదే కమల్ రాజకీయ వేషం కడితే, తమిళ ప్రజలే ఛీ’ పొమ్మని చీదరించుకున్నారు. నిజమే, తమిళ రాజకీయాల సినీ పరిశ్రమ ప్రభావం కొంచెం చాలా ఎక్కవే. అన్నాదురై మొదలు ఎమ్జీఆర్, కరుణానిధి, జయలలిత వరకు ఇంచుమించుగా ఓ అర్థ దశాబ్దం పై తమిళ రాజకీయాలలో చక్రం తిప్పిన హేమాహేమీలుఅందరూ ఇంట(సినిమా రంగం) గెలిచి, రచ్చ (రాజకీయ) రంగంలో రాణించారు. అయితే, అదే తమిళనాడులో శివాజీ గనేషన్ మొదలు కమల్ హసన్ వరకు చాలా మంది మహా నటులు రాజకీయ యవనికపై, రాణించలేక పోయారు. 

కమల్ విషయాన్నే తీసుకుంటే, ఆయన స్థాపించిన, ‘మక్కల్‌ నీధి మయ్యమ్‌’(ఎంఎన్‌ఎం) పార్టీ, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో, చాలా  ఘనంగా ఓడిపోయింది. ఏపీలో పవన్ కళ్యాణ్ పార్టీ, జన సేన కంటే కూడా ఘోరంగా ఓడి పోయింది. జన సేనకు కనీసం ఒక్క సీటైన దక్కింది, (సరే ఆ గెలిచిన ఒక్క ఎమ్మెల్ల్యే గోడ దూకేశారు అనుకోండి అది వేరే విషయం)కమల్ పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా దక్కలేదు. చివరకు కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేసిన కమల్ హసన్, బీజేపీ అభ్యర్ధి వనతి శ్రీనివాసన్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. ఓటమి కంటే, బీజేపీ చేతిలో ఓడిపోవడం కమల్ హసన్ను, అత్త తిట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అన్నట్లుగా  మరింత క్షోభకు గురిచేసిందని, ఆయనే స్వయంగా వాపోయారు. 

అదలా ఉంటే, కమల్ పార్టీ కథ, ఎన్నికల తర్వాత చాలా ఇంటరెస్టింగ్’గా సాగుతోంది. పార్టీ నాయకులు వరస పెట్టి, కమల్ సారు వాడికి, గుడ్ బై చెప్పి వెళ్ళిపోతున్నారు. ఎన్నో ఆశలతో, ఏకంగా ముఖ్యమంత్రి అయిపోదామని కలలు కన్న కమల్’కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే వుంది. ఇప్పటికే, పార్టీ ఉపాధ్యక్ష్డుడు ఆర్ మహేంద్రన్, పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ బాబు, ప్రముఖ పర్యావరణ కార్యకర్త ప‌ద్మ ప్రియ సహా అనేక మంది ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు తాజాగా, పార్టీ పురుడు పోసుకున్న క్షణం నుంచి కమల్ వెంట ఉన్న,పార్టీ కీలక నేత సీకే కుమార్ వెల్’ సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. అంతే కాదు, ఆయన  పోతూ పోతూ రాజకీయాల్లో వ్యక్తి ఆరాధన, పనికి రాదని కమల్ వ్యవహార సరళిని తప్పు పడుతూ ఒక చురాక అంటించారు. కమల్ హసన్, ఆయన ఏర్పాటు చేసుకున్న వ్యూహ బృందం తప్పటడుగులు వేయడంవల్లనే, పార్టీ ఘోరంగా ఓడి పోయిందని మరో వాత పెట్టారు. పార్టీ  ఓటమికి కమలే కారణమని తేల్చి చెప్పి మరీ గుడ్ బై చెప్పారు. 

కాగా, ఈ రాజీనామాల పరపర ఇలాగే, కొనసాగితే, కమల్ పార్టీ ‘ఎంఎన్‌ఎం’ కూడా మఘలో పుట్టి పుబ్బలో మాయమై పోయిన పార్టీల జాబితాలో చేరిపోవదానికి ఎంతో కాలం పట్టదని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతే కాదు ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపక పోయినా మన పవన్ కళ్యాణ్, తమిళ రాజకీయ తెరపై, విజయకాంత్ అప్పుడప్పుడు అలా మెరుస్తూనే ఉన్నారు. కానీ, కమల్ హసన్ ... కథ ముగిసినట్లేనని, విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

కమల్ కథ ఇలా ఉంటే, కన్నడ సినీ నటుడు ఉపేంద్ర తనకు ముఖ్యమంత్రి అయిపోవాలని మహా కోరికగా ఉందని, తమ మనసులోని మాటను ట్విట్టర్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, ఆయన  ‘చిరు’ కోరిక తీరుతుందా..లేక ఆయన కన్నడ కమల్’ లా మిగిలిపోతారో .. చూడాలి.

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.