కమలంలో కారు విలీనం?.. తెర పైకి కొత్త చర్చ!

Publish Date:May 30, 2025

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత మరో సంచలనానికి తెర తీశారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగున్నాయని  మీడియా చిట్ చాట్ లో చెప్పారు. నిజానికి మై డియర్ డాడీ  అంటూ కేసేఅర్ కు రాసిన, లేఖలోనూ కవిత, బీజేపీ, బీఆర్ఎస్ సంబంధాలని ప్రస్తావించారు. వరంగల్ రజతోత్సవ సభలో  కేసీఆర్ బీజేపీ పట్ల కొంత మెతక వైఖరి అవలంబించారనే అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.  బీజేపీని గట్టిగా తిట్టకపోతే.. బీజేపీ, బీఆర్ఎస్ కలుస్తాయనే తప్పుడుసంకేతాలు ప్రజల్లోకి వెళతాయని అంటూ..  కేసీఆర్ తమ ప్రసంగంలో కేవలం రెండు నిముషాలు మాత్రమే బీజేపీని టార్గెట్ చేయడాన్ని నెగటివ్ పాయింట్స్ లో  చేర్చారు. 

ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న  కొత్త చర్చను తెర పైకి తెచ్చారు. అయితే..  కవిత లేఖలో పేర్కొన్న అంశాలలో కొంత నిజం ఉన్నా..  బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది ఎలా చూసిన అయ్యే పని కాదని పరిశీలకులు అంటున్నారు. నిజానికి  కేసీఆర్ బీఆర్ఎస్ ను బీజేపీలోనే కాదు, కాంగ్రెస్ సహా మరే పార్టీలోనూ విలీనం చేయరని..  ఒక్క ఏన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పార్టీ అస్తిత్వాన్ని చంపుకునే తప్పు కేసీఆర్ చేయరని ఆయన సన్నిహితులు అంటున్నారు.  నిజానికి.. గతంలో ఉద్యమ సమయంలోనూ కేసీఆర్  తెలంగాణ సాధించుకునే వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్  ముందు విలీనం ప్రతిపాదనను ఉంచారని..  ఒక పావుగా మాత్రమే విలీనం ప్రతిపాదన  చేశారని  కేసీఆర్ మాజీ మిత్రులు అంటున్నారు. 

అయితే..  బీఆర్ఎస్, బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలను మాత్రం కొట్టి వేయలేమని మాజీ మిత్రులతోపాటుగా,  ప్రస్తుత పరిణామాలను దగ్గరగా చూస్తున్న రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. నిజానికి..  ప్రస్తుత పరిస్థితిలో బీఆర్ఎస్, బీజేపీ ఎన్నికల పొత్తు ఉభయ తారకంగా రెండు పార్టీలకూ లాభ దాయకంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులతో పాటుగా  ఉభయ పార్టీలలో ఒక వర్గం గట్టిగా భావిస్తోంది. అయితే..  అదే సమయంలో రెండు పార్టీలలోనూ కూడా పొత్తు వద్దనే వాదన కూడ అంతే బలంగా వినిపిస్తోందని అంటున్నారు.   

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలను, ఉభయ పార్టీల ఓటు షేర్ లో వస్తున్న మార్పును గమనిస్తే..  బీఆర్ఎస్, బీజేపీ ఓటు పరస్పరం బదిలీ అవుతున్న వైనం కనిపిస్తుందని  విశ్లేషకులు అంటున్నారు.  ఉదాహరణకు 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే.. బీజేపీకి వచ్చిన ఓటు షేర్  జస్ట్ 7 శాతం. అసెంబ్లీలో కమలానికి దక్కింది ఒక్కటే సీటు..  కానీ, ఆతర్వాత కొద్ది నెలలకే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు షేర్  ఏకంగా 20 శాతానికి పెరిగింది. ఆ మేరకు బీఆర్ఎస్ ఓటు షేర్ తగ్గింది. 

అలాగే..  2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14 శాతం ఓట్లు 8 సీట్లు వచ్చాయి.  కానీ.. 2024లోక్ సభ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి బీజేపీ ఓటు షేర్ ఏకంగా 35 శాతానికి చేరింది.  అసెంబ్లీ స్థానాలతో సమానంగా  8 లోక్ సభ స్థానాలు బీజేపీ గెలుచుకుంది. మరోవంక అసెంబ్లీ ఎన్నికల్లో 37 శాతం ఓటు షేర్ సొంతం చేసుకున్న బీఆర్ఎస్ ఓటు షేర్ లోక్ సభ ఎన్నికల్లో  17 శాతానికి పడిపోయింది. అంటే, అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసిన ఓటర్లలో 20 శాతం మంది లోక్ సభ ఎన్నికల్లో కమలానికి ఓటు వేశారు. ఇక్కడ గమనించవలసిన మరో ముఖ్య విషయం ఏమిటంటే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటు షేర్ లో మార్పు అంతగా లేదు.  అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం ఓటుతో 65 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, అదే 40 శాతం ఓటుతో లోక్ సభ ఎన్నికలలో 8 సీట్లు తెచ్చుకుంది.
సో.. కళ్ళ ముందున్న ఓటు షేర్ లెక్కలు.  ఓటు ట్రాన్స్ఫర్  ప్యాట్రన్  ను గమనిస్తే..  బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఉభయతారకంగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అంతే కాకుండా, జాతీయ పార్టీగా బీజేపీకి లోక్ సభ ఎన్నికల్లో గెలుపు, కేంద్రంలో అధికారం కీలకం. అదే విధంగా ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్  కు అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు, రాష్టంలో అధికారం కీలకం అవుతుంది. సో.. పొత్తుకు ఉభయ పార్టీలు ఒకే చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. 

అయితే.. నడుస్తున్న చరిత్రను గమనిస్తే, గడచిన పాతికేళ్ళ ప్రస్థానంలో బీఆర్ఎస్  కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు సహా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంది. కానీ, బీజేపీతో మాత్రం ఏనాడూ పొత్తు పెట్టుకోలేదు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాల లేదు. మరో వంక   కాంగ్రెస్ తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. కేంద్రంలో, రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాలలో కలిసి పనిచేసింది. ఉభయ పార్టీలూ చెట్టపట్టాల వేసుకుని పనిచేయడమే కాదు, ఎమ్మెల్యేలను ఇచ్చిపుచ్చుకోవడాల విషయంలో కూడా రెండు పార్టీల మధ్య అవగాహన ఉందని, బీఆర్ఎస్ తో పొత్తు వద్దకునే బీజేపీ నాయకులు చరిత్రను తిరగేస్తున్నారు. అలాగే, కమలంతో పొత్తు వద్దనుకునే  బీఆర్ఎస్ నాయకులు, డీఎన్ఎలు కలవని బీజేపీతో పొత్తు వలన దీర్ఘ కాలంలో ప్రమాదమే  పేస్ చేయవలసి ఉంటుందని అంటున్నారు.  సో .. కవిత చెప్పిన విలీనం ఉండక పోవచ్చిని, అయితే గియితే కారు కమలం మధ్య తొలి  ‘పొత్తు’ పొడిచే అవకాశం లేక పోలేదని అంటున్నారు.

By
en-us Political News

  
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.