కవిత.. వాట్ నెక్ట్స్.. సర్వత్రా అదే చర్చ!

Publish Date:May 26, 2025

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె కల్వకుట్ల కవిత మనసులో ఏముందో..  ఆమె భవిష్యత్ రాజకీయ వ్యూహం ఏమిటో, ఏమో కానీ, ఆమె సంధించిన లేఖ మాత్రం సొంత పార్టీలో కంటే ప్రత్యర్ధి పార్టీలలోనే ఎక్కవ కలవరాన్ని సృష్టిస్తున్నట్లు ఉందని  రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 

 మరోవంక, కవిత నెక్స్ట్ మూవ్ ఏమిటి? ఆమె  అడుగులు  ఎటుగా పడుతున్నాయి.. అనే విషయంలో ఇటు మీడియాలో, అటు రాజకీయ పార్టీలలో విభిన్న కోణాల్లో జోరుగా  చర్చకు జరుగుతోంది. ఒకప్పుడు  వైఎస్సార్ కుమార్తె షర్మిల అన్న జగన్ రెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగరేసినప్పుడు, ఆమె చుట్టూ ఎంత రాజకీయ చర్చ జరిగిందో.. ఇప్పుడు  కవిత తిరుగు బాటు (?) పై అంత కంటే ఎక్కువగానే రాజకీయ రచ్చ జరుగుతోంది. ఓ వంక షర్మిల బాటలోనే కవిత కూడా సొంత పార్టీ పెట్టి, అదే రూట్ లో కాంగ్రెస్ లో కలిపేస్తారనే  వాదన రోజు రోజుకూ బలాన్ని పుంజు కుంటోందని అంటునారు. మరో వంక కవిత అదే రూటులో వెళ్ళక పోవచ్చనే అభిప్రాయం కూడా రాజకీయ చర్చల్లో అంతే ప్రముఖంగా వినిపిస్తోంది.

 అయితే.. కవిత నాయన కేసీఆర్ కు రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలు, అమెరికా నుంచి వచ్చిన వెంటనే శంషాబాద్ విమానాశ్రయంలోలో చేసిన   దయ్యాల  వ్యాఖ్యలు, దానిపై కేటీఆర్   స్పందించిన తీరు, బీఆర్ఎస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోవర్టులు ఉంటే ఉండవచ్చునని చేసిన మర్మగర్భ వ్యాఖ్యలు.. అలాంటి వారు  తమంతట తాముగానే బయట పడతారంటూ   కవిత పేరు ప్రస్తావించకుండానే ఆమె రేవంత్ రెడ్డి కోవర్ట్ కావచ్చనే విధంగా ఇచ్చిన సంకేతాలు, జరుగతున్న ఇతర పరిణామాలను గమనిస్తే.. ఆమె అడుగులు  అటుగా అంటే గాంధీ భవన్ వైపుగా పడుతున్నాయనే అనుమానాలను నిజం చేసేలా ఉన్నాయని అంటున్నారు. . 

కవిత తన లేఖలో ప్రధానంగా  బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగిన తీరు తెన్నులు, మంచిచెడులు, మరీ ముఖ్యంగా కేసీఆర్ ప్రసంగంలోని పాజిటివ్, నెగటివ్  అంశాలను  ప్రస్తావించారు. అందులో ప్రత్యర్ధి రాజకీయ పార్టీలపై చేసిన వ్యాఖ్యలను గమనిస్తే, ఆమె బీజేపీ వ్యతిరేక, కాంగ్రెస్ అనుకూల ధోరణితోనే  కేసీఆర్ ప్రసంగాన్ని విశ్లేషించినట్లు ఉందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా  కేసీఆర్ ప్రసంగంలో బీజేపీని అలా పైపైన ఒకటి రెండు పొడిపొడి మాటలతో వదిలేయడం, చిన్నిచిన్ని వాతలు మాత్రమే పెట్టి వదిలేయడం, తమ సహజ ధోరణిలో గట్టిగా  తిట్టక  పోవడం  కవితకు నచ్చలేదు. బీజేపీని కేవలం రెండు నిముషాలు మాత్రమే టార్గెట్ చేశారేంటి డాడీ  అంటూ ఆమె కేసీఆర్ కు వేసిన ప్రశ్నలో, కేసీఆర్ తన ప్రసంగంలో బీజేపీని, మోదీని బండకేసి ఉతికి ఆరేయ లేదనే బాధ వ్యక్తమైందని అంటున్నారు. అలాగే.. ఉర్దూలో ప్రసంగింక పోవడాన్ని, వక్ఫ్ బిల్లు ప్రస్తావన తేక  పోవడాన్ని కూడా కవిత తప్పు పట్టారు. అలాగే, దండకారణ్యంలో నక్సల్స్ ఏరివేత, నక్సలిజం నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న ఆపరేషన్ ని ఆపి నక్సల్స్ తో చర్చలు జరపాలని డిమాండ్ చేయడం బాగుందని, కేసీఆర్ ను కవిత మెచ్చు కున్నారు. ఇవేవీ కూడ బీజేపీకి రుచించే అంశాలు కాదు. బీజేపీతో కలిసి నడవాలని అనుకునే ఎవరూ  ఇలాంటి ఎజెండాను ముందు పెట్టరు. 

అంటే..  కవిత భవిష్యత్ ఎజెండా బీజేపీ వ్యతిరేక ఎజెండాగా ఉంటుందని చెప్పకనే చెప్పినట్లు అయింది. మరో వంక ఆమె  కేసీఆర్ తన ప్రసంగంలో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించక పోవడాన్ని మెచ్చుకున్నారు.  దీన్ని బట్టి చూస్తే, కవిత ఆలోచనలు కాంగ్రెస్ కు దగ్గరగా ఉన్నట్లు అర్థమవుతున్నదని విశ్లేషకులు అంటున్నారు. 

ఈ అన్నికంటే ముఖ్యంగా కవిత తెర పైకి తెచ్చిన సామాజిక తెలంగాణ  అంశం  రాహుల గాంధీ ప్రవచించిన, రేవంత్ రెడ్డి జపిస్తున్న కుల గణనకు దగ్గరగా ఉందని అంటున్నారు.  అలాగే..  రాష్ట్రంలో కవిత కథ నడుస్తున్న సమయంలోనే, ఢిల్లీలోని ఎఐసీసీ కార్యాలయంలో రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సామాజిక న్యాయ సదస్సు నిర్వహించడం..  అందుకోసం  ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనను మూడో రోజు కొనసాగించడం.. మరో వంక కవిత అమెరికా నుంచి వచ్చి రెండు రోజులు అయినా ఇంతవరకు కేసీఆర్ ను కలవక పోవడం, ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని వస్తున్న వార్తలు గమనిస్తే, కవిత బీఆర్ఎస్  నుంచి అనివార్యంగా బయటకు రావలసి వస్తే ... కాంగ్రెస్ దగ్గరవడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. అలాగే..  ప్రస్తుతానికి కవిత ఎవరితోనూ చేతులు కలపక పోవచ్చని, అన్ని కోణాల్లో పరిస్థితిని సమీక్షించుకున్న తర్వానే  తుది నిర్ణయం ఉటుందని అంటున్నారు.

By
en-us Political News

  
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.