కల్వకుంట్ల కవిత..కొత్త రాజకీయ అధ్యాయానికి ఆరంభం!

Publish Date:Sep 4, 2025

Advertisement

కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ తో  బీఆర్ఎస్ పార్టీలో గత కొంత కాలంగా సంచలనంగా మారి, పార్టీలో సంక్షోభానికి కారణమైన కేసీఆర్ తనయ కథ ముగిసినట్లేనా? అంటే కాదు అన్న సమాధానమే వస్తోంది. పరిశీలకులు బీఆర్ఎస్ లో అసలు కథ ఇప్పుడే మొదలైందంటున్నారు. కవిత కొత్త పార్టీ వార్తలు బీఆర్ఎస్ లో భారీ చీలకకు తెరలేపే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇప్పటికే పార్టీలో క్షేత్ర స్థాయిలో కవితకు మద్దతు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె రాజకీయం, కుటుంబ సెంటిమెంట్ లకు రంగరించి బీఆర్ఎస్ లో అత్యంత కీలకంగా ఉన్న హరీష్ రావు పై సంధించిన అస్త్రాలు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.  వాస్తవానికి ప్రస్తుతం అందరూ కవిత పొలిటికల్ గా తీసుకున్న టర్న్ ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలతో పోలుస్తున్నారు. అయితే అది సరికాదు. షర్మిల తన అన్నతో విభేదించి బయటకు రావడానికి రాజకీయ కారణాల కంటే ఎక్కువగా కుటుంబ వ్యవహారాలే కారణం అని చెప్పాల్సి ఉంటుంది. కానీ కవిత విషయం అలా కాదు.. కుటుంబ వ్యవహారాలతో పాటు.. బలమైన రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. పార్టీలో  తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్న విషయాన్ని ఆమె చాలా చాలా బలంగా ఎస్టాబ్లిష్ చేయగలిగారు. అంతే కాదు.. పార్టీలో ఆమె ఎప్పుడూ కీలకంగానే వ్యవహరించారు. పార్టీ అగ్రనేతలలో ఒకరిగా క్రీయాశీల పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆమె  ఏ మాత్రం తక్కువ చేసి చూడడానికి వీలు లేనంతగా మమేకమయ్యారు. తెలంగాణ జాగృతితో ఆమె తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ సారథిగా  బలమైన ముద్ర వేసుకున్నారు. 

ఇక ప్రస్తుతానికి వస్తే.. పార్టీ ఆమెను సస్పెండ్ చేస్తే.. ఆమె పార్టీకీ, ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికీ క్షణం ఆలస్యం చేయకుండా రాజీనామా చేసేశారు. అంతే కాదు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న హరీష్ రావుపై విమర్శలు గుప్పించారు. అవినీతి అనకొండగా మాజీ మంత్రి హరీష్ రావును అభివర్ణిస్తూ, ఆయన అవినీతి కారణంగానే కేసీఆర్ రెండో సారి సీఎం అయిన తరువాత హరీష్ కు గతంలో ఆయన నిర్వహించిన ఇరిగేషన్ శాఖ నుంచి తప్పించారని ఆరోపించడం ద్వారా కాళేశ్వరంలో అవినీతికి హరీషే కారణమని ఎస్టాబ్లిష్ చేశారు. 

ఇక కేటీఆర్ పై కూడా కవిత సుతిమెత్తగానే అయినా చాలా చాలా బలమైన ఆరోపణలూ, విమర్శలూ చేశారు. అదే సమయంలో తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ ను పన్నెత్తు మాట అనలేదు. తన రాజకీయ ఎదుగుదల సొంత అన్న కేటీఆర్ కే ఇష్టం లేదన్న విషయాన్ని పరోక్షంగానైనా బలంగా చెప్పారు. వాస్తవానికి కవిత తన పొలిటికల్ యాంబిషన్స్ ను ఎన్నడూ  గోప్యంగా ఉంచలేదు. ఒక ఎమ్మెల్సీగానో, లేదా రాజ్యసభ సభ్యత్వంతోనో సరిపెట్టుకోవడానికి తాను సిద్ధంగా లేననీ, పార్టీ  క్రియాశీల, కీలకమైన పోజిషన్ కు ఎదగడమే లక్ష్యమని ఆమె తొలి నుంచీ చాటుతూనే వచ్చారు. అయితే కేటీఆర్ తన సోదరే తనకు పోటీ అని భావించడంతోనే కుటుంబంలో సమస్యలు వచ్చాయనీ, అందుకే కవిత గతంలోనే బాహాటంగా కేసీఆర్ వినా మరెవరి నాయకత్వాన్నీ ఆను ఆమోదించబోనని విస్పష్టంగా చెప్పాల్సి వచ్చిందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కాగా బుధవారం ఆమె మీడియా సమావేశంలో తన పొలిటికల్ జర్నీని ఏపీసీసీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ మాజీ  ముఖ్యమంత్రి షర్మిల జర్నీతో పోల్చడాన్ని నిర్ద్వంద్వంగా ఖండించారు. అంతే కాదు.. పోల్చాల్సి వస్తే తనను కేసీఆర్ తో పోల్చాలని కూడా కవిత విస్పష్టంగా తనదైన శైలిలో చెప్పారు.  ఆమె వ్యూహాలు, ఎత్తులు నిశితంగా పరిశీలిస్తే..  కవిత కేసీఆర్ ల పొలిటికల్ స్ట్రాటజీస్ లో సారూప్యత కనిపిస్తుందని అంగీకరించి తీరాలి. 

గత కొంత కాలంగా.. అంటు ముఖ్యంగా లిక్కర్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చిన తరువాత నుంచీ కవిత ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా బీఆర్ఎస్ కు సమాంతరంగా తెలంగాణ జాగృతిని ఒక ఉద్యమ స్థయి పార్టీకి దీటుగా తీర్చి దిద్దారు. తద్వారా తన బలాన్ని, బలగాన్నీ పెంచుకుంటూ వచ్చారు. ఇక ఇప్పుడు ఆమె తన సొంత పార్టీ ప్రకటించడానికి ఎక్కువ సమయం తీసుకోకపోవచ్చునన్నది పరిశీలకుల అంచనా. ఒక వేళ వెంటనే పార్టీ ప్రకటన లేకపోతే కనుక.. తెలంగాణ స్థానిక ఎన్నికలలో కవిత.. తెలంగాణ జాగృతి తరఫున అభ్యర్థులను రంగంలోకి దించే అవకాశాలే మెండుగా ఉన్నాయి. దాని వల్ల తాను నిలబెట్టిన అభ్యర్థుల గెలుపొటములను పక్కన పెడితే.. ఈ పోటీ ప్రభావం బీఆర్ఎస్ పై ప్రతికూల ప్రభావాన్ని తప్పక చూపుతుంది. ఇప్పటికే వరుసగా రెండు ఎన్నికలలో ( 2023 అసెంబ్లీ, 2034 సార్వత్రిక) ఓడిపోయిన బీఆర్ఎస్.. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలలో కూడా పరాజయాన్ని మూటగట్టుకుంటే.. ఇక ఆ పార్టీ మళ్లీ తేరుకుని బలం పుంజుకునే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉంటాయన్నది కవిత అంచనాగా పరిశలకులు విశ్లేషిస్తున్నారు.

ఇక అదే సమయంలో కవిత బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ విఫలమయ్యారని కవిత అన్యాపదేశంగానైనా గట్టిగా చెబుతున్న మాటలు నిస్సందేహంగా పార్టీ క్యాడర్ పై ప్రభావం చూపుతాయి. ఇప్పటికే  నోటి దురుసుతనంతో, తొందరపాటు వ్యాఖ్యలతో  కేటీఆర్  నాయకత్వ పటిమపై ప్రజలలో  సందేహాలు వ్యక్తం అయ్యే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా బాంబులతో కాంగ్రెస్ పేల్చడం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఇలా తాయారైందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను జనమే కాదు, బీఆర్ఎస్ శ్రేణులు కూడా విశ్వసించడం లేదు. కేటీఆర్ ఇటువంటి వైఖరి నిస్సందేహంగా కవితకు కలిసి వచ్చే అంశమేనన్నది పరిశీలకులు విశ్లేషణ.   మొత్తం మీద కవిత రాజకీయ పరిణతి, అవగాహన  ముందు ముందు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్థకం చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయవర్గాలలో ఓ చర్చ అయితే  నడుస్తోంది.   

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.