Publish Date:Jul 27, 2024
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలు కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన కవిత బెయిలు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కవిత బెయిలు పిటిషన్ ను మరో సారి తిరస్కరించింది. ఈ నెలాఖరు వరకూ ఆమె జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఇదే కేసులో ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలకు కూడా బెయిలు దక్కని సంగతి తెలిసిందే.
కవిత దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను విచారించిన కోర్టు, తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది. అంతకు ముందు సీబీఐ గత నెల 7న దాఖలు చేసిన చార్జిషీట్ ను పరిగణనలోనికి తీసుకున్న కోర్టు.. కవితను శుక్రవారం (జులై 26) కోర్టులో హాజరు పరచాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు కవిత, కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు.
వాదనల అనంతరం కోర్టు ముగ్గురికీ కూడా బెయిలు నిరాకరించింది. ఇక సీబీఐ కేసుకు సంబంధించి కవిత బెయిలు పిటిషన్ ను కోర్టు గురువారం (జులై 24) నిరాకరించిన సంగతి విదితమే. ఇక కేజ్రీవాల్, మనీష్ సిసోడియాల కస్టడీని కోర్టు ఆగస్టు 8 వరకూ వాయిదా వేసింది. దీనిని బట్టి కవిత మరో రెండు వారాల పాటు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి. కవిత అరెస్టై నాలుగు నెలలు దాటిపోయింది. ఆమె మార్చి 15న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన సంగతి విదితమే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kalvakuntla-kavitha-bail-plea-25-181621.html
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.