కాళేశ్వరం ఎఫెక్ట్.. మోడీతో కాళ్లబేరానికి కేసీఆర్?

Publish Date:Feb 20, 2024

Advertisement

కాళేశ్వరం ఎఫెక్ట్ కేసీఆర్ ధైర్యాన్నీ, స్థైర్యాన్నీ కోల్పోయేలా చేసిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు, అవకతవకలపై రేవంత్ సర్కార్ సీరియస్ గా దృష్టి పెట్టిన నేపథ్యంలో తన చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నదన్న భయంలో కేసీఆర్ ఆసరా కోసం అర్రులు చాస్తున్నారా అంటే ఆయన హస్తిన పర్యటనకు రెడీ అయిపోవడం, అలాగే ప్రధాని మోడీ అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నించడం చూస్తుంటే ఔననక తప్పదని అంటున్నారు.

నిన్న మొన్నటి వరకూ ప్రధాని మోడీపై తనదైన ప్రత్యేక భాషలో విమర్శలు గుప్పించిన కేసీఆర్ ఇప్పుడు ఆయనతో స్నేహం కోసం తహతహలాడుతుండటం ఆయనలోని భయాన్ని ఎత్తి చూపుతోందని అంటున్నారు. పార్టీ పేరును టీఆర్ఎస్  నుంచి బీఆర్ఎస్ కు మార్చిన తరువాత ఆయన మోడీ విషయంలో చాలా చాలా దూకుడుగా విమర్శలు గుప్పించారు. ప్రధాని రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా, ఆయనకు ముఖం చాటేశారు. మోడీ అధికారిక పర్యటనకు తెలంగాణకు వచ్చిన సందర్భాలలో కూడా ముఖ్యమంత్రిగా ప్రధానిని రిసీవ్ చేసుకోవాలన్న సంప్రదాయానికి కూడా చెల్లు చీటీ పాడేశారు. అటువంటి కేసీఆర్ ఇప్పుడు ఆయనతో చెలిమికి వెంపర్లాడుతున్నారు. విపక్షంలో ఉండగా కేంద్రంతో సఖ్యత లేకుంటే చిక్కులు తప్పవని భావిస్తున్నారు.   అందుకోసం పీఎం మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అపాయింట్‌మెంట్ కోరారనీ, అప్పాయింట్ మెంట్ లభించేదీ లేనిదీ రానున్న రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందనీ అంటున్నారు. వారి అప్పాయింట్ మెంట్ లభ్యతను బట్టి ఈ వారంలో ఏ రోజైనా కేసీఆర్ హస్తిన పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

 సార్వత్రిక ఎన్నికల ముహూర్తం ముంచుకువస్తున్న నేపథ్యంలో కేసీఆర్ హస్తిన పర్యటన, మోడీ అప్పాయింట్ మెంట్ కోరడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  గత రెండేళ్లుగా కేసీఆర్ మోడీతో ముఖాముఖీ భేటీ అయిన సందర్భం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా  రాష్ట్రంలో రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ, బిజినెస్ స్కూల్, వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం.. ఇలా పలు కార్యక్రమాలకు ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటించారు. అయితే ఆ ఏ సందర్భంలోనూ సీఎం హోదాలో కేసీఆర్ ఆయనకు స్వాగతం పలకలేదు. ప్రోటోకాల్ ను కూడా ఖాతరు చేయకుండా మోడీకి దూరంగా మెలిగారు. పైపెచ్చు ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.  బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి మోడీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నించారు కూడా.

ఇప్పుడు తెలంగాణలో అధికారం కోల్పోయిన తరువాత ఆయన మోడీతో స్నేహం కోసం ప్రయత్నాలు చేయడానికి కాళేశ్వరం భయమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా నిన్నమొన్నటి వరకూ కేంద్రంలో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరిన ఆయన ఇప్పుడు కేంద్రంలో అధకారంలో ఉన్న బీజేపీతో పొత్తు కుదుర్చుకుని వచ్చే సార్వత్రిక ఎన్నికల గండాన్ని ఎలాగోలా దాటేయాలని భావిస్తున్నారని చెబుతున్నారు.   

అయితే బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర నేతలు ఒక వైపు విస్పష్టంగా చెబుతున్నా.. కేసీఆర్ మోడీ, నడ్డాల అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నించడం ప్రస్తుతం ఆ పార్టీ దయనీయ స్థితికి సంకేతమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు అంటూ వస్తున్న వార్తలకు  బీఆర్ఎస్ నుంచి  ఖండనలు కూడా రావడం లేదు.  దీంతో కాళేశ్వరం ఎఫెక్ట్ తో  కేసీఆర్ మోడీకి దాసోహం అనడానికి రెడీ అయిపోయారనీ అంటున్నారు. చూడాలి మరి కేసీఆర్ కు ప్రధాని అప్పాయింట్ మెంట్ లభిస్తుందో లేదో.  ఉమ్మడి ప్రత్యర్థి కాంగ్రెస్ ను తెలంగాణలో దెబ్బతీయడానికి బీజేపీకి కూడా బీఆర్ఎస్ అవసరం ఉందనీ, ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్యా పొత్తు పొడిచినా ఆశ్చర్యం లేదని కూడా చెబుతున్నారు. 

By
en-us Political News

  
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.