కేసీఆర్ కు కాళేశ్వరం కష్టాలు

Publish Date:Jul 20, 2022

Advertisement

ఇంజనీరింగ్ అద్భుతంగా కేసీఆర్ పదే పదే అభివర్ణిస్తున్నకాళేశ్వరం ఇప్పుడు వివాదాల కేంద్రంగా మారింది. రీ డిజైన్ పేరుతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును తనకు ఏటీఎంగా మార్చేసుకున్నారన్న విమర్శలు గతం నుంచీ వినిపిస్తున్నా.. ఇటీవలి వరదకు ప్రాజెక్టు పంపులు, మోటార్లు ముంపునకు గురైన నేపథ్యంలో మరో సారి విమర్శల దాడి పెరిగింది. ప్రాజెక్టు ఉనికే ప్రశ్నార్ధకమయ్యివందా అన్న స్థాయిలో సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

లక్ష కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మితమైన కాళేశ్వరంపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. పంపులు, మోటార్లు మునకపై టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించకపోవడం, విమర్శలకు సమాధానం చెప్పకపోవడంతో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. కాళేశ్వరం మోటార్లు, పంపుల మునకతో  అవి మళ్లీ పని చేస్తాయా, వాటి పునరుద్ధరణ ఎప్పటికి పూర్తవుతుంది వంటి ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి, నీటి పారుదల శాఖ నుంచి మౌనమే సమాధానం కావడం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. చిన్న పాటి విమర్శకే భారీ స్థాయిలో స్పందించి ఎదురుదాడికి దిగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రివర్గ సహచరులు పన్నెత్తి మాట్లాడడానికి కూడా ముందుకు రాకపోవడంతోనే కాళేశ్వరం ఎత్తిపోయిందా అన్న సందేహాలకు కారణమౌతున్నది.

 కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం, కన్నెపల్లి పంపుహౌస్‌‌‌‌‌‌‌‌లను గోదావరి వరదలు ముంచెత్తాయి. మొత్తం 29 మోటార్లు మునిగిపోయాయి. అయినా  అక్కడేం జరగనట్లుగానే రాష్ట్ర్ర ప్రభుత్వ వైఖరి ఉంది.   కాళేశ్వరం ఉనికిపై ముసురుకున్న సందేహాలకు వివరణ ఇస్తే చర్చ విస్తృతంగా జరిగి లోపాలు మరంతగా బయటపడతాయన్న భయంతోనే ప్రభుత్వం మౌనం వహించిందని పరిశీలకులు అంటున్నారు. ఇక వరదల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై ఇప్పటి వరకూ ఇరిగేషన్ శాఖ నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు.  దానికి తోడు అన్నారం, కన్నెపల్లి పంపుహౌస్‌‌‌‌‌‌‌‌ల పరిసరాల్లో పోలీస్‌‌‌‌‌‌‌‌ పహారా ఏర్పాటు చేశారు.

పంపుహౌస్‌‌‌‌‌‌‌‌ల వైపునకు ఎవరినీ, కనీసం మీడియాను  కూడా అనుమతించడం లేదు.  కాళేశ్వరం నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపం లేదని చెబుతూ భారీ వరదల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు. కానీ ఆ వాదనలో పస లేదనడానికి   దేవాదుల ప్రాజెక్టు ముంపునకు గురి కాకపోవడమే తార్కనమని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం గోప్యత పాటిస్తోందనీ, వైఫల్యాలను బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడుతోందనీ విమర్శకలు అంటున్నారు,  దేవాదులలో వరద ఉధృతి ఇంకా ఉన్నప్పటికీ మోటార్లు, పంపులు మునగకపోవడం.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సర్కారు చెబుతున్నవి అబద్దాలన్న వాదనకు కారణం అవుతోంది. కాళేశ్వరంపై విమర్శల దాడిని, చర్చకు పక్కదారి పట్టించడానికే సీఎం కేసీఆర్   క్లౌడ్ బరస్ట్, అంతర్జాతీయ కుట్ర, పోలవరంతో భద్రాచలానికి ముప్పు వంటి అంశాలను వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకువచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.