కాకినాడ కన్నబాబు కు అమెరికా ఆహ్వానం
Publish Date:Oct 17, 2012
Advertisement
కాకినాడ రూరల్ ఎమ్మేల్యే కన్నబాబును అమెరికాలోని ప్రజాస్వామ్య తీరుతెన్నులను పరిశీలించేందుకు రమ్మంటూ ఆహ్వానం వచ్చింది. దేశ వ్యాప్తంగా 4 రాష్టాలనుండి ఇందులో పాల్గొనడానికి గానూ వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి కన్నబాబు ఒక్కరే ఎంపిక కావడం విశేషం. ఈనెల 19 నుండి 10 నవంబరువరకు అక్కడి రాజకీయనాయకులతో, అధికారులతోనూ వారు చర్చలు జరుపుతారు. అంతేకాకుండా ఎన్నికల నిర్వహణ, వ్యవస్ధ , ఎన్నికల సరళి, ఎన్నికల నియమావళికి చెందిన తీరుతెన్నులపై పరిశీలన జరుపుతారు. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఫార్టీ ప్రచార పోకడలను కూలంకుషంగా అవగతం చేసుకుంటారు. రాజకీయ పార్టీల పాత్ర , మీడియాపాత్ర, ప్రభుత్వ ఫ్రాధాన్యం, సమాజంలో వ్యవస్ధ మూలాల తీరుతెన్నులపైనే కాకుండా అక్కడ రాజకీయ వాతావరణంపై ప్రపంచ దేశాలకు అవగాహన కల్పించేందుకే అమెరికా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.
http://www.teluguone.com/news/content/kakinada-rural-mla-24-18258.html





