వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ గిరిజనులను బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన ఆయన నెల్లూరు ఐదో ఎస్సీ, ఎస్టీ అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఈ నెల 3న విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణను ఇవాళ్టి వాయిదా వేసింది. ఇవాళ కూడా మరోసారి కేసులో వాదోపవాదాలు విన్న మెజిస్ట్రేట్ విచారణను ఈ నెల 9కి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అదేవిధంగా ఇదే కేసులో కాకాణిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సాయంత్రానికి తీర్పు వెలువడే అవకాశం ఉంది.
ఏ4గా ఉన్న కాకాణిని బెంగుళూరులో ఓ రిసార్టులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించేందుకు మొదట నాయుడుపేట ఏపీపీ కేథార్ నాథ్‌ను స్పెషల్ పీపీగా బాధ్యతలు ఇచ్చి నెల్లూరుకు పంపింది ప్రభుత్వం. నేడు కేథార్ నాథ్ స్థానంలో గుంటూరు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రొసీక్యూషన్ రాజేంద్ర ప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో నెల్లూరు ఎస్సీ ఎస్టీ 5వ అదనపు ప్రత్యేక న్యాయస్థానానికి రాజేంద్రప్రసాద్ చేరుకుని కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kakani-govardhan-reddy-39-199362.html
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలోని ఓ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఉదయం చెలరేగిన మంటలు ఆలయం ముందున్న చలువ పందిళ్లకు వ్యాపించాయి.
ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా తయారౌతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడి అనాలోచిత నిర్ణయాలతో బీఆర్ఎస్ ములుగులో పట్టు కోల్పోతోంది.
తిరుమల అంటే కోట్లాది మంది హిందువులు మనోభావాలతో ముడిపడిన అంశం. టీటీడీ పై దుష్ప్రచారం పోయినంతగా మంచి బయటకు పోవడానికి కొంత ఆలస్యమవుతుంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ గురువారం (జూలై 3)న పెరిగింది.
శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం మండలం, టి.బరంపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తిప్పన. పురుషోత్తం రెడ్డి గ్రామానికి విచ్చేసిన సందర్బంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరును దుర్వినియోగం చేస్తూ, కళాకారుల నుంచి లక్షల రూపాయలు తీసుకొని మోసగించిన కేసులో కేటుగాడిని తిరుమల వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రూ.1.5 కోట్ల విలువైన 650 గ్రాముల హెరాయిన్‌ను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ టీడీపీ రంగంలోకి దిగనుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో నందమూరి సుహాసినిని అభ్యర్థిగా బరిలోకి దించాలని పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ఏపీ మద్యం కేసులో కీలక పరిమాణామం చోటుచేసుకుంది.నిందితుల బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి చుక్కెదురైంది.
చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ అజ్ఞాతంలోకి వెళ్ళారా? లేక అనారోగ్యంతో విధులకి దూరంగా ఉంటున్నారా? తెలియరావడం లేదు. మే 21 నుంచి జూన్ 5 వరకూ జింగ్ పింగ్ కనపడలేదు.
ఎట్టకేలకు వల్లభనేని వంశీకి బెయిల్ దొరికింది ...140 రోజుల జైలు జీవితానికి మోక్షం లభించింది ...అయితే ఇప్పుడే వంశీని జైలు జీవితం విడిపోతుందా! లేక ఇంకేమైనా ఈ కథలో టెస్టులు ఉంటాయా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి
శాంతిభద్రతల సమస్య సృష్టించడానికే వైసీపీ అధినేత జగన్ రెడ్డి జైలు యాత్ర చేపట్టనున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేస్తామంటే కుదరదని ఆయన అన్నారు.
కర్నూల్ -విజయవాడ మధ్య ఇండిగో విమాన సర్వీసులను కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్‌గా దీన్ని ప్రారంభించారు