కడప టీడీపీలో అసమ్మతి సెగలు

Publish Date:Sep 22, 2025

Advertisement

 

కడప అసెంబ్లీ తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు బహిరంగమయ్యాయి. ఎమ్మెల్యే మాధవి రెడ్డి పట్ల ఆమె భర్త,  టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పట్ల దేశం నాయకులు పలువురు నిరసనకు దిగారు. తెలుగుదేశం పార్టీ జెండాలు మోసిన వారిని,ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టి వైసిపి నుంచి వచ్చిన వారికి  ప్రాధాన్యమిస్తున్నారు అంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ దేవుని కడపలోంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారికి మంచి బుద్ది ప్రసాదించాలని అక్కడి దేవుని కడప ఆలయంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి వినతి పత్రం సమర్పించారు. 

ఈ కార్యక్రమం కడప తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలను బట్టబయలు చేసింది. స్థానిక ఎన్నికలు జరుగనున్న  నేపథ్యంలో ఎమ్మెల్యే పట్ల, శ్రీనివాస్ రెడ్డి పట్ల వ్యతిరేకత తెలియజేస్తూ అసమ్మతి నాయకులు గుంపు కట్టడం నియోజకవర్గ తెలుగుదేశం రాజకీయాల్లో  రచ్చగా మారింది. టీడీపీ సీనియర్ నేత కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీగా సీనియర్ కార్యకర్తలు,నాయకుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అది నుండి టీడీపీ జెండా మోసిన కార్యకర్తలకు ఎమ్మెల్యే తీవ్ర అన్యాయం చేస్తుందంటూ మండిపడ్డారు. ఇటీవల పార్టీల చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తూ సీనియర్లను తొక్కేస్తుందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. 

కార్యక్రమం అనంతరం కమలాపురం సీనియర్ నాయకుడు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిని కలిశారు. కడప నియోజవర్గ టిడిపి సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, మురళి, కొండాసుబ్బయ్య, మహిళా నేతలు, యువ కార్యకర్తలు, నాయకులు పుత్తా నరసింహ రెడ్డి వద్ద వారి ఆవేదన వ్యక్తం చేస్తూ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పార్టీ కోసం కష్టపడిన మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ వాపోయారు.

ప్రశ్నిస్తే కేసులు పెట్టి పోలీసులతో బెదిరింపులకు గురి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆగడాలకు తట్టుకోలేకపోతున్నామని,అంబేద్కర్ రాజ్యాంగం కడపలో నడవడం లేది శ్రీనివాసరెడ్డి రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. 

ఎమ్మెల్యే గెలుపు కోసం పోరాటం చేస్తే గెలిచాక మమ్మల్నివెలివేసిందని, వైసీపీ కార్పోరేటర్లను పార్టీలో చేర్చుకొని వారికి పెద్దపీట వేస్తున్నారని,వారి కాళ్ల దగ్గర ఉన్న వారికే పార్టీ పదవులు, ఇన్‌ఛార్జులు, పనులు కట్టబెడుతున్నారని అన్నారు.ఇంత సీనియార్టీ ఉన్న మమ్మల్ని పట్టించుకోకపోవడం దుర్మార్గమని, మా సమస్యలను  అధిష్టానం దృష్టికి తీసుకెళ్లండి అంటూ ఆయన్ను కోరారు. ఈ మేరకు పుత్తాకు వినతి పత్రం సమర్పించారు. సీఎం చంద్రబాబు నాయుడును ,లోకేష్ బాబును కలిసే విధంగా ఏర్పాట్లు చేయాని కోరారు.

By
en-us Political News

  
ఈ మహానాడులో తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లోకేష్ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కేవలం 31 లక్షల ఓట్ల తేడాతో పరాజయం పాలైందని, అక్కడ తొలగించిన ఓట్ల సంఖ్య దీనికంటే ఎంతో ఎక్కువగా ఉందని చెప్పిన జగన్.. అలాగే.. తమిళనాడులో డీఎంకే కూటమి 17 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, అక్కడ కూడా 74 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా ఫలితాలు తారుమారయ్యేలా చేశారని ఎత్తి చూపారు. . ఈ భారీ ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసిందని జగన్ విమర్శించారు.
అధికార బదిలీ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సిద్ధరామయ్య స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని అంటున్నారు. అధిష్టానం సూచనల మేరకు రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఆ వెంటనే నూతన సీఎం ఎంపిక ప్రక్రియ లాంఛనంగా ముగుస్తుందని అంటున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా, తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి తీరుతాం అని మహానాడు వేదికగా లోకేష్ ప్రకటించారు.
ఈ రెండు రోజుల వేడుకలో వివిధ అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది.
ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం విజయ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని మోదీతోనే కాకుండా విజయ్ తన హస్తిన పర్యటనలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను ఎక్స్ టెండ్ చేసుకున్నారు. గురువారం( మే 28) ఉదయం బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు ఆయన హాజరుకావలసి ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటకకు చెందిన అగ్ర నాయకుల మధ్య సుమారు ఏడు గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా పూర్తి మద్దతు ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.