కడప సెంట్రల్ జైలు అవినీతి అక్రమాలపై డీజీ ఆరా
Publish Date:Jul 29, 2025
Advertisement
కడప కేంద్ర కారాగారంలో ఇటీవల సెల్ఫోన్లు పట్టుటబడిన వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసింది.కొద్ది రోజుల క్రితమే కొందరులపై చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ జైల్లో జరుగుతున్న అక్రమాల తంతుపై జైల శాఖ డిజి టల్ మరోసారిఆరా తీసినట్లు సమాచారం. రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ) అంజనీ కుమార్ కడప సెంట్రల్ జైలు ను మంగళవారం తనిఖీ చేశారు. సెంట్రల్ జైల్లోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సెంట్రల్ జైలులోకి మొబైల్స్ ఏవిధంగా వస్తున్నాయి. అనే దానిపై మరోసారి ఆరాతీశారు. అనంతరం సెంట్రల్ జైలు అధికారులు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులను తీవ్రస్థాయిలో మందలించినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే తీవ్ర స్థాయిలో చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం. సెంట్రల్ జైలు లో ఖైదీ వద్ద సెల్ఫోన్లు లభించడంతో విధుల్లో నిర్లక్షం వహించారని అధికారులు ఏడుగురు జైలు సిబ్బంది పై చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఇలా చర్యలు తీసుకున్నప్పటికీ మరోసారి జైలు శాఖ డైరెక్టర్ జనరల్ కేంద్రకారాగారాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విజిట్ లో భాగంగా విజయవాడ నుంచి కడప సెంట్రల్ జైలుకు రావడం జరిగిందని తెలిపారు, కడప సెంట్రల్ లోపల లోపల అందరూ సీనియర్ ఆఫీసర్స్ జైలు వార్డన్స్ తో మీటింగు నిర్వహించి పలు భద్రత అంశాలు పై చర్చించడం జరిగిందన్నారు. కడప సెంట్రల్ జైల్లో కొన్ని సమస్యలు రెండు మూడు నెలలుగా ఉండడం ముఖ్యంగా ఒకే ఖైదీ వద్దనుంచి సెల్ ఫోన్స్ రికవరీ సంబంధించి డిఐజి రవి కిరణ్ గత వారంలో విజిట్ చేసి ఎంక్వైరీ రిపోర్టు ఇవ్వడం జరిగిందని అన్నారు ఈ రిపోర్టు ప్రకారం కొన్ని లోపాలు గుర్తించడం జరిగిందన్నారు. ఎంక్వయిరీ రిపోర్టు ప్రకార కొంతమంది పైన క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని, మరికొందరి ని సస్పెండ్ కూడా చేశామని తెలిపారు. ఇక్కడ ఉన్న అధికారులపై నాకు నమ్మకం ఉంది భవిష్యత్తులో లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని అన్నారు, అదేవిధంగా ఉమెన్ జై ల్ సూపర్డెంట్ కొన్ని కొత్త ప్రపోజల్ తెలిపారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ మేనేజ్మెంట్ ఫర్ ఉమెన్ బిజినెస్ గురించి తెలిపారన్నారు. కడప సెంట్రల్ జైల్లో కొంతమంది వార్డెర్స్ అండ్ హెడ్ స్పోర్ట్ యాక్టివిటీ ప్రమోషన్స్ కోసం ఒక కొత్త ప్రపోజల్ కింద వర్క్ స్టార్ట్ అయిందని తెలిపారు. జైల్లో యోగా మదనపల్లి సత్సంగ్ ఫౌండేషన్ కింద మదనపల్లిలో ఒక సక్సెస్ ఫౌండేషన్ ఉన్నదని దీని ద్వారా కడప, నెల్లూరు, రాజమండ్రి, వైజాగ్ ,గుంటూరు జిల్లాలలో ఇలా ప్రతి సెంట్రల్ జైల్లో అదేవిధంగా ప్రతి డిస్టిక్ జైల్లో యోగా సర్టిఫికేషన్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది అని తెలిపారు. రానున్న ఆరు నెలల్లో ప్రతి జైలు నుంచి 15 నుంచి 20 మంది ఖైదీలను యోగా శిక్షకులుగా తయారు చేస్తామన్నారు. ఖైదీల్లో పరివర్తన తీసుకు రావడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. జైలు శిక్ష తర్వాత సొసైటీలో ప్రతి వ్యక్తికి ఒక రెస్పెక్టివిటీ జీవించే హక్కు కలిగి ఉండాలి అన్నారు, ఈ సర్టిఫికెట్ కు ఆల్ ఇండియా వాలిడిటీ ఉన్నది అన్నారు. ఆరు నెలల్లో సెంట్రల్ ,జిల్లాలో కనీసం మినిమం 10 నుండి 15 యోగ సెంటర్స్ ను తయారు చేస్తామన్నారు.
http://www.teluguone.com/news/content/kadapa-central-jail-39-203046.html





